మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలైపోయింది

06:29:00
రామ్ చరణ్ మొదలుపెట్టిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మెగాస్టార్ చిరంజీవి మూవీ.. రెండూ ఒకేసారి ప్రారంభమయ్యాయి. చెర్రీ తల్లి సురేఖ - రామ్ చరణ్ ల సమక్షంలో.. వీరి గత నివాసంలో కొణిదెల బ్యానర్ ను స్టార్ట్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కత్తిని తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. 

ఈ చిత్రాన్ని కొణిదెల బ్యానర్ పై రామ్ చరణ్ సురేఖలు నిర్మిస్తుండగా.. ఇప్పుడీ మూవీకి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పవర్ ఆన్ చేయగా.. తొలి షాట్ కు మెగా బ్రదర్ నాగబాబు దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పరుచూరి  వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. ఈ ప్రాజెక్టుకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న కత్తిలాంటోడు చిత్రానికి.. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

మెగాస్టార్ కుటుంబం ఈ రెండు ప్రారంభాలను ప్రైవేట్ ఈవెంట్ మాదిరిగానే జరిపారు. కుటుంబసభ్యులు సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అల్లు అర్జున్ - వరుణ్ తేజ్ - సాయి ధరం తేజ్ - నాగ బాబు - అల్లు అరవింద్ - కొరటాల శివ - శరత్ మరార్ - జెమిని కిరణ్ - డీవీవీ దానయ్య. తిరుపతి ప్రసాద్ తో పాటు మరికొంత మంది సన్నిహితులు కూడా ఈ మెగా ఈవెంట్ లో సందడి చేశారు. 

Share this

Related Posts

Previous
Next Post »