రాజ్ భవన్ కింద అద్భుతం

09:30:00 Add Comment




ఒకటి కాదు రెండు ఏకంగా 150 మీటర్ల పొడవైన పాతకాలం నాటి బంకర్ ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వెలికి తీశారు. రాజ్ భవన్ పరిసరాల్లో ఓ భారీ బంకర్ ఉందని ఆయనకు కొందరు పూర్వీకులు సమాచారం ఇచ్చిన మేరకు దీనిని వెలుగులోకి తెప్పించారు. ఆయన ఉంటున్న మల్బార్ హిల్స్ లోని రాజ్ భవన్ కింద దీనిని గుర్తించారు. సాధారణంగా ఉండే బంకర్లకంటే ఇది భిన్నంగా ఉంది. అతి పొడవుగా ఉండి చిన్నచిన్న గదులతో ఉన్న ఈ బంకర్ ఆశ్యర్యం గొలిపేలా ఉంది. దీనిని రెండు వైపులా 20 అడుగుల ఎత్తయిన తలుపులు ఉన్నాయి.
దీంతోపాటు దీనికి ప్రత్యేక మురుగనీటి పారుదల వ్యవస్ద లోపలికి వెళుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీనికి తూర్పు వైపు ఉన్న ద్వారాన్ని మూసి పశ్చిమ వైపు ద్వారం తెరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని మూసి దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా బంకర్ ఉండటం ఆశ్చర్యకరం.
గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర అధికారులు ఈ బంకర్ ను సందర్శించారు. ప్రత్యేక పురావస్తు అధికారులకు చెప్పి దాని సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. ఈ బంకర్ లో మొత్తం 13గదులు ఉన్నాయి. మొత్తం 5000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఇందులో షెల్ స్టోర్, గన్ షెల్, కాట్రిజ్ స్టోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్ షాప్ వంటి రూములు ఇందులో ఉన్నాయి. దీనిని చక్కగా సంరక్షిస్తే మంచి పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చెందడం ఖాయం అని అధికారులు చెబుతున్నారు.

కృష్ణా పుష్కరాలకు విజయవాడ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు !

04:49:00 Add Comment



కృష్ణా పుష్కరాలకు పశ్చిమ గోదావరి జిల్లా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా ఈస్‌ కోస్ట్ రైల్వే ఐదు ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. పుష్కరం స్పెషల్‌ ట్రైన్‌ పేరుతో ఈ రైళ్ళను నడపనున్నారు. రాయగడ్ నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌కు ట్రైన్‌ నెంబరు 08505 ఆగస్టు 11, 16, 19, 22న రాయగడ్‌లో మధ్యాహ్నం 2.30 (14.30) గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటలకు కృష్ణాకెనాల్‌ జంక్షన్‌కు చేరుకుంటుంది. ట్రైన్‌ నెంబరు 08506 కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ నుంచి రాయగడ్‌కు రాత్రి 8.45 (20.45) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు రాయగడ్ చేరుకుంటుంది. ఈ రైలు కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ నుంచి ఆగస్టు 12, 17, 20, 23 తేదీల్లో ప్రయాణిస్తుంది. ఈ రెండు రైళ్ళు మార్గమధ్యంలో ఇరువైపులా పార్వతీపురం టౌన్‌, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, డొంకినవలస, గజపతినగరం, గరుగుబిల్లి, కొత్తవలస, సింహాచలం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, గుణదల, విజయవాడలలో ఆగనుంది. అంతేకాక ప్రధాన రైల్వేస్టేషన్లయిన రాయగడ్, విజయనగరం, విశాఖపట్నంలలో ఎక్కువ సమయం ఆగుతుంది. ఈ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ 10 బోగీలు, స్లీపర్‌క్లాస్‌ మూడు బోగీలు, ఏసి 3-టైరు ఒక బోగి, గార్డు కం లగేజీ వ్యాన్స్‌ రెండు ఉంటాయని తెలిపారు.

విశాఖపట్నం - గుంటూరు జంక్షన్‌ - విశాఖపట్నం
విశాఖపట్నం నుంచి ట్రైన్‌ నెంబరు 08507 ఆగస్టు 11, 12, 13, 14, 16, 17, 19, 20, 21, 22 తేదీలలో రాత్రి 11 (23.00) గంటలకు బయలుదేరి గుంటూరుకు, మరుసటిరోజు ఉదయం 6.45 గంటలకు చేరుకుంటుంది. ట్రైన్‌ నెంబరు 08508 గుంటూరులో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.20 (17.20) గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 12, 13, 14, 15, 17, 18, 20, 21, 22, 23 ఈ రెండు రైళ్ళు విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, గుణదల, మంగళగిరిలలో కూడా ఆగుతాయి. ఈ రైళ్ళలో గార్డుకం లగేజీ వ్యాన్స్‌ రెండు బోగీలు, సెకండ్‌ సిట్టింగ్‌ ఎనిమిది బోగీలు, స్లీపర్‌ క్లాసెస్‌ ఐదు బోగీలు ఉంటాయి.

విజయవాడ - విశాఖపట్నం - విజయవాడ
విజయవాడలో ట్రైన్‌ నెంబరు 07753 రాత్రి 11.30 (23.30) గంటలకు బయలుదేరి విశాఖపట్నం మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ ఆగస్టు 11, 12, 13, 14, 18, 19, 20, 21 తేదీల్లో ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి ట్రైన్‌ నెంబరు 07754 ఉదయం 8.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.50 (15.50) గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్ళు విజయవాడ, గుణదల, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నంలలో ఆగుతాయి. ఈ రైలులో గార్డు కం లగేజీ వ్యాన్స్‌ రెండు, సెకండ్‌ సిట్టింగ్‌ ఐదు బోగీలు, స్లీపర్‌క్లాస్‌ ఏడు బోగీలు, 3-టైర్‌ ఏసి రెండు బోగీలు, 2-టైర్‌ ఏసీ ఒక బోగి మొత్తం 17 బోగీలతో రైలు ఇరువైపులా ప్రయాణిస్తుంది.

పూరీ - గుంటూరు - పూరీ
పూరీ నుంచి ట్రైన్‌ నెంబరు 08405 ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ ఆగస్టు 11, 16, 19, 22 తేదీలలో ప్రయాణిస్తుంది. గుంటూరు నుంచి ట్రైన్‌ నెంబరు 08406 రాత్రి 7 (19.00) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.25 గంటలకు పూరీ చేరుకుంటుంది. మార్గ మధ్యంలో ఉన్న అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ రెండురైళ్ళు ఆగుతాయి. గార్డ్‌ కం లగేజీవ్యాన్‌లు రెండు బోగీలు, సెకండ్‌సిట్టింగ్‌ 9 బోగీలు, స్వీపర్‌ క్లాసులు మూడు బోగీలు, 3-టైర్‌ ఏసీ ఒక బోగి ఉంటుంది.

తిరుపతి - విశాఖపట్నం - తిరుపతి
తిరుపతి నుంచి ట్రైన్‌ నెంబరు 07747 మధ్యాహ్నం 2 (14.00) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.45 గంటలకు విశాఖపట్నం చేరుకుటుంది. ఈ రైలు ఆగస్టు 12, 19 తేదీల్లో మాత్రమే ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి ట్రైన్‌ నెంబరు 07748 ఉదయం 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.45 (19.45) గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైను ఆగస్టు 13, 20 తేదీల్లో మాత్రమే ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో గూడూరు, కృష్ణాకెనాల్‌, రాజమండ్రిలతో పాటు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుణదల, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, రేణుగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్ళలో గార్డు కం లగేజీ వ్యాన్‌లు రెండు, సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ బోగీలు ఆరు, స్లీపర్‌ క్లా్‌స బోగీలు ఏడు, 3-టైర్‌ ఏసీ బోగీ ఒకటి, 2-టైర్‌ ఏసీ బోగీ ఒకటి ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో కుప్పకూలిన భవనం

02:35:00 Add Comment

 నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. ఆ ఇద్దరూ కూలీలుగా తెలుస్తోంది.  మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఎనిమిది పిల్లర్లు నేలమట్టమయ్యాయి. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సినిమా ఛాన్స్‌ల కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చే వారితో నిత్యం ఫిల్మ్‌నగర్ కిటకిటలాడుతోంది. అలాంటి చోట ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.కల్చరల్ సెంటర్ కు దగ్గర ఓ భవనం నిర్మాణం అవుతోంది. శనివారం రాత్రి శ్లాబ్ నిర్మాణం వేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కొంతమంది కూలీలు పని చేసేందుకు వచ్చారు. 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. 14 ఫిల్లర్లు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పని చేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై కూలీలను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది కూలీలకు గాయాలు కావడంతో వీరిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిర్మాణం విషయంలో నాణ్యత లోపించడం వల్లే భవనం కుప్పకూలిందని తెలుస్తోంది. భవనానికి సంబంధించిన వారు అందుబాటులోకి లేకపోవడంతో ఎలాంటి సమాచారం తెలియడం లేదు.
ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు ? కూలిన సమయంలో ఎంత మంది కూలీలు ఉన్నారు ? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు ? అనే వివరాలు తెలియరావడం లేదు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

