తప్పు చేయొద్దని సూటిగాన హెచ్చరించి పవన్ ?

23:20:00

స్నేహధర్మానికి ఒక హద్దు ఉంటుంది. అది హద్దు మీర కూడదు. తన ప్రయోజనాలన్ని పణంగా పెట్టి మిత్రధర్మాన్ని పాటించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇదే తీరులో ఉంది. మోడీతో మిత్రబంధాన్ని అంత త్వరగా వదులుకోవాలని లేని తత్వం ఒకపక్క.. మరోవైపు మోడీ అనుసరిస్తున్న వైఖరికి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక కిందామీదా పడుతున్నారు. దేశంలో అత్యంత బలమైన నేతగా ఉన్న మోడీతో ఢీ కొట్టే శక్తిసామర్థ్యాలు ప్రస్తుతానికి తనకు లేవన్న విషయం చంద్రబాబుకు తెలియని విషయం కాదు. అలా అని రాజీ పడిపోతే.. ఏపీలో విలన్ గా మారటం ఖాయమన్న సంగతి ఆయనకు తెలుసు. ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది.మోడీతో గొడవ పెట్టుకుంటే వచ్చే మూడేళ్లు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలీదు. అలా అని.. ఊరుకుండిపోదామా అంటే.. ఉండలేని విధంగా కేంద్ర మంత్రులు ఏపీ ప్రత్యేకహోదా మీద చేస్తున్న వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కన్ఫ్యూజన్ కు గురి అవుతున్న చంద్రబాబుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలే సమాధానంగా చెప్పొచ్చు. బాబుకు మోడీ ఎలాంటి స్నేహితుడో.. పవన్ కు ఇంచుమించు అలాంటి దోస్తానానే ఉంది. బాబు.. పవన్ లతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయటం.. పవన్ మాటకు జనాల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్న విషయం మోడీ ప్రత్యక్షంగా చూసిన విషయాన్ని మర్చిపోకూడదు. సాక్ష్యాత్తు ప్రధానమంత్రి తనకు మంచి మిత్రుడే అయినా.. ఏపీ ప్రజల ప్రయోజనాలు దెబ్బ తినే వేళ.. తాను ఏ మాత్రం ఉపేక్షించనన్న విషయాన్ని పవన్ తన ట్వీట్స్ తో తేల్చేశారు. శుక్రవారం సాయంత్రం వేళ కేంద్ర సహాయమంత్రి చౌదరి ఏపీ ప్రత్యేక హోదా మీద చేసిన వ్యాఖ్యలపై 24 గంటలు గడవక ముందే పవన్ స్పందించటం.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా నిర్ణయం తీసుకుంటే ఉద్యమం తప్పదన్న విషయాన్ని తేల్చి చెప్పటమే కాదు.. తప్పు చేయొద్దని సూటిగా హెచ్చరించారు కూడా. ఇందుకు విభజన సందర్భంలో కాంగ్రెస్ చేసిన తప్పులకు ఆ పార్టీ ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేయటం గమనార్హం. తన తాజా ట్వీట్స్ తో పవన్ తేల్చి చెప్పిన విషయం ఒక్కటే. తనకు మోడీ పరివారం మంచి మిత్రులే అయినా.. ఏపీ ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తినే పరిస్థితే ఉంటే.. ఊరుకోనని తేల్చి చెప్పేశారు. ఇంత సూటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ.. విపక్ష నేత వైఎస్ జగన్ కానీ వ్యాఖ్యానించకపోవటం గమనార్హం. స్నేహతుడి విషయంలో పవన్ స్పందన మాదిరే చంద్రబాబు రియాక్ట్ అయితే తప్ప ఏపీ ప్రయోజనాలు నెరవేరవన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. లేదంటే.. బాబు సైతం తగిన మూల్యం చెల్లించాల్సి రావొచ్చు

Share this

Related Posts

Previous
Next Post »