గ్రేటర్ విశాఖపట్నం ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతాడని న్యూస్ హల్ చల్ చేస్తోంది. జనసేన కార్యకర్తలమని చెప్పుకునే కొందరు యూత్ లీడర్స్ వైజాగ్ లో ఇప్పుడు నానా హంగామా సృష్టిస్తున్నారు. వైజాగ్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని కన్ఫామ్ చేసేస్తున్నారు. ఇక పవన్ స్టార్ మాత్రం ఇప్పటివరకూ వైజాగ్ లో పోటీ చేసే విషయంలో ఒక ప్రకటన కూడా చేయలేదు. గతంలో మున్సిపల్ ఎన్నికలను లైట్ తీసుకునే వారేమో కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. కీలక నగరాల్లో పాగా వేస్తే రాజకీయంగా తిరుగు ఉండదనే వాస్తవాన్ని పార్టీలు గుర్తించాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇలానే పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన విశాఖ కూడా పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అందుకే టీడీపీ, వైసీపీ సహా ఇతర ప్రధాన పార్టీలు వైజాగ్ పీఠంపై కన్నేశాయి. అందుకే ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. మాజీ ఎంపీ , గతంలో వైజాగ్ మేయర్ గా పనిచేసిన సబ్బం హరికి గాలం వేసేందుకు అటు బీజేపీ, ఇటు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే రకరకాల సమీకరణాలు, నాయకులు, వ్యూహాలు ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు వైజాగ్ లో మోహరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి సింగిల్ వ్యూహం కూడా లేని, అసలు ఇప్పటివరకూ పోటీ చేస్తారో చేయారో తెలియని జనసేన పార్టీ విశాఖలో జెండా ఎలా పాతగలదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ మేనియా వైజాగ్ లో పనిచేయదని, వలసలు ఎక్కువగా ఉండే ఈ నగరంలో భిన్న రాజకీయ వ్యూహాలే పనిచేస్తాయని చెప్తున్నారు.

EmoticonEmoticon