నాగార్జున స్వయంగా పాడిన పాట

22:12:00 Add Comment



శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ హీరోగా పరిచయమౌతున్న 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రంలోని కొత్త కొత్త భాష.. అనే పాటను హీరో అక్కినేని నాగార్జున పాడారు. ఈ పాట వీడియోను నాగార్జున్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఎప్పటిలాగే కొత్తగా ప్రయత్నించా.. అని ట్వీట్‌ చేశారు. నాగార్జున అప్పుడప్పుడు గెస్ట్ రోల్ లో తళుక్కున మెరుస్తుంటారనే సంగతి తెలిసిందే. మనసుకు నచ్చితే, సినిమాకి అవసరమనుకొంటే ఆయన ఏమాత్రం ఆలోచించరు. త్వరలో నాగ్‌ రెండు చిత్రాల్లో అతిథిగా సందడి చేయబోతున్నారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్‌'లో నాగార్జున ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రానికి జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తూ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రోషన్‌ సరసన శ్రేయాశర్మ నటిస్తున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో సితారామరాజు సినిమాలో నాగార్జున సిగరెట్ గురించి ఓ పాట పాడారు. ఇపుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 'నిర్మలా కాన్వెంట్'లో పాట పాడుతునప్నాడు. నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

స్టాలిన్‌ నేతృత్వంలో ఆంధ్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన

01:29:00 Add Comment

పాలారులో చెక్‌ డ్యాం ఎత్తు పెంచుతున్న ఆంధ్రప్రభుత్వ వైఖరికి నిరసనగా డీఎంకే కోశాధికారి స్టాలిన్‌ నేతృత్వంలో మంగళవారం వేలూరులో ఆందోళన జరుగుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ తెలిపారు. వేలూరు జిల్లా డీఎంకే కార్యవర్గం అత్యవసర సమావేశం ఆదివారం ఉదయం కాట్పాడి ఎమ్మెల్యే దురైమురుగన్‌ అధ్యక్షతన జరిగింది. తమిళనాడు జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా పాలారులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చెక్‌డ్యాం ఎత్తు పెంపు పనులు అడ్డుకోలేని తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. తర్వాత విలేకరులతో దురైమురుగన్‌ మాట్లాడుతూ తమిళనాడు ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీసే విషయాలపై అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం పాలారులో చెక్‌డ్యామ్‌ ఎత్తు పెంపు నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయలేదని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించడానికి కూడా ప్రయత్నించలేదని ఆరోపించారు. పాలారులో ఆంధ్ర ప్రభుత్వం చెక్‌డ్యామ్‌ ఎత్తును పెంచితే అది తిరువణ్ణామలై, కాంచీపురం, వేలూరు జిల్లా రైతుల జీవనాధారాన్ని ఘోరంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వేలూరు కలెక్టరు కార్యాలయం వద్ద డీఎంకే కోశాధికారి స్టాలిన్‌ అధ్యక్షతన మంగళవారం ఆందోళన జరుగుతుందని, గతంలో హొగినెకల్‌ ఉమ్మడి తాగునీటి కోసం జరిగిన ఆందోళనలో 25 వేల మంది పాల్గొన్నారని, ప్రస్తుత సమస్య మూడు జిల్లాల ప్రజలకు సంబంధించింది కావడంతో ఈ ఆందోళనలో లక్ష మంది పాల్గొంటారన్నారు. సమస్యకు పరిష్కారం లభించేవరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంకే వేలూరు కేంద్ర జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్‌, నగర కార్యదర్శి, ఎమ్మెల్యే కార్తికేయన్‌, కేంద్ర జిల్లా ప్రిసీడియం ఛైర్మన్‌ మహ్మద్‌ సఖి, నగర ప్రిసీడియం ఛైర్మన్‌ విజయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం ఎన్నిక‌ల్ల బ‌రిలోకి జ‌న‌సేన ?

22:17:00 Add Comment

గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం ఎన్నిక‌ల్లో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌రిలోకి దిగుతాడ‌ని న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌మ‌ని చెప్పుకునే కొంద‌రు యూత్ లీడ‌ర్స్ వైజాగ్ లో ఇప్పుడు నానా హంగామా సృష్టిస్తున్నారు. వైజాగ్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ సార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసార‌ని క‌న్ఫామ్ చేసేస్తున్నారు. ఇక ప‌వ‌న్ స్టార్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ వైజాగ్ లో పోటీ చేసే విష‌యంలో ఒక ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. గ‌తంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లను లైట్ తీసుకునే వారేమో కానీ ఇప్పుడు ఆ ఎన్నిక‌లు పార్టీలకు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. కీల‌క న‌గ‌రాల్లో పాగా వేస్తే రాజ‌కీయంగా తిరుగు ఉండ‌ద‌నే వాస్త‌వాన్ని పార్టీలు గుర్తించాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ఇలానే పార్టీలు త‌మ స‌ర్వశ‌క్తుల‌ను ఒడ్డాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక రాజ‌ధానిగా పేరుగాంచిన విశాఖ కూడా పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మే. అందుకే టీడీపీ, వైసీపీ స‌హా ఇత‌ర ప్ర‌ధాన పార్టీలు వైజాగ్ పీఠంపై క‌న్నేశాయి. అందుకే ఇప్ప‌టినుంచే ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాయి. మాజీ ఎంపీ , గ‌తంలో వైజాగ్ మేయ‌ర్ గా ప‌నిచేసిన స‌బ్బం హ‌రికి గాలం వేసేందుకు అటు బీజేపీ, ఇటు టీడీపీ విశ్వ ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాలు, నాయ‌కులు, వ్యూహాలు ఇలా ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు వైజాగ్ లో మోహ‌రించాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇప్ప‌టి సింగిల్ వ్యూహం కూడా లేని, అస‌లు ఇప్ప‌టివ‌ర‌కూ పోటీ చేస్తారో చేయారో తెలియ‌ని జ‌న‌సేన‌ పార్టీ విశాఖలో జెండా ఎలా పాత‌గ‌ల‌దు అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు రాజ‌కీయ పార్టీలు కూడా ఇదే విష‌యాన్ని చెప్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేనియా వైజాగ్ లో ప‌నిచేయ‌ద‌ని, వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉండే ఈ న‌గ‌రంలో భిన్న రాజ‌కీయ వ్యూహాలే ప‌నిచేస్తాయ‌ని చెప్తున్నారు.

టి-కాంగ్రెస్‌ని ఆదుకునే నేత ఎవ‌రు?

22:10:00 Add Comment

కాంగ్రెస్ క‌న్ను తెలుగు రాష్ట్రాల‌పై ఉందిప్పుడు. ఓ వైపు యూపీ ఎన్నిక‌ల కోసం క‌స‌ర‌త్తులు చేస్తూనే తెలుగునాట జ‌రిగే ఎన్నిక‌లపైనా అధినేత్రి దృష్టి సారించారుట‌. 2019 ఎన్నిక‌ల గురించి దిల్లీ అధిష్ఠానం ఇప్ప‌టినుంచే పాచిక‌లు వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చీ.. ఆ ప్రాంతంలో వెన‌క‌బాటు త‌నానికి కార‌ణ‌మేంటో అర్థంగాక మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు కాంగ్రెస్ పెద్ద‌లు. ఏదైతేనేం ఉత్త‌మ్ కుమార్ ని టి-కాంగ్రెస్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి కొత్త ర‌క్తం ఎక్కించాల‌ని ప్లాన్ చేశారు. తెలంగాణ‌లో కీల‌క‌నేత‌లంతా గులాబీ గూట్లో చేరిపోవ‌డంతో ఈ స‌న్నివేశం త‌లెత్తింది. రేసులో అర‌డ‌జ‌ను మంది ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మాజీ క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దీన్‌తోపాటు న‌టి విజ‌య‌శాంతి, మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్‌ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనలో ఉన్నారు. అయితే ఇంత‌మందిలో అంద‌రినీ రాముల‌మ్మ డామినేట్ చేసేస్తోందని, సినీగ్లామ‌ర్ ముందు అన్నీ ప‌రేషాన్ అవుతున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ విజ‌య‌శాంతికే ఎక్కువ స‌పోర్టునిస్తున్నార‌ని, అలాగే అజార్ పేరును ఆయ‌న ప్ర‌తిపాదించార‌ని చెప్పుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన త‌ర్వాత మ‌ళ్లీ యాక్టివ్‌గా క‌నిపించ‌ని విజ‌య‌శాంతికి ఏ కోణంలో ప‌గ్గాలు అప్ప‌జెబుతార‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఏదేమైనా రేసులో రాముల‌మ్మ టాప్ పొజిష‌న్‌లోనే ఉంది ఇప్ప‌టికి.

కంచెని మెచ్చుకున్న కేటీఆర్‌

22:05:00 Add Comment

‘కంచె’.. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ప్రత్యేకత సంపాదించుకున్న ఈ సినిమా, గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకొని సత్తా చాటింది. ఒక భావోద్వేగపూరిత కథకు, కొత్త నేపథ్యానికి జోడించి దర్శకుడు క్రిష్ చేసిన ప్రయోగానికి అప్పట్లోనే సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు దక్కగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో కేటీఆర్ ఇప్పటివరకూ ‘కంచె’ సినిమా చూడలేకపోయారు. ఇక ఈ ఇదయం వీలు కుదుర్చుకుని సినిమా చూసిన ఆయన, దర్శకుడు క్రిష్, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌లపై ప్రశంసలు కురిపించారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ డైరెక్షన్‌ను ఆయన బాగా మెచ్చుకున్నారు. ప్రస్తుతం క్రిష్, కంచె సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఆదిత్య 369కు పాతికేళ్లు

22:00:00 Add Comment

ఈ రోజు రిలీజై హిట్టయిన సినిమాను రెండేళ్ల తర్వాత చూస్తే ఔట్ డేటెడ్ అనిపిస్తుంటాయి. తెలుగులో అయినా.. ఇంకో భాషలో అయినా ఇలాంటి సినిమాలే ఎక్కువ వస్తుంటాయి. కానీ ఎన్నేళ్ల తర్వాత చూసినా రిఫ్రెషింగ్‌గా, ఆసక్తికరంగా, కొత్తగా అనిపించే సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. ‘ఆదిత్య 369’ అలాంటి సినిమానే. 1991 జులై 18న రిలీజైందీ సినిమా. సోమవారంతో ఈ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తవుతుండటం విశేషం. పాతికేళ్ల నాటి సినిమా అయినా సరే.. ఇప్పటికీ కొత్తగా అనిపించడం ఈ సినిమా విశేషం. ఈ తరం ప్రేక్షకులు చూసినా ఈజీగా కనెక్టయిపోతారు.
ఈ సినిమాలో హీరో గతంలోకే కాక భవిష్యత్తులోకి కూడా ప్రయాణించినట్లు చూపిస్తారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నిజంగానే టైం మెషీన్లో ఫ్యూచర్లోకి ప్రయాణించి ఇప్పటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఈ సినిమాను తీశాడేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఆ కాలానికి అంత అడ్వాన్సడ్‌గా అనిపించింది ‘ఆదిత్య 369’. తెలుగు సినిమా చరిత్రలోనే కాక.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా ఇది.

సింగీతం అద్భుత సృష్టికి.. బాలయ్య అసమాన నటన కూడా తోడై ‘ఆదిత్య 369’ అప్పట్లో చరిత్రాత్మక విజయం సాధించింది. చరిత్రలో నిలిచిపోయింది. ఆదిత్య 369 విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంలోనే దీని సీక్వెల్ గురించి చర్చ జరుగతుండటం విశేషం. నిజానికి బాలయ్య వందో సినిమాగా ఈ సీక్వెలే చేయాలనుకున్నాడు. తర్వాత మనసు మార్చుకున్నాడు. ఐతే స్టోరీ బోర్డుతో సహా అంతా రెడీగా ఉన్న ఈ సినిమాను ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టడం ఖాయమని అంటున్నాడు బాలయ్య. 

విశాఖకు సముద్ర జలాల్లోకి ఉగ్రవాదులు !!

08:20:00 Add Comment


నవ్యాంధ్రలోని ప్రధాన నగరం విశాఖపట్నం ఇప్పుడు తీవ్రమైన ఉగ్రముప్పును ఎదుర్కొంటోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులు విశాఖపై జరగవచ్చని ఇంటిలిజెన్సు అధికారులు హెచ్చరిస్తున్నారు. లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), జైషే మొహమ్మద్ (జెఇఎం), ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు విశాఖపై గురిపెట్టినట్టు ఇంటిలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి.  శ్రీలంకలో ఇటీవల ఐఎస్‌ఐఎస్ ఏజెంట్లను అరెస్ట్ చేసి, వారిని విచారిస్తున్నప్పుడు ఉగ్రవాదులు విశాఖను టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటిలిజెన్స్ అధికారులు భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. 

విశాఖలో తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉంది. తీర భద్రతతో నౌకాదళం నిరంతరం అప్రమత్తంగానే ఉంటోంది. తూర్పు నౌకాదళం కేంద్రంగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఎప్పుడూ అక్కడే లంగరు వేసి ఉంటాయి. దీన్ని ఆనుకునే పోర్టు, హార్బర్ ఉన్నాయి. అలాగే గంగవరం పోర్టు, స్టీల్‌ప్లాంట్, ఎన్‌టిపిసి ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులు నౌకాదళ స్థావరాలను టార్గెట్‌గా చేసుకున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. 

విశాఖకు సముద్ర జలాల్లోకి శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు అవకాశాలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే స్లీపర్ సెల్స్ విశాఖలో సంచరిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక పంపించారు. విశాఖలో భద్రతా పరంగా కొన్ని లోపాలున్నాయి. వాటిని సవరించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. అలాగే షాపింగ్ మాల్స్, జన సమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో భద్రత, నిఘాను ముమ్మరం చేయాలని ఇంటిలిజెన్స్ అధికారులు ఆ నివేదికలో సూచించినట్లు తెలిసింది. దీంతో విశాఖ, పరిసర గ్రామాల్లోని సాగర తీరంపై నిఘా పెంచుతున్నారు. అంతేకాకుండా సిటీలో కూడా తనిఖీలు పెంచారు

వైసీపీ గడపగడప సర్వేపై మండిపడ మంత్రి పత్తిపాటి పుల్లారావు

08:01:00 Add Comment

గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ గడపగడప సర్వేపై మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ చేసే నైతికహక్కు వైసీపీకి - జగన్ కు లేదని అన్నారు. తొలుత తన పనితీరు - తనపై ఉన్న అవినీతి ఆరోపణలు - ఆస్తుల ఆటాచ్ మెంట్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని పత్తిపాటి సూచించారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చామని రానున్న మూడేళ్లలో మరికొన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గడపగడపకూ వెళితే జగన్ కు - ఆయన పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పుల్లారావు అన్నారు. వైసీపీని విడిచి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోయారో? నీ ప్రవర్తన ఎలా ఉందో? ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని జగన్ కు హితవు పలికారు. అంతగా జగన్ కు ప్రజాబలం ఉందని భావిస్తే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ఆ ఎమ్మెల్యేలు నెగ్గితే జగన్ ప్రజాబలంపై స్పష్టత వస్తుందని అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని పుల్లారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అవినీతికి పాల్పడినవారిలో అనేక మంది జగన్ వద్దే ఉన్నారని వారి గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మంత్రి సూచించారు.

ఉగ్రవాదుల హిట్ లిస్టులో ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ ?

07:53:00 Add Comment

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు - ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్  ఉగ్రవాదుల  హిట్ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిఘావర్గాలు అందించిన ఈ సమచారంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఒక్కసారిగా భద్రత పెంచింది. హైదరాబాద్ సిటీలో ఉగ్రవాదుల జాడలు బాగా పెరిగిన నేపథ్యంలో బీజేపీ నేత అయిన లక్ష్మణ్ కు భద్రత పెంచారు. ఇందులో భాగంగా ఆయనకు పోలీసు రక్షణను రెట్టింపు చేశారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా కేటాయించారు. 
హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు వారం కిందట దొరికిపోయిన సంగతి తెలిసిందే.  అయితే.. ఉగ్రవాదుల ఇంకా ఉండవచ్చని.. వారు బీజేపీ నేతలను టార్గెట్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నిఘావర్గాలు కూడా ఇందుకు సంబంధించి పక్కా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లక్మణ్ ఐఎస్ ఐఎస్ హిట్ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది. గతంలోనూ బీజేపీ నేతల ఇళ్ల వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారనడానికి ఆధారాలున్నాయి. ఐఎస్ టెర్రరిస్టులు ముస్లిమేతర పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ముప్పు లక్ష్మణ్ కే ఉందని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగానే ముందు జాగ్రత్తకు ఆయనకు గట్టి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

క‌శ్మీర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

11:18:00 Add Comment

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ‌`. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీక‌రించారు. క‌శ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ నేటి (గురువారం) సాయంత్రం  హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు. 

`ధృవ‌` ఫ‌స్ట్‌లుక్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అయితే ఈలోగానే క‌శ్మీర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్ ఒక‌టి అంత‌ర్జాలంలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ స్టిల్‌లో చ‌ర‌ణ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్‌లో, జ‌నాల్లో టాక్ వ‌చ్చింది. చ‌ర‌ణ్ మునుప‌టి కంటే స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడంటూ ప్ర‌శంస‌లొచ్చాయి. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మాతృక `త‌ని ఒరువ‌న్‌`లో విల‌న్‌గా న‌టించిన అర‌వింద్ స్వామి ఈ చిత్రంలోనూ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ర‌కూల్ ప్రీత్‌సింగ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ధృవ చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. చ‌క్క‌ని స్టోరీ, గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో  తెర‌కెక్కుతోందని చిత్ర‌యూనిట్ చెబుతోంది. (రామ్‌చ‌ర‌ణ్ శంషాబాద్ (హైద‌రాబాద్) ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన‌ప్పుడు కెమెరా కంటికి చిక్కారిలా.  కెమెరా క్లిక్కుల్లో దొరికిన స్టిల్స్ ఇవి).

అల్లు అర్జున్ - హరీష్ శంకర్ - దిల్ రాజు ల భారీ చిత్రం త్వరలో ప్రారంభం

10:27:00 Add Comment

వరుస విజయాలతో దూసుకుపోతోన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా, మాస్ కథలను జనరంజకంగా తీసి బ్లాక్బస్టర్ హిట్స్ సాధించిన హరీష్ శంకర్ దర్శకత్వం లో, భారీ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. 
ఏడు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్ - దిల్ రాజు కంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుంది. హరీష్ శంకర్ - దేవీ శ్రీ ప్రసాద్ కంబినేషన్ కూడా 4 సంవత్సరాల తరువాత కుదరటం తో, ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడనున్నది. అటు అల్లు అర్జున్ కి, ఇటు హరీష్ శంకర్ కి శ్రీ వెంకటేశ్వర క్రెయేషన్స్ బ్యానర్ లో ఇది మూడవ చిత్రం కావటం విశేషం. 
భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ చిత్రాన్ని 2017 వేసవి సెలవుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు  నిర్మాత దిల్ రాజు తెలిపారు. 
"ఆర్య, పరుగు చిత్రాల అనంతరం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మా బ్యానర్ లో 7 సంవత్సరాల తరువాత చేస్తోన్న చిత్రం ఇది. అలాగే సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం విజయం తరువాత హరీష్ శంకర్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందం గా ఉంది.  బన్నీ ఇమేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి పెర్ఫెక్ట్ గా సరిపడే కథ ను హరీష్ శంకర్ రెడీ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం", అని నిర్మాత దిల్ రాజు అన్నారు. 
ఇతర ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 

ఏపీ భ‌వ‌న్ మా ఆస్తి. అది మాకే ద‌క్కాలి టీ-సీఎం కేసీఆర్‌

00:10:00 Add Comment

ఏపీ భ‌వ‌న్ మా ఆస్తి. అది మాకే ద‌క్కాలి అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కి లేఖ రాశారాయ‌న‌. మా క‌ల్చ‌ర్ కోసం భ‌వంతులు నిర్మించుకుంటాం. ముందు ఏపీ నుంచి స్వాధీన‌ప‌ర్చండి అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. “విదేశీ వ్యవహారాల శాఖ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936లో ఢిల్లీలో 18.18 ఎకరాల స్థలాన్ని భారత ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలో ప్రస్తుత హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఏపీ భవన్ ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో హైదరాబాద్ హౌజ్‌ను కేంద్రం స్వాధీనం చేసుకుంది. 7.56 ఎకరాల పటౌడీ హౌస్, 1.21 ఎకరాల నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను అప్పటి ఏపీ ప్రభుత్వానికి కేటాయించింది. ఆరో నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో దేశంలో విలీనమైన తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్‌కే బదిలీ అయింది. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు సదరు స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. రెండేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ స్టేట్‌కు బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. దాన్ని ఏపీ, తెలంగాణకు విభజించటం కుదరదు“ అంటూ సీఎం స్ప‌ష్టంగా లేఖ‌లో పేర్కొన్నారు.
నాడు మద్రాస్ నుంచి ఆంధ్రా వేరుపడింది కాబ‌ట్టి ఢిల్లీలో ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సింది. లేదూ జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాస్ (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రానికి ఉన్న స్థలంలో ఆంధ్రకు వాటా ఇవ్వాల్సింది. చ‌రిత్ర‌ను, ఆధారాల్ని ప‌రిశీలించి ఏపీ భవన్‌ని మాకు ఇచ్చేయాల్సిందే… అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. అందుకు ప్రతిగా ఏపీకి స్టేట్ భవన్, రెసిడెంట్ కమిషనర్ ఆఫీసుల కోసం ఢిల్లీలో వేరొక స్థ‌లం కేటాయించుకోండ‌ని కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. జనాభా ధామాషా నిష్పత్తి ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంద‌ని అన్నారు.

150 థియేటర్లలో ‘ఇండిపెండెన్స్‌ డే’

10:12:00 Add Comment



తమిళనాట ఆంగ్ల చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ‘జంగిల్‌ బుక్‌’, ‘కాంజ్యురింగ్‌ 2’ సినిమాలు కూడా విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో 24న ‘ఇండిపెండెన్స్‌ డే’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో కలసి తమిళనాడు వ్యాప్తంగా 150 పైచిలుకు థియేటర్లలో విడుదలవున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళ అనువాదంలో మాత్రం 80 థియేటర్లలో విడుదలవుతోంది. రొనాల్డ్‌ ఎమిరిచ్‌ దర్శకత్వంలోని ఈ సినిమా ట్రైలర్‌ ప్రస్తుతం హాలీవుడ్‌ సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. రెండు మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1996లో రొనాల్డ్‌ ఎమిరిచ్‌ దర్శకత్వంలో ‘ఇండిపెండెన్స్‌ డే’ సినిమా విడుదలైంది. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత దానికి అనుసంధానంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 500 దుకాణాలను మూసివేత

22:45:00 Add Comment


దశలవారీగా మధ్య నిషేధం అమలు చేస్తామన్న హామీలో భాగంగా తొలుత 500 టాస్మాక్‌ దుకాణాలను మూసివేతకు ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో ‘టాస్మాక్‌ మద్యం దుకాణాల సమయాన్ని కుదిస్తాం, దుకాణాల సంఖ్యను విడతలవారీగా తగ్గిస్తామ’ని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొంది మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జయలలిత... తొలుత టాస్మాక్‌ దుకాణాల పని వేళలను తగ్గించారు. దీంతో ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తెరుచుకునే దుకాణాలు... మే 24వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభిస్తున్నాయి. ఈ స్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా 500 దుకాణాలను ఆదివారం నుంచి మూసివేయాలని శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జాబితాను జయలలిత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన ప్రకటనలో.. మూసి వేస్తున్న టాస్మాక్‌ దుకాణాలలో మిగిలి ఉన్న మద్యాన్ని గోదాముకు తరలించాలని తెలిపారు. ఆ దుకాణాలలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌, సహాయకులకు అదే జిల్లాలోని ఇతర ప్రభుత్వ దుకాణాలలో కాంట్రాక్టు పద్ధతిలోనే ఉపాధి కల్పిస్తామన్నారు. మే నుంచి సగటున రోజుకు రూ. మూడు లక్షలకు మించి మద్యం విక్రయాలు జరుగుతున్న దుకాణాలలో అదనంగా ఒక సూపర్‌వైజర్‌ను నియమిస్తామని తెలిపారు. రోజుకు రూ. ఒక లక్షకు మించి విక్రయించే చోట అదనంగా సేల్స్‌మెన్‌నుగానీ, సహాయకుణ్ని కానీ నియమిస్తామని చెప్పారు. 

30 ల‌క్షల పెట్టుబ‌డి.. 13 కోట్ల వ‌సూళ్లు..

22:54:00 Add Comment

విజ‌య్ ఆంటోనీ హీరోగా శీను ఫేమ్ శ‌శి త‌మిళంలో రూపొందించిన ‘పిచ్చైకార‌న్’ చిత్రం తెలుగు అనువాద హ‌క్కుల్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు కేవ‌లం రూ.30 ల‌క్ష‌ల‌కే సొంతం చేసుకోవ‌డం విశేషం. డ‌బ్బింగ్ ప‌నుల కోసం ఇంకొన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చ‌య్యాయి. బిచ్చ‌గాడు పేరుతో గ‌త నెల 13న ఏమాత్రం అంచ‌నాల్లేకుండా విడుద‌లైందీ సినిమా.స‌రైన ప్ర‌మోష‌న్ కూడా లేక‌పోవ‌డంతో మొదట్లో ‘బిచ్చగాడు’ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐతే కొన్ని రోజులు గడిచాక సినిమా చాలా బావుందన్న మౌత్ టాక్ స్ప్రెడ్ అయి.. నెమ్మదిగా జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. బిచ్చ‌గాడు వ‌చ్చిన త‌ర్వాతి వారం విడుద‌లైన‌ ‘బ్రహ్మోత్సవం’కు డిజాస్ట‌ర్ టాక్ రావ‌డం క‌లిసొచ్చి ఈ సినిమాకు ఆదరణ మరింత పెరిగింది. మహేష్ సినిమాను తీసేసి మరీ కొన్ని చోట్ల ‘బిచ్చగాడు’కు థియేటర్లు ఇవ్వడం విశేషం. రెండో వారాంతం నుంచి సాగుతుఉన్న ‘బిచ్చగాడు’ హ‌వా ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. నెల త‌ర్వాత కూడా సినిమా బాగా ఆడుతోంది. ఇప్ప‌టిదాకా ఈ చిత్రం రూ.13 కోట్ల గ్రాస్ సాధించ‌డం విశేషం.

'జవాన్'గా వస్తున సుప్రీమ్ హీరో !

21:25:00 Add Comment

సుప్రీమ్ మూవీతో వరుసగా మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించాడు సాయిధరం తేజ్. చైల్డ్ సెంటిమెంట్ - కామెడీ కంటెంట్ లకు.. కరెక్ట్ టైమింగ్ కూడా జోడవడంతో.. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తేజు.. కొత్త ప్రాజెక్టులను ఓకే చేయడంలో తెగ స్పీడ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే తిక్క టైటిల్ పై రూపొందుతున్న మూవీని ఫినిషింగ్ స్టేజ్ కి తెచ్చిన సాయిధరం తేజ్.. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నాడు. తిక్క కాకుండా ఇప్పటికే రెండు సినిమాలను తేజు ఓకే చేసేశాడు. ఒకటి బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందనుండగా.. మరొకటి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనుంది. తిక్క తర్వాత వెంటనే బీవీఎస్ రవి చిత్రాన్నే స్టార్ట్ చేస్తాడట తేజు. ఈ మూవీని కృష్ణ అనే నిర్మాత ప్రొడ్యూస్ చేయనుండగా.. ఇతను పూరీ జగన్నాథ్ - జూనియర్ ఎన్టీఆర్ లకు సన్నిహితుడు. ఇప్పటికే సాయిధరం తేజ్ కి సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ ఓ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో.. ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే 'ఇంటికొక్కడు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంటుందట. మొత్తానికి టైటిల్ లోనే మాంచి పవర్ చూపిస్తున్న సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్ మూవీలో.. అంతకంటే ఎక్కువగానే కంటెంట్ ఉంటుందని  డైరెక్టర్ బీవీఎస్ రవి అంటున్నాడు. 

సర్దార్ గబ్బర్ సింగ్’ రికార్డునే కాదు.. శ్రీమంతుడు కలెక్షన్లను కూడా దాటలేకపోయిన బ్రహ్మోత్సవం !!

05:20:00 Add Comment

సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ అయినా సరే.. తొలి రోజు రికార్డుల మోత మోగించింది. కలెక్షన్లలో నాన్-బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టేసింది. ‘శ్రీమంతడు’ నెలకొల్పిన కలెక్షన్ల రికార్డును దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.17 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.29 కోట్ల దాకా షేర్ ఖాతాలో వేసుకుంది. ఐతే ఆ రికార్డును ‘బ్రహ్మోత్సవం’ ఈజీగా దాటేస్తుందని అంచనా వేశారు మహేష్ అభిమానులు. విడుదలకు నాలుగు రోజుల ముందు వరకు కొంచెం సందేహాలున్నా.. తెలంగాణ వరకు సింగిల్ స్క్రీన్లలో సైతం తొలి రోజు అదనంగా ఒక షో (ఐదోది) వేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ‘సర్దార్’ రికార్డు బద్దలవడం పక్కా అని తీర్మానించారు ట్రేడ్ పండితులు.
కానీ ‘బ్రహ్మోత్సవం’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రికార్డునే కాదు  శ్రీమంతుడు కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా తొలి రోజు రూ.12.5 కోట్ల షేర్ రూ.18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు రెండు రాష్ట్రాల్లో భారీగా బెనిఫిట్ షోలు వేయడం కలిసొచ్చింది. మహేష్ సినిమాకు బెనిఫిట్ షోలు పెద్దగా లేకపోయినా.. ఇక్కడ తెలంగాణలో పడే ఐదో షో ఆ గ్యాప్ కవర్ చేస్తుందని అనుకున్నారు. ‘సర్దార్’తో పోలిస్తే ఫుల్ పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో నాన్-బాహుబలి డే-1 రికార్డు పక్కా అనుకున్నారు. కానీ ‘బ్రహ్మోత్సం’.. మహేష్ లాస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. డే-1 కలెక్షన్లలో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఎంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు అన్ని షోలకూ ముందే టికెట్లు బుక్ అయిపోయి ఉంటాయి కదా. అయినా ‘బ్రహ్మోత్సవం’ నాలుగో స్థానానికి పరిమితం కావడం ఆశ్చర్యమే. 

జనతా గ్యారేజ్

04:59:00 Add Comment


             
ఇక తెలుగు - తమిళం - మలయాళంలలో కూడా ''జనతా గ్యారేజ్'' అనే టైటిల్ ను పెడుతున్నట్లు ఆల్రెడీ మేకర్లు మనకు కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మలయాళం వర్షెన్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. ఇక్కడే ఒక ట్విస్టుంది. నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తెలుగులో విడుదల చేశారు. అయితే ఇవాళ మోహన్ లాల్ పుట్టినరోజు కాబట్టి.. మలయాళంలో ఆయన ఫస్టు లుక్ ను విడుదల చేశారు. కాకపోతే జనతా గ్యారేజ్ అంటూ మోహన్ లాల్.. ఆయన తమ్ముళ్లగా నటిస్తున్న తమిళ నటుడు రెహ్మాన్.. తెలుగు నటుడు బ్రహ్మాజీలతో కూడిన ఫోటోనే విడుదల చేశారు కాని.. మనోళ్ళు ఎన్టీఆర్ స్టిల్ మాత్రం విడుదల చేయలేదు. సినిమాలో మోహన్ లాల్ తమ్ముడు  రెహ్మాన్ కొడుకుగా ఎన్టీఆర్ కనిపిస్తాడని టాక్. 

వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల - దిల్ రాజు ల చిత్రం త్వరలో ప్రారంభం

04:53:00 Add Comment
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. 

ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది", అని తెలిపారు. 

ఈ చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

ఏపీ రాజధాని ప్రాంత ప్రజలకు ఊహించలేని ఒక కానుక

07:00:00 Add Comment


ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.2.5లక్షల వరకు అవసరమైన వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో దాదాపు 1100 వరకూ శస్త్రచికిత్సల్ని అందించనున్నారు. అయితే.. ఈ ఆఫర్ 2014 డిసెంబరు 8వ తేదీ నాటికి అమరావతి (సీఆర్ డీఏ పరిధిలోని ప్రాంతం)లో నివసించిన వారికి మాత్రమే అందనుంది.
ఈ వైద్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించనున్నారు. ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవల్ని అందించాలన్న నిర్ణయం.. అక్కడి ప్రజల్ని ఆనందానికి గురి చేయటం ఖాయంగా చెబుతున్నారు. ఇక.. పేదలకు వైద్యసాయం చేసే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కు సీఆర్ డీఏ చెల్లింపులు చేయనుంది. బాబు సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం రాజధాని ప్రాంత పరిధిలో నివసించే పేదలకు తీపి కబురు అవుతుందనటంలో సందేహం లేదు. తప్ప మిగిలిన వారంతా చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి. తమ జీవితంలో ఎప్పుడూ ఊహించలేనంత మార్పు రావటం.. ఏపీ భవిష్యత్తు మొత్తం తమ లోగిళ్లలోనే తయారయ్యే అద్భుత అవకాశం దక్కటం వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆనందపడేవాళ్లు ఆనందపడుతున్నా.. రాజధాని రావటంతో పచ్చటి పొలాలు మాయమై మొత్తం కలుషితంగా మారిపోతుందని భయంతో బాధపడే వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని ప్రాంత ప్రజలకు ఊహించలేని ఒక కానుకను ప్రకటించి విస్మయానికి గురి చేసిందని చెప్పాలి.ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.2.5లక్షల వరకు అవసరమైన వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో దాదాపు 1100 వరకూ శస్త్రచికిత్సల్ని అందించనున్నారు. అయితే.. ఈ ఆఫర్ 2014 డిసెంబరు 8వ తేదీ నాటికి అమరావతి (సీఆర్ డీఏ పరిధిలోని ప్రాంతం)లో నివసించిన వారికి మాత్రమే అందనుంది.ఈ వైద్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించనున్నారు. ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవల్ని అందించాలన్న నిర్ణయం.. అక్కడి ప్రజల్ని ఆనందానికి గురి చేయటం ఖాయంగా చెబుతున్నారు. ఇక.. పేదలకు వైద్యసాయం చేసే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కు సీఆర్ డీఏ చెల్లింపులు చేయనుంది.

పవన్ చేతులారా చేడగోట్టుకున్నాడా !!

10:05:00 Add Comment

తెలుగు సినిమా మార్కెట్‌ ఇప్పుడు బాగా పెరిగింది. బాహుబలి తర్వాత మన సినిమా రేంజ్‌ కనీసం పది నుంచి ఇరవై కోట్ల వరకు పెరిగింది. ఇది కేవలం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ వరకే. ఇక పోస్ట్‌ రిలీజ్‌ అయితే ఇప్పుడు తెలుగు సినిమా సత్తా ఎంతనేది అంచనాకి కూడా అందడం లేదు. ఏ సినిమా అయినా కాస్త బాగుంటే, అందులో ఒక సూపర్‌స్టార్‌ వుంటే వంద కోట్ల షేర్‌ వచ్చి పడిపోతుంది. 'సరైనోడు' లాంటి సినిమాని ఆ స్థాయిలో చూస్తున్నారంటే ఇక నిజంగా విషయమున్న సినిమాలని ఏ స్థాయిలో ఆదరిస్తారని అనుకోవాలి? ఇలాంటి టైమ్‌ని వాడుకోవడంలో పవన్‌కళ్యాణ్‌ విఫలమయ్యాడు. ప్రేక్షకుల అభిరుచిని మరీ చీప్‌గా చూసి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' లాంటి అతి చెత్త ప్రోడక్ట్‌ వదిలాడు. అక్కడికీ దానికి యాభై కోట్ల షేర్‌ వచ్చింది. నిజంగా ఈ సినిమా కనుక యావరేజ్‌గా అనిపించినా మరో యాభై కోట్లు ఈజీగా వచ్చి ఉండేవి. ఇప్పుడు బ్రహ్మూెత్సవం చిత్రానికి వంద కోట్ల షేర్‌ తక్కువ రాదని అంచనా వేస్తున్నారు. కనీసం తదుపరి చిత్రాన్ని అయినా క్రేజీగా ప్లాన్‌ చేయకుండా అవుట్‌డేటెడ్‌ అయిపోయిన ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఫామ్‌లో లేని ఎస్‌.జె. సూర్యతో పవన్‌ చేస్తున్నాడు. ఆ చిత్రం కనీసం యావరేజ్‌గా పాసైపోయినా చాలని పవన్‌ అభిమానులే భావిస్తున్నారంటే అతనెలాంటి చిత్రాల్ని రెడీ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు.

బ్రిటన్ పార్లమెంట్‌లో నటుడు మోహన్‌బాబుకు అరుదైన గౌరవం

09:44:00 Add Comment




బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్‌బాబుకు అరుదైన గౌరవం దక్కింది. మోహన్‌బాబు కెరీర్‌లో బెస్ట్ డైలాగ్స్‌తో కూడిన పుస్తకాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఏషియన్ లైట్ 10వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. 

ఏషియన్ లైట్ (న్యూస్ పేపర్) బ్రిటన్‌లో భారతీయ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. బ్రిటన్ లో తెలుగు భాషలో నాన్ బ్రిటీషీ రచయిత రాసిన పుస్తకాన్ని విడుదల చేయడం ఇదే మొదటి సారని ఏషియన్ లైట్ ఎడిటర్ అజీజ్ అనసుదీన్ తెలిపారు. భారత సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించడంతోపాటు విద్యా, క్రీడారంగాల్లో చేసిన సేవలకుగానూ హారో ఈస్ట్ ఎంపీ (బ్రిటన్)బాబ్ బ్లాక్‌మన్ మోహన్‌బాబుకు ప్రణమ్ అవార్డును ప్రదానం చేశారు.

జ్యోతి లక్ష్మి కి దక్కిన అరుదైన గౌరవం

01:47:00 Add Comment


ఛార్మి ప్రధాన పాత్రధారిణిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని రచయిత్రి మంగళగౌరీ విమర్శనాత్మకంగా పుస్తక రూపంలో రాశారు. ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తనికెళ్ళభరణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పీహెచ్‌.డీ చేయదగిన స్థాయిలో మంగళగౌరీ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సినిమాకు కావ్యగౌరవం కల్పించిన మంగళగౌరీ అభినందనీయురాలు. 'ఇట్లు..శ్రావణీ సుబ్రమణ్యం' చిత్రంలోని డైలాగులు చూసొచ్చి, నేను సినిమా చేస్తే డైలాగులు మీరే రాయాలని పూరి దగ్గర మాట తీసుకున్నాను. ఉత్తమ సంభాషణలకుగాను ఆ చిత్రం నంది అవార్డును కైవసం చేసుకుంది. 'అనుకోకుండా ఒక రోజు', 'జ్యోతిలక్ష్మి' చిత్రాలు ఛార్మీ కెరీర్‌లో నిలిచిపోతాయి. ఇదే కాంబినేషన్‌లో 'జ్యోతిలక్ష్మి పార్ట్ 2' కూడా రావచ్చేమో' అని అన్నారు. 'పుస్తకంతో మొదలైన 'జ్యోతిలక్ష్మి' సినిమా పుస్తకంతోనే ముగుస్తుంది. 
 ఈ సినిమాను పూరిగారు ఎంతో స్ఫూర్తితో రూపొందించారు. ఈ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా జ్యోతిలక్ష్మి అని పిలుస్తున్నారు' అని కథానాయిక ఛార్మి చెప్పారు. 'మల్లాదివారితో మాట్లాడిన తర్వాతే పూరి ఈ చిత్రాన్ని చేశారు. ఆధునిక కన్యాశుల్కం అని నేను జ్యోతిలక్ష్మి గురించి చెబుతాను. ఈ సినిమా చూసిన ప్రతి పురుషుడు చాలా నేర్చుకోవాలి. తమ భార్యలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. వారిని ప్రోత్సహించాలి. ఈచిత్రంలోని క్లైమాక్స్‌ నన్ను కదిలించింది. భవిష్యత్‌లోనూ పూరిజగన్నాథ్‌ చిత్రాల గురించి, ఛార్మి గురించి పుస్తకాలు రాయాలనుకుంటున్నాను' అని రచయిత్రి మంగళగౌరీ అన్నారు. ఈ కార్యక్రమంలో టార్జన్‌, గాయత్రి, అపూర్వ, సునీల్‌కశ్యప్‌, శాండీ, పి.జి.విందా, సత్యదేవ, ఆకాష్‌పూరి తదితరులు పాల్గొన్నారు. '40 సంవత్సరాల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'మిస్టర్‌ పరాంకుశం' కథను 20 ఏళ్ళ క్రితం నేను సినిమాగా తీయాలనుకున్నాను. ఏడేండ్ల కిందట ఛార్మితో కలిసి ఈ సినిమాను తీద్దామనుకున్నాను. ఫైనల్‌గా సినిమా తీశాం. ఈ క్రమంలో జరిగిన ప్రతి విషయంతోపాటు సినిమాపై మంగళగౌరీ పుస్తకం రాయడం చాలా ఆనందంగా ఉంది. దీంతో మా సినిమాపై మరింత గౌరవం పెరిగింది. ఛార్మి పాత్రను మధురవాణితో పోల్చడం మరింత సంతోషంగా ఉంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన భరణిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సినిమాపై పుస్తకం రాయడమనేది మా అందరికి ఓ స్ఫూర్తినిస్తుంది. అవార్డులు వచ్చిన దానికంటే చాలా ఆనందంగా ఉంది' అని వీడియో సందేశంలో పూరీజగన్నాథ్‌ తెలిపారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షాక్ కు గురియ్యాడు.!!

01:38:00 Add Comment


తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 24 చిత్రాన్ని చూసి అల్లు అర్జున్ షాక్ అయ్యాడట . విక్రం కుమార్ టేకింగ్ ,తిరు సినిమాటోగ్రఫీ ,సూర్య యాక్టింగ్ వెరసి టేర్రిఫిక్ విజువల్స్ అని ,ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అంటూ విక్రం కుమార్ ని పొగడ్తలతో ముంచెత్తాడట అల్లు అర్జున్ . మే 6న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన 24 చిత్రం అన్ని చోట్లా మంచి కలెక్షన్ల ని రాబడుతున్న సంగతి తెలిసిందే . కాగా విక్రం కుమార్ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో ఉండటం వల్ల 24 చిత్రాన్ని చూసాడు అల్లు అర్జున్ . విక్రం స్క్రీన్ ప్లే బాగా నచ్చిందని విజువల్ ట్రీట్ అదిరిందని విక్రం పని తీరుని మెచ్చుకున్నాడట అల్లు అర్జున్.

కబాలి రిలీజ్ డేట్ కన్ఫమ్ !!

08:16:00 Add Comment

రజినీ సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ అయితే తప్ప మిగతా సినిమా షెడ్యూళ్లు ఖరారవ్వవు. ‘కబాలి’ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆ సినిమా రిలీజ్ డేటేదో తేలితే.. తమ సినిమాల్ని దానికి తగ్గట్లుగా షెడ్యూల్ చేసుకుందామని చూస్తున్నారు చాలామంది నిర్మాతలు. ఐతే రెండు నెలలుగా రిలీజ్ డేట్ విషయంలో నాన్చుతూ వస్తున్న ‘కబాలి’ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్.థాను ఎట్టకేలకు ఓ కంక్లూజన్‌కు వచ్చాడు. జులై 1న ‘కబాలి’ రిలీజవుతుందని ఆయన ప్రకటించాడు. దీంతో జూన్ నెలలో ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ యధావిధిగా విడుదల చేసేయొచ్చు. ఆ మధ్య పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా రజినీ మాట్లాడుతూ మే 27 లేదా జూన్ తొలి వారంలో ‘కబాలి’ విడుదలవుతుందని ప్రకటించాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న ప్రకారం జరగకపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఏ హడావుడి లేకుండా జులై 1న సినిమాను విడుదల చేసుకోవాలని ఫిక్సయ్యాడు థాను. యువ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీ మాఫియా డాన్ పాత్ర పోషించాడు.

చిరు లాంటి డ్యాన్సర్ లేరన విజయశాంతి

08:10:00 Add Comment
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌ ను ఎక్కడికో తీసుకెళ్లి ఆయన్ని శిఖరంపై నిలబెట్టిన ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తన హీరో చిరంజీవి మీద ప్రశంసల జల్లు కురిపించారు.

‘గ్యాంగ్ లీడర్’లో తన పాత్ర చిరు పాత్రకు దీటుగా ఉంటుందని.. ఆ పాత్ర అంత బాగా రావడానికి చిరంజీవి కూడా కారణమని విజయశాంతి చెప్పింది. ‘గ్యాంగ్ లీడర్’లోని భద్రా చలం కొండ పాటను ఊటీలో తీస్తుండగా.. తనకు ‘కర్తవ్యం’ సినిమాకు గాను జాతీయ అవార్డు వచ్చిందని తెలిసిందని.. ఈ విషయం తెలిసి చాలా సంతోషించిన చిరు.. ఆ సాయంత్రం హోటల్లో అందరికీ పెద్ద పార్టీ ఇచ్చారని విజయశాంతి వెల్లడించారు. చిరంజీవితో తాను చాలా సినిమాలు చేసినప్పటికీ.. ‘గ్యాంగ్ లీడర్’ చాలా ప్రత్యేకమని ఆమె అంది. చిరంజీవితో కలిసి ‘గ్యాంగ్ లీడర్’లో అదిరిపోయే స్టెప్పులేశానని.. దేశంలోనే చిరంజీవిని మించిన డ్యాన్సర్ లేడన్నది తన అభిప్రాయమని విజయశాంతి చెప్పింది. ఇప్పటి హీరోలు డ్యాన్సులు బాగానే చేస్తున్నప్పటికీ.. ఎవ్వరూ కూడా చిరంజీవిని మ్యాచ్ చేయలేరని.. ఆయన స్టైల్ ఇంకెవ్వరికీ రాదని విజయశాంతి అభిప్రాయపడింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని తమిళనాడు.. కర్ణాటక.. బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకం ?

01:17:00 Add Comment

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య ఇచ్చిన హామీ.. 2014 ఎన్నికల సమయంలో మోడీ స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ విషయాన్ని మరిచిపోయి.. ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న విషయాన్ని బీజేపీ నేతలు కొంతకాలంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ మధ్యన కేంద్రమంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని ఏకపక్షంగా తేల్చేయటంపై తీవ్రఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేక హోదా మీద కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్ష నేతలుసైతం తీవ్రంగా మండిపడుతూ.. మోడీ సర్కారుపై విమర్శనాస్త్రాల్ని సంధించటం తలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చిత్రమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో చేర్చి ఉంటే సరిపోయేదని..ఆ పని కాంగ్రెస్ చేయలేదంటూ విమర్శలు చేస్తున్నగజపతి రాజు.. ఏపీకి ప్రత్యేకహోదాను ముగ్గురు ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారంటూ కొత్త విషయాన్ని తెర మీదకు తెచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని తమిళనాడు.. కర్ణాటక.. బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. విభజన బిల్లులో కానీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి ఉన్నట్లైయితే..ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని.. ఎవరూ అడ్డుకునే వారు కాదంటూ కొత్త రాగం తీయటం విశేషం. పెద్దమనిషిగా కనిపించే అశోక్ గజపతి రాజు చెప్పిన మాటలు వింటున్న కొందరికి షాక్ తగులుతున్న పరిస్థితి. ఎందుకంటే.. అశోక్ గజపతి మాటలే నిజం అనుకుంటే.. విశాఖకు రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో స్పష్టంగా ఉంది? మరి.. కేంద్రం గడిచిన రెండేళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు తేల్చటం లేదు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత విభజన చట్టంలో ఉంది. మరి.. దానికి చిల్లర పైసలు విసురుతున్నట్లుగా నిధుల కేటాయింపు ఉంది. ఎందుకలా జరుగుతుంది? ఇవే కాదు.. విభజన కారణంగా ఏర్పడే ఏపీ లోటును పూడ్చాలంటూ చాలా స్పష్టంగా విభజన చట్టంలో ఉంది. ఇలాంటి ప్రశ్నలకు అశోక్ గజపతి సమాధానాలు చెబితే బాగుంటుంది. 

అనంతపురంలో నిరవధిక దీక్షలు

22:58:00 Add Comment

వామపక్షాల ఆధ్యర్యంలో ప్రదర్శనలు - సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ - ఆందోళనలకు సిద్ధమౌతున్న వైసిపి, కాంగ్రెస్‌ ప్రజాశక్తి - యంత్రాంగం రాష్ట్రంలో ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు అంశం వేడెక్కుతోంది. అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరుగుతుం డటంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఈ విషయంపై మాట్లాడక తప్పనిస్థితి ఏర్పడుతోంది. అనంతపు రంలో ఆదివారం నాడు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ప్రారంభమైనాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయి తమ సంఘీభావం ప్రకటించారు. పలు ప్రజాసంఘాలు ఈ ఆందోళనలకు మద్దతు తెలిపాయి. వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదాల సాధన కోసం ప్రదర్శనలు సాగాయి. వైసిపి, కాంగ్రెస్‌ పార్టీలూ పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమౌతున్నాయి. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపికి చెందిన సీనియర్‌ నేతలతో సమావేశమైనారు. హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెబుతూనే, విమర్శలు చేయవద్దని సూచించారు. కేంద్రం ఇప్పటిదాకా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలకు సంబంధించి సమగ్ర నివేదిక తయారుచేయాలని ఆదేశిం చారు. అదే సమయంలో కేంద్ర మంత్రిమండలి నుండి బయటకు వస్తే ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ అక్కడక్కడ అధికార పార్టీలోనూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. అధికారికంగానూ, అనధికారికంగానూ ఆ పార్టీ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. తాము ఎంత సర్ధుకుపడి పోవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదని చెప్పారు. కేంద్ర మంత్రులు నీతిఅయోగ్‌ అంటూ హోదా అంశాన్ని వాయిదా వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, హోదా ఆలస్యమయ్యే కొద్దే సమస్యలు మరింత పెరుగుతాయని చెప్పారు. తమిళనాడు, కర్నాటక, బీహార్‌ ముఖ్యమంత్రులే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు.

అడుగుపెడితే అయిపోతారు!

23:35:00 Add Comment


ఏపీకి ప్ర‌త్యేక హో్దా హుళ‌క్కేన‌ని ప్ర‌క‌టించింది కేంద్రం.  నేరుగా ప్ర‌క‌టించే ధైర్యం లేక .. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చే ప్ర‌క‌ట‌న చేయించింది. ఆ పాపానికి ఇప్పుడు ఆయ‌న ప్రాయాశ్చిత్తం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి. `ఇక మీరు ఏపీకి వ‌చ్చే సాహ‌సం చేయ‌కండి. అడుగుపెడితే అయిపోతారు!` అంటూ నెటిజ‌నుల నుంచి వార్నింగ్‌లు జారీ అయ్యాయి. `ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో లేదు` అంటూ పార్ల‌మెంట్‌లో గంభీరంగా ప్ర‌క‌టించిన స‌ద‌రు మంత్రి ఇప్పుడు పిల్లి అయిపోయారు. సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్స్‌లో త‌న‌పై వినిపిస్తున్న కామెంట్లు చ‌దువుకుని బెంబేలెత్తిపోతున్నారాయ‌న‌. ఏం జ‌రిగిందో ఏంటో? ఏపీకి రావ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చారంటూ వాపోతున్నారు. అయినా ఏపీకి ప్ర‌త్యేకించి నేనేమీ చెప్ప‌లేదు. అస‌లైన వాళ్లు వెన‌క ఉండి చెప్పించారు! అన్న‌ట్టే స‌ద‌రు మంత్రి భ‌యాన్ని బైట‌పెట్టారు. రెవెన్యూలోటు భ‌ర్తీ చేస్తామ‌న్న‌ప్పుడు ప్ర‌త్యేక హోదా ఎందుకు? అని మాత్ర‌మే తాను అన్నాన‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఏదేమైనా త‌ప్పిదం జ‌రిగిపోయింది. ఒక‌వేళ జ‌యంత్ సిన్హా ఏపీలో అడుగుపెడితే అప్పుడు తెలుగు ప్ర‌జ‌ల చేతుల్లో మ‌సాజ్ గ్యారెంటీ. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు, ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్, దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ .. ఇంత‌మందిని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది ఈ మ్యాట‌ర్‌.

చిక్కుల్లో పడ్డ బార్ రెఫెయిలీ

00:13:00 Add Comment


హాలీవుడ్ లో తన అందాల ఆరబోతతో కుర్రోళ్ల గుండెల్లో సెగలు పుట్టించే హాట్ మోడల్ బార్ రెఫెయిలీ తెలియనివారు ఉండరు. ఈ అమ్మడు చాలా వరకు బికినీతోనే దర్శనమిస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజగా ఈ అమ్మడు తన సొంత దేశంలో చిక్కులు ఎదుర్కొంటూ మీడియాకి ఎక్కింది. సెలబ్రెటీలు ఏ చిన్న తప్పిదాలు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్షణాల్లో పబ్లిసిటీ అవుతుంది. తాజాగా బార్ ఓ బికినీ యాడ్ లో కనిపించింది.అయితే ఈ వాణిజ్య ప్రకటనలు మరీ సెక్సీగా ఉన్నాయంటూ ఇజ్రాయెల్ వీటిని తమ దేశ టీవీ చానెళ్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించింది.

ఈ అమ్మడు ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ హుడీస్ తరుపు ఓ యాడ్ లో దాదాపు టూ పీస్ బికినీల్లో కనిపించి ఈ భామ హాట్ హాట్ గా కనిపించింది. ఈ యాడ్ చూసి చిర్రెత్తుకొచ్చిన ఇజ్రాయెల్ జాతీయ టెలివిజన్ అథారిటీ కత్తెరలు వేసింది. అంతే కాదు చాలా క్లోజప్ లో వెనుక భాగం మొత్తం న్యూడ్ గా కనిపించే విధంగా ఈ యాడ్ ఉండటం పెను సంచలనం రేపింది. ఈ యాడ్ బార్ ఫర్ హుడీస్ పేరిట రూపొందించారు.ఇజ్రాయెల్ జాతీయ టెలివిజన్ క్లోజ్ అప్ లో వెనుకవైపు నుంచి నగ్నంగా కనిపించే దృశ్యాన్ని తొలగిస్తేనే టీవీ చానెళ్లలో ప్రసారానికి అనుమతిస్తామని, లేదంటే రాత్రి 10 గంటల తర్వాతనే దీనిని ప్రసారం చేసుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఈ యాడ్ 45 సెకన్లు ఉంది..ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో హాల్ చల్ చేస్తుంది.

టీడీపీని లైట్ తీసుకోవద్దు

23:58:00 Add Comment

మేము సైలెంట్ గా ఉంటామనుకోవద్దు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దానికోసం రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి. ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పితే ఊరుకోము. రెండేళ్లుగా ఇదిగో..అదిగో..అంటూ మీ చుట్టూ తిప్పించుకొని చివరకి ఇవ్వలేము అని చల్లగా చెప్పడం సరికాదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చాలా వేధిస్తోంది. నా ఉద్దేశ్యంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఇద్దరూ దీనికి బాధ్యులు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే ముందు వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలి. ఇంకా మా సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను," అని టీడీపీ నేత, ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పడంతో బీజేపీకి మిత్రపక్షంగా సాగుతున్న టీడీపీ కూడా ప్రతిపక్షాలతో గొంతు కలిపి కేంద్రాన్ని విమర్శించడం మొదలుపెట్టింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వబోదనే విషయం టీడీపీకి ఈరోజు కొత్తగా తెలిసిన విషయమేమీ కాదు. "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయం ఎప్పుడో తెలుసు కానీ దానిని బయటకి చెప్పడం లేదు. అందుకే ఆయన హోదాకి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అడుగుతున్నారు" అని ఏడాది క్రితం అదే పార్టీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరూ కూడా ఈ సంగతి ఇప్పుడే తమకు తెలిసినట్లు నటిస్తూ ప్రజలని, ప్రతిపక్షలని మభ్యపెట్టేందుకు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మంత్రుల రాజీనామాలు కోరిన ముద్దు టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామాల గురించి మాట్లాడలేదు. ఒకవేళ ఈ వేడి ఇలాగే కొనసాగితే ప్రజలను సంతృప్తి పరిచేందుకయినా వారిద్దరి చేత రాజీనామాలు చేయించవచ్చు. 

టీఆర్ఎస్ఎల్పీలో వైసీపీని విలీనం

23:12:00 Add Comment

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు తెలంగాణాలో షాక్ తగిలింది. ఏపీలో ఓవైపు ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార టీడీపీలోకి జంప్ అవుతుంటే.. ఇటువైపు తెలంగాణాలో వైసీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ లోకి చేరిపోయి షాక్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ తెలంగాణా రాష్ట్ర శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేయాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో లేఖకు స్పందించిన స్పీకర్ వైసీపీ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను ఇకపై అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తారు. మరి తెలంగాణా రాష్ట్రంలో ఇకపై జగన్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో ఆయనకే తెలియాలి.

ఏపీలో పోల‌వ‌రం కోసం సీఎం కేసీఆర్ సాయం !

23:08:00 Add Comment

నీటి పంప‌కాల‌పై ఎవ‌రు ఎంత వాటా తీసుకోవాలో గ‌తంలోనే నిర్ణ‌య‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. ఏపీ నేత‌లు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌కు ద‌క్కాల్సిన న‌దీజ‌లాలు ద‌క్క‌లేదు. గోదావ‌రి, కృష్ణా నుంచి న్యాయంగా ద‌క్కాల్సిన వాటా రాలేదు. అందుకే `నీరు-నిధులు- నియామ‌కం` ప్రాతిపాదిక‌న దీనిపై గ‌తంలో ఎంతో పోరాడాం. తెలంగాణ‌లో ప్రారంభించిన ప్రాజెక్టులు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ముందుకు కొన‌సాగ‌లేదు. ప‌ర్యావ‌ర‌ణం వ‌ల్ల, అంత‌రాష్ర్ట వివాదాల వ‌ల్ల స‌మ‌స్య‌లొచ్చాయి. అయితే ఇప్ప‌టికైనా నీటిని స‌వ్యంగా వినియోగించుకోవాల‌ని పాల‌మూరు, దిండి ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి ప్రారంభ‌మైనా.. ఏపీలో పోల‌వ‌రం కోసం సీఎం కేసీఆర్ సాయం చేస్తామ‌న్నారు. గోదావ‌రిలో నీరు స‌మృద్ధిగా ఉంది. దానిని స‌రిగా వాడుకోలేక‌పోతున్నాం. మేం ప‌రిధి మేర మాత్ర‌మే వినియోగించుకుంటాం. మీరు కూడా వాడుకోండి. ఎగువ‌న ఉన్న మేం కూడా పోల‌వ‌రానికి సాయం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపార‌ని క‌డియం వివ‌ర‌ణ ఇచ్చారు. ప్రాజెక్టులు అడ్డుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌ర‌గ‌దు. ఎగువ‌న ఉన్న రాష్ర్టాల్లో ఎంత నీరు వాడుకోవాలి? దిగువ‌కు ఎంత వెళ్లాలి అన్న‌దానిపై ఇప్ప‌టికే క్లారిటీ ఉంది. 1400 టీఎంసీల నీరు గోదావ‌రిలో ఉంది. అందులో 950 టీఎంసీలు తెలంగాణ‌కు చెందుతుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అది తేట‌తెల్ల‌మైంది. కృష్ణాలో 300 టీఎంసీల నీరుంది. ఇందులోనూ తెలంగాణ‌కు చెందే వాటాను మాత్ర‌మే ఉప‌యోగించుకుంటాం. కాబ‌ట్టి ఏపీ అన‌వ‌స‌ర రాద్ధాంతం చేయ‌కూడదు… అని వాస్త‌వ ప‌రిస్థితిని తెలిపారు.