Showing posts with label telangana. Show all posts
Showing posts with label telangana. Show all posts

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో కుప్పకూలిన భవనం

02:35:00 Add Comment

 నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. ఆ ఇద్దరూ కూలీలుగా తెలుస్తోంది.  మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఎనిమిది పిల్లర్లు నేలమట్టమయ్యాయి. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సినిమా ఛాన్స్‌ల కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చే వారితో నిత్యం ఫిల్మ్‌నగర్ కిటకిటలాడుతోంది. అలాంటి చోట ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.కల్చరల్ సెంటర్ కు దగ్గర ఓ భవనం నిర్మాణం అవుతోంది. శనివారం రాత్రి శ్లాబ్ నిర్మాణం వేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కొంతమంది కూలీలు పని చేసేందుకు వచ్చారు. 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. 14 ఫిల్లర్లు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పని చేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై కూలీలను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది కూలీలకు గాయాలు కావడంతో వీరిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిర్మాణం విషయంలో నాణ్యత లోపించడం వల్లే భవనం కుప్పకూలిందని తెలుస్తోంది. భవనానికి సంబంధించిన వారు అందుబాటులోకి లేకపోవడంతో ఎలాంటి సమాచారం తెలియడం లేదు.
ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు ? కూలిన సమయంలో ఎంత మంది కూలీలు ఉన్నారు ? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు ? అనే వివరాలు తెలియరావడం లేదు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

టి-కాంగ్రెస్‌ని ఆదుకునే నేత ఎవ‌రు?

22:10:00 Add Comment

కాంగ్రెస్ క‌న్ను తెలుగు రాష్ట్రాల‌పై ఉందిప్పుడు. ఓ వైపు యూపీ ఎన్నిక‌ల కోసం క‌స‌ర‌త్తులు చేస్తూనే తెలుగునాట జ‌రిగే ఎన్నిక‌లపైనా అధినేత్రి దృష్టి సారించారుట‌. 2019 ఎన్నిక‌ల గురించి దిల్లీ అధిష్ఠానం ఇప్ప‌టినుంచే పాచిక‌లు వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చీ.. ఆ ప్రాంతంలో వెన‌క‌బాటు త‌నానికి కార‌ణ‌మేంటో అర్థంగాక మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు కాంగ్రెస్ పెద్ద‌లు. ఏదైతేనేం ఉత్త‌మ్ కుమార్ ని టి-కాంగ్రెస్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి కొత్త ర‌క్తం ఎక్కించాల‌ని ప్లాన్ చేశారు. తెలంగాణ‌లో కీల‌క‌నేత‌లంతా గులాబీ గూట్లో చేరిపోవ‌డంతో ఈ స‌న్నివేశం త‌లెత్తింది. రేసులో అర‌డ‌జ‌ను మంది ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మాజీ క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దీన్‌తోపాటు న‌టి విజ‌య‌శాంతి, మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్‌ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనలో ఉన్నారు. అయితే ఇంత‌మందిలో అంద‌రినీ రాముల‌మ్మ డామినేట్ చేసేస్తోందని, సినీగ్లామ‌ర్ ముందు అన్నీ ప‌రేషాన్ అవుతున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ విజ‌య‌శాంతికే ఎక్కువ స‌పోర్టునిస్తున్నార‌ని, అలాగే అజార్ పేరును ఆయ‌న ప్ర‌తిపాదించార‌ని చెప్పుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన త‌ర్వాత మ‌ళ్లీ యాక్టివ్‌గా క‌నిపించ‌ని విజ‌య‌శాంతికి ఏ కోణంలో ప‌గ్గాలు అప్ప‌జెబుతార‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఏదేమైనా రేసులో రాముల‌మ్మ టాప్ పొజిష‌న్‌లోనే ఉంది ఇప్ప‌టికి.

ఉగ్రవాదుల హిట్ లిస్టులో ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ ?

07:53:00 Add Comment

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు - ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్  ఉగ్రవాదుల  హిట్ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిఘావర్గాలు అందించిన ఈ సమచారంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఒక్కసారిగా భద్రత పెంచింది. హైదరాబాద్ సిటీలో ఉగ్రవాదుల జాడలు బాగా పెరిగిన నేపథ్యంలో బీజేపీ నేత అయిన లక్ష్మణ్ కు భద్రత పెంచారు. ఇందులో భాగంగా ఆయనకు పోలీసు రక్షణను రెట్టింపు చేశారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా కేటాయించారు. 
హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు వారం కిందట దొరికిపోయిన సంగతి తెలిసిందే.  అయితే.. ఉగ్రవాదుల ఇంకా ఉండవచ్చని.. వారు బీజేపీ నేతలను టార్గెట్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నిఘావర్గాలు కూడా ఇందుకు సంబంధించి పక్కా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లక్మణ్ ఐఎస్ ఐఎస్ హిట్ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది. గతంలోనూ బీజేపీ నేతల ఇళ్ల వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారనడానికి ఆధారాలున్నాయి. ఐఎస్ టెర్రరిస్టులు ముస్లిమేతర పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ముప్పు లక్ష్మణ్ కే ఉందని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగానే ముందు జాగ్రత్తకు ఆయనకు గట్టి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీ భ‌వ‌న్ మా ఆస్తి. అది మాకే ద‌క్కాలి టీ-సీఎం కేసీఆర్‌

00:10:00 Add Comment

ఏపీ భ‌వ‌న్ మా ఆస్తి. అది మాకే ద‌క్కాలి అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కి లేఖ రాశారాయ‌న‌. మా క‌ల్చ‌ర్ కోసం భ‌వంతులు నిర్మించుకుంటాం. ముందు ఏపీ నుంచి స్వాధీన‌ప‌ర్చండి అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. “విదేశీ వ్యవహారాల శాఖ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936లో ఢిల్లీలో 18.18 ఎకరాల స్థలాన్ని భారత ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలో ప్రస్తుత హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఏపీ భవన్ ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో హైదరాబాద్ హౌజ్‌ను కేంద్రం స్వాధీనం చేసుకుంది. 7.56 ఎకరాల పటౌడీ హౌస్, 1.21 ఎకరాల నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను అప్పటి ఏపీ ప్రభుత్వానికి కేటాయించింది. ఆరో నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో దేశంలో విలీనమైన తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్‌కే బదిలీ అయింది. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు సదరు స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. రెండేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ స్టేట్‌కు బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. దాన్ని ఏపీ, తెలంగాణకు విభజించటం కుదరదు“ అంటూ సీఎం స్ప‌ష్టంగా లేఖ‌లో పేర్కొన్నారు.
నాడు మద్రాస్ నుంచి ఆంధ్రా వేరుపడింది కాబ‌ట్టి ఢిల్లీలో ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సింది. లేదూ జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాస్ (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రానికి ఉన్న స్థలంలో ఆంధ్రకు వాటా ఇవ్వాల్సింది. చ‌రిత్ర‌ను, ఆధారాల్ని ప‌రిశీలించి ఏపీ భవన్‌ని మాకు ఇచ్చేయాల్సిందే… అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. అందుకు ప్రతిగా ఏపీకి స్టేట్ భవన్, రెసిడెంట్ కమిషనర్ ఆఫీసుల కోసం ఢిల్లీలో వేరొక స్థ‌లం కేటాయించుకోండ‌ని కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. జనాభా ధామాషా నిష్పత్తి ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంద‌ని అన్నారు.

టీఆర్ఎస్ఎల్పీలో వైసీపీని విలీనం

23:12:00 Add Comment

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు తెలంగాణాలో షాక్ తగిలింది. ఏపీలో ఓవైపు ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార టీడీపీలోకి జంప్ అవుతుంటే.. ఇటువైపు తెలంగాణాలో వైసీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ లోకి చేరిపోయి షాక్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ తెలంగాణా రాష్ట్ర శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేయాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో లేఖకు స్పందించిన స్పీకర్ వైసీపీ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను ఇకపై అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తారు. మరి తెలంగాణా రాష్ట్రంలో ఇకపై జగన్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో ఆయనకే తెలియాలి.

ఏపీలో పోల‌వ‌రం కోసం సీఎం కేసీఆర్ సాయం !

23:08:00 Add Comment

నీటి పంప‌కాల‌పై ఎవ‌రు ఎంత వాటా తీసుకోవాలో గ‌తంలోనే నిర్ణ‌య‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. ఏపీ నేత‌లు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌కు ద‌క్కాల్సిన న‌దీజ‌లాలు ద‌క్క‌లేదు. గోదావ‌రి, కృష్ణా నుంచి న్యాయంగా ద‌క్కాల్సిన వాటా రాలేదు. అందుకే `నీరు-నిధులు- నియామ‌కం` ప్రాతిపాదిక‌న దీనిపై గ‌తంలో ఎంతో పోరాడాం. తెలంగాణ‌లో ప్రారంభించిన ప్రాజెక్టులు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ముందుకు కొన‌సాగ‌లేదు. ప‌ర్యావ‌ర‌ణం వ‌ల్ల, అంత‌రాష్ర్ట వివాదాల వ‌ల్ల స‌మ‌స్య‌లొచ్చాయి. అయితే ఇప్ప‌టికైనా నీటిని స‌వ్యంగా వినియోగించుకోవాల‌ని పాల‌మూరు, దిండి ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి ప్రారంభ‌మైనా.. ఏపీలో పోల‌వ‌రం కోసం సీఎం కేసీఆర్ సాయం చేస్తామ‌న్నారు. గోదావ‌రిలో నీరు స‌మృద్ధిగా ఉంది. దానిని స‌రిగా వాడుకోలేక‌పోతున్నాం. మేం ప‌రిధి మేర మాత్ర‌మే వినియోగించుకుంటాం. మీరు కూడా వాడుకోండి. ఎగువ‌న ఉన్న మేం కూడా పోల‌వ‌రానికి సాయం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపార‌ని క‌డియం వివ‌ర‌ణ ఇచ్చారు. ప్రాజెక్టులు అడ్డుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌ర‌గ‌దు. ఎగువ‌న ఉన్న రాష్ర్టాల్లో ఎంత నీరు వాడుకోవాలి? దిగువ‌కు ఎంత వెళ్లాలి అన్న‌దానిపై ఇప్ప‌టికే క్లారిటీ ఉంది. 1400 టీఎంసీల నీరు గోదావ‌రిలో ఉంది. అందులో 950 టీఎంసీలు తెలంగాణ‌కు చెందుతుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అది తేట‌తెల్ల‌మైంది. కృష్ణాలో 300 టీఎంసీల నీరుంది. ఇందులోనూ తెలంగాణ‌కు చెందే వాటాను మాత్ర‌మే ఉప‌యోగించుకుంటాం. కాబ‌ట్టి ఏపీ అన‌వ‌స‌ర రాద్ధాంతం చేయ‌కూడదు… అని వాస్త‌వ ప‌రిస్థితిని తెలిపారు.

రేవంత్ రెడ్డికి ప్రాణహాని తలపెట్టాలని అనుకుంటున్న కేసీఆర్ ..?

23:35:00 Add Comment

తెలంగాణలో తిరుగులేని నేత, ముఖ్యమంత్రి కేసీఅర్ కు వ్యతిరేకంగా ఎంతటి మాటైనా మాట్లాడగల నేత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ మధ్య కొంతకాలంగా సైలెంట్ అయిన రేవంత్ కొంత కాలం క్రితం ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తో బాగానే సున్నం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే రేవంత్ కొందరు టీఆర్ఎస్ నేతలు, గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, తెలంగాణా యంత్రాంగం మీద, పోలీసుల మీద తనకు నమ్మకం లేదని అన్నారు.
అలాగే తనకు కేంద్ర బలగాల ద్వారా భద్రత కల్పించాలని హై కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అందరూ డేర్ అండ్ డాషింగ్ గా పేరున్న రేవంత్ ఏమిటి అలా చేయడమేమిటి అని విస్తుపోయారు. ఆయన పిటిషన్ ను విచారణకు తీసుకున్న కోర్టు రేవంత్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆయనకు అదనపు భద్రత కల్పించాలని మహబూబ్ నగర్ పోలీసులను ఆదేశించింది.

‘అమల’ కు సరైన స్థానాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!

10:06:00 Add Comment


తెలంగాణా ప్రభుత్వం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సతీమణి అమలకు ఓ సముచిత గౌరవాన్ని ఇస్తూ ఓ ప్రముఖ స్థానాన్ని కట్టబెట్టింది. ఆ విశేషాలలోకి వెళితే, ముందుగా తెలుగు రాష్ట్రాల్లో అమల బ్లూ క్రాస్ తరపున జంతు సంరక్షణ కోసం చాలా కాలంగా ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమల సేవలను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డులో సముచిత స్థానాన్ని ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను చైర్మన్ గా నియమించిన ఈ బోర్డులో అమలను సభ్యురాలిగా తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే, సీఎం కేసీఆర్ సూచన మేరకు మొత్తం 21 మందితో కూడిన జంతు సంరక్షణ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందట. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణా ప్రభుత్వం నేడు జారీ చేసినట్లు సమాచారం.

తెలంగాణ ఉద్యమం ప్రపంచానికే మాట

02:28:00 Add Comment



 అమరులకు నివాళితో ప్రారంభమైన 
ప్లీనరీ  సమావేశంలో భాగంగా 15 తీర్మానాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. సంక్షేమ పథకాల ఆధారంగా తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - పార్టీ నాయకులు - కార్యకర్తల రాకతో ఖమ్మం గులాబీమయంగా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా టీఆర్ ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షోపదేశం చేశారు. 15 ఏళ్లు నిరంతరంగా సాగిన ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించామన్నారు. ప్రపంచానికే భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం చేశామని కేసీఆర్ చెప్పారు. ధీరులు అవరోధాలను అధిగమించి లక్ష్యం వైపు ముందుకెళ్తారనే సందేశం ఇందులో అంతర్లీనంగా ఉందన్నారు. టీఆర్ ఎస్ శ్రేణులు అవమానాలను - అవహేళనను తట్టుకొని తెలంగాణ కోసం ఉద్యమించారని గుర్తు చేశారు.

మే నెల ముగిసే సమయానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని వెల్లడించారు. 3500 నుంచి 4వేల మంది నాయకులకు నామినేటెడ్ పోస్టులు వస్తాయని స్పష్టం చేశారు. పదవులు వచ్చినవారే గొప్పవాళ్లు కారని రానివాళ్లు చిన్నవాళ్లు కారని కేసీఆర్ అన్నారు. తెలివైన రాజకీయనాయకుడు తన టర్మ్ కోసం ఎదురుచూడాలని సూచించారు. పార్టీ - ప్రభుత్వం జోడు గుర్రాల్లాగా పరుగెత్తాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు.

సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు. మిషన్ కాకతీయ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలంగాణ నీటి కార్యక్రమాలను దేశవిదేశాలు ప్రశంసిస్తున్నాయని చెప్పారు. కరవు శాశ్వత నివారణకు మిషన్ భగీరథ పరిష్కారం చూపుతుందని చెప్పిన ఆయన... మే 30లోపు రైతుల పొలాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీనిచ్చారు. ఇంటింటికీ నీరందించకుంటే ఓట్లడగబోమని చెప్పానని కార్యకర్త ఉద్యమస్ఫూర్తిపై ఉన్న భరోసాతోనే ప్రకటన చేశానని తెలిపారు. అలాగే ఇక తెలంగాణలో కరెంట్ కోతలు ఉండబోవన్నారు. త్వరలోనే జైపూర్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం కానుందని ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ రానుందని స్పష్టం చేశారు

నగరంలో కురిసిన భారీ వర్షం

01:07:00 Add Comment

గత కొన్ని రోజులుగా ఎండ దెబ్బకు హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఒకవైపు ఎండతో పాటు.. మరోవైపు వడగాలులు తోడవ్వడంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా గాల్లో కలిసిపోతున్నాయి. ఇటువంటి సమయంలో హైదరాబాదీలకు చల్లని వార్తను అందించాడు వరుణుడు. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం సమయంలో అక్కడక్కడ చినుకులు కురిశాయి. ఇక చీకటి పడ్డాక భారీ వర్షం కురవడం మొదలుపెట్టింది. అంతే.. ఎంతో కాలంగా వేడితో అల్లాడిపోయిన జనాలు.. చల్లని వర్షంలో హాయిగా సేదతీరారు. ఇక, నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి.

భానుడి భగభగలు

00:18:00 Add Comment

భానుడి దెబ్బకు పాత రికార్డులన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే మండుతున్న ఎండలతో జనాలు ఠారెత్తే పరిస్థితి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ రోడ్ల మీదకు రాకుండా ఉండటమే మంచిదంటూ వాతావరణ నిపుణులు.. వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. మరీ.. అవసరమైతే తప్ప బయటకు రావటం తగ్గించాలని చెబుతున్నారు.

ఠారెత్తించే ఎండ తీవ్రత మరో మూడు రోజుల పాటు సాగుతుందని చెబుతున్న వాతావరణ అధికారుల మాట ప్రజల గుండెల్లో పెద్ద రాయి పడేలా చేస్తోంది. ఎందుకంటే.. ఏప్రిల్ లోనే ఈ రేంజ్ లో ఎండలు మండితే.. మరి మంటపుట్టించే ‘‘మే’’ను తలుచుకుంటేనే వణుకు పుట్టే పరిస్థితి. తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా.. ఏప్రిల్ రెండో వారంలో 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతనమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. కనిష్ఠంగా 42 అయితే.. గరిష్ఠంగా 45 డిగ్రీలుగా చెబుతున్నారు.

నిజానికి రేంజ్ లో ఎండలు రాయలసీమ.. కోస్తాలలో మామూలే. కానీ.. తెలంగాణలో ఈ స్థాయిలో ఎండలు.. అది కూడా ఏప్రిల్ మొదట్లోనే కావటం దడ పుట్టిస్తోంది. పాడు ఎండల కారణంగా.. శనివారం ఒక్క రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య అక్షరాల 79 మంది. అది కూడా అధికారిక లెక్కల ప్రకారం. అనధికారిక లెక్కల ప్రకారం ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
బీకేర్ ఫుల్..

ఇక నుంచి మహిళలు ముసుగులు ధరించవద్దు

10:51:00 Add Comment



తమ స్వీయరక్షణకు మహిళలు ముఖాలకు వేసుకునే ముసుగుల వల్ల తాము పలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నట్లు పోలీసులు వాపోతున్నారు. అం దుకనే భద్రతా కారణాల రీత్యా ముఖాలకు ముసు గులు ధరించి తిరగటాన్ని నిషేధించాల్సిందిగా పోలీ సులు శాఖ ప్రభుత్వాన్ని కోరుతున్నది. ముఖానికి ముసుగులు ధరించటంతో తమకు నేర పరిశో ధనలో అనేక ఇబ్బందులు ఎదురౌతున్నారని పోలీ సులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. హైద రాబాద్‌లో ఇటీవల కాలంలో నేరాలు పెరిగిపోతు న్నాయి. ఎటిఎం చోరిలు, చైన్ స్నాచింగులు, ఇళ్ళ లోకి చొరబడటం లాంటి కేసులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే, పై కేసుల్లో విచారణ జరపటంలో పోలీసులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. కారణం, నేరస్తులు ముసుగులు ధరించటమే. నేరం ఎక్కడ జరిగినా, ఎంత పెద్ద నేరమైనా నేరస్తులు వదిలి వెళ్ళే ఆధారాల సహకారంతోనే పోలీసులు పలు కేసులను ఛేదిస్తుంటారు. అయితే, ఇక్కడ నేరం స్పష్టమైనా చేసిన వారి ఆచూకి దొరికిచ్చుకోవటం మాత్రం పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. ఎందుకంటే, నేరాలు చేసిన వారందరూ తమ మొహాలకు ముసుగులు వేసుకోవటమే. దాంతో నేరస్తులను గుర్తించటం పోలీసులకు సాధ్యం కావటం లేదు. దాంతో అసలు ముసుగులు వేసుకోవటంపైనే నిషేధం విధిస్తే నేరాలను అరికట్టవచ్చని, కనీసం నేరం జరిగిన వెంటనే నేరస్తులను గుర్తించవచ్చని పోలీసుల ఆలోచన. అసలు, మహిళలు ముఖ్యంగా యువతులు ముఖానికి ముసుగులు వేసుకోవటం అన్నది సుమారు పదేళ్ల నుండి తెలుగురాష్ట్రాల్లో మొదలైంది. అందుకు కారణం అప్పట్లో యువతులపై ప్రేమ పేరుతో పలువురు యాసిడ్ దాడులు జరుపటమే. ప్రేమ పేరుతో తమను వేధించే వారి నుండి తమను తాము రక్షించుకోవటం కోసం పలువురు  యువతులు తమ మొహాన్ని దాచుకోవటం కోసం ముసుగులు వేసుకోవటం మొదలుపెట్టారు. అదేసమయంలో ఎండి వేడిమి నుండే కాకుండా, కాలుష్యం భారి నుండి తమను తాము తప్పించుకునేందుకు ముఖానికి ముసుగులు వేసుకోవటం అన్నది సాధారణమైపోయింది. కొద్దిరోజుల క్రితం గచ్చిబౌలిలోని ఇనార్బిట్‌మాల్‌లో డెబిట్ కార్డుల దొంగ ఒకడు ఏటిