పవన్ సినిమా లాంచ్

02:23:00

పవన్ కళ్యాణ్- ఎస్ జే సూర్య సినిమా మొదలైంది. శరత్ మరార్ కొత్త ఆఫీస్ లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎవ్వరికీ ఆహ్వానాలు కూడా అందలేదు. కేవలం పవన్, సూర్య, శరత్ మరార్, ఎడిటర్ గౌతంరాజు మాత్రమే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ మరో విశేషమేంటంటే పవన్ సినిమా కొత్త సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్ కొట్టడం. ఇక్కడే అసలు ఆసక్తి రేకెత్తుతుంది. తన సినిమాకు సంబంధించిన వాళ్లను మినహా.. బయటి వాళ్లను అసలు ఆహ్వానించలేదు పవన్ కళ్యాణ్. మరి సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడంటే.. పవన్-సూర్య సినిమాకు నితిన్ తండ్రి నిర్మాత కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా చాలా సైలెంట్ గా తన కొత్త సినిమా మొదలుపెట్టేసాడు పవర్ స్టార్. కొత్త సినిమా ముహూర్తం విషయంలో మీడియాకు కూడా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు పవన్. ఎవ్వరికీ చెప్పకుండానే తంతు పూర్తి చేసాడు. ఇప్పటికే కథ పూర్తైపోయింది. ఖుషీ, పులి తర్వాత సూర్య-పవన్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఇది. మొత్తానికి సర్దార్ తర్వాత పవన్ ఎన్నాళ్లు గ్యాప్ తీసుకుంటాడో అని అభిమానులు కంగారు పడ్డారు. కానీ వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎవరూ ఊహించని విధంగా కొత్త సినిమాకు కొబ్బరికాయ్ కొట్టాడు పవర్ స్టార్. అన్నీ కుదిర్తే మే తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటాడని సమాచారం. ఇదే ఏడాది సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు పవర్ స్టార్

Share this

Related Posts

Previous
Next Post »