తమ స్వీయరక్షణకు మహిళలు ముఖాలకు వేసుకునే ముసుగుల వల్ల తాము పలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నట్లు పోలీసులు వాపోతున్నారు. అం దుకనే భద్రతా కారణాల రీత్యా ముఖాలకు ముసు గులు ధరించి తిరగటాన్ని నిషేధించాల్సిందిగా పోలీ సులు శాఖ ప్రభుత్వాన్ని కోరుతున్నది. ముఖానికి ముసుగులు ధరించటంతో తమకు నేర పరిశో ధనలో అనేక ఇబ్బందులు ఎదురౌతున్నారని పోలీ సులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. హైద రాబాద్‌లో ఇటీవల కాలంలో నేరాలు పెరిగిపోతు న్నాయి. ఎటిఎం చోరిలు, చైన్ స్నాచింగులు, ఇళ్ళ లోకి చొరబడటం లాంటి కేసులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే, పై కేసుల్లో విచారణ జరపటంలో పోలీసులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. కారణం, నేరస్తులు ముసుగులు ధరించటమే. నేరం ఎక్కడ జరిగినా, ఎంత పెద్ద నేరమైనా నేరస్తులు వదిలి వెళ్ళే ఆధారాల సహకారంతోనే పోలీసులు పలు కేసులను ఛేదిస్తుంటారు. అయితే, ఇక్కడ నేరం స్పష్టమైనా చేసిన వారి ఆచూకి దొరికిచ్చుకోవటం మాత్రం పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. ఎందుకంటే, నేరాలు చేసిన వారందరూ తమ మొహాలకు ముసుగులు వేసుకోవటమే. దాంతో నేరస్తులను గుర్తించటం పోలీసులకు సాధ్యం కావటం లేదు. దాంతో అసలు ముసుగులు వేసుకోవటంపైనే నిషేధం విధిస్తే నేరాలను అరికట్టవచ్చని, కనీసం నేరం జరిగిన వెంటనే నేరస్తులను గుర్తించవచ్చని పోలీసుల ఆలోచన. అసలు, మహిళలు ముఖ్యంగా యువతులు ముఖానికి ముసుగులు వేసుకోవటం అన్నది సుమారు పదేళ్ల నుండి తెలుగురాష్ట్రాల్లో మొదలైంది. అందుకు కారణం అప్పట్లో యువతులపై ప్రేమ పేరుతో పలువురు యాసిడ్ దాడులు జరుపటమే. ప్రేమ పేరుతో తమను వేధించే వారి నుండి తమను తాము రక్షించుకోవటం కోసం పలువురు యువతులు తమ మొహాన్ని దాచుకోవటం కోసం ముసుగులు వేసుకోవటం మొదలుపెట్టారు. అదేసమయంలో ఎండి వేడిమి నుండే కాకుండా, కాలుష్యం భారి నుండి తమను తాము తప్పించుకునేందుకు ముఖానికి ముసుగులు వేసుకోవటం అన్నది సాధారణమైపోయింది. కొద్దిరోజుల క్రితం గచ్చిబౌలిలోని ఇనార్బిట్‌మాల్‌లో డెబిట్ కార్డుల దొంగ ఒకడు ఏటిఎం నుండి డబ్బులు తీసుకుంటున్న వైనాన్ని పోలీ సులు గుర్తించారు. అయితే, సదరు దొంగ తన ముఖానికి ముసుగు వేసుకుని వుండటంతో చాలా కాలం పాటు దొంగను గుర్తించలేకపోయారు. వేరే దొంగ తనం కేసులో అదే దొంగను మోటారు వాహనం పార్కింగ్‌లోని సిసి కెమెరాల ఆధారంగా పట్టుకున్నపుడు ఏటిఎంలో కూడా చోరికి పాల్పడింది అతనే అని పోలీసులు గుర్తించారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగలు కూడా తమ ముఖాలకు ముసుగులు వేసుకుంటున్నారు. ఆ మధ్య బురాఖాలు వేసు కుని దొంగతనాలు, దొమ్మీలకు పాల్పడుతున్నారంటూ ఫ్రాన్స్‌లో బురఖాలపై అక్కడి ప్రభుత్వం నిఫేధం విధించింది
ఇక నుంచి మహిళలు ముసుగులు ధరించవద్దు

EmoticonEmoticon