వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యవహారమే తీసుకుందాం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ తో ఏ మాత్రం సత్ సంబంధాలు లేకపోవటం.. తాను కోరుకున్నట్లుగా తనకు ఏపీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ తండ్రి పేరు.. మాతృపార్టీ పేరు మిస్ కాకుండా పెట్టుకోవటం కనిపిస్తుంది.
ఈ కారణంతోనే జగన్ పార్టీని ఉద్దేశించి.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ‘పిల్ల కాంగ్రెస్’ అంటూ పోలుస్తూ ఎటకారం చేసుకుంటుంటారు. దీనికి తగ్గట్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె. నారాయణ స్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇదే రీతిలో ఉండటం గమనార్హం. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నారాయణ స్వామి స్పందిస్తూ.. జగన్ ప్రస్తుత పరిస్థితిని దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చటం విశేషం.
గతంలో ఇందిరమ్మను వ్యతిరేకిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ వదిలేసి వెళ్లిపోయారని.. అప్పుడు ఇందిరమ్మ పోరాడి విజయం సాధించారని.. అదే తీరులో ఇప్పుడు కొందరు స్వార్థంతో జగన్ ను విడిచి పెట్టి వెళుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. నాడు ఇందిర మాదిరే నేడు జగన్ కూడా పోరాడుతున్నారని.. చివరకు ఆయనదే విజయమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాబును నమ్మి పార్టీ విడిచిపెట్టి వెళ్లిన వారు రెండింటికి చెడ్డ రేవడి కావటం ఖాయమని నారాయణ స్వామి శాపాలు పెట్టటం గమనార్హం. జగన్ ను పోల్చటానికి నారాయణస్వామికి ఇందిరమ్మ తప్పించి మరెవరూ దొరకలేదా? పాత గురుతులు అంత తేలిగ్గా పోవు కదా..?

EmoticonEmoticon