నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. ఆ ఇద్దరూ కూలీలుగా తెలుస్తోంది. మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఎనిమిది పిల్లర్లు నేలమట్టమయ్యాయి. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సినిమా ఛాన్స్‌ల కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చే వారితో నిత్యం ఫిల్మ్‌నగర్ కిటకిటలాడుతోంది. అలాంటి చోట ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.కల్చరల్ సెంటర్ కు దగ్గర ఓ భవనం నిర్మాణం అవుతోంది. శనివారం రాత్రి శ్లాబ్ నిర్మాణం వేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కొంతమంది కూలీలు పని చేసేందుకు వచ్చారు. 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. 14 ఫిల్లర్లు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పని చేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై కూలీలను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది కూలీలకు గాయాలు కావడంతో వీరిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిర్మాణం విషయంలో నాణ్యత లోపించడం వల్లే భవనం కుప్పకూలిందని తెలుస్తోంది. భవనానికి సంబంధించిన వారు అందుబాటులోకి లేకపోవడంతో ఎలాంటి సమాచారం తెలియడం లేదు.
ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు ? కూలిన సమయంలో ఎంత మంది కూలీలు ఉన్నారు ? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు ? అనే వివరాలు తెలియరావడం లేదు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

EmoticonEmoticon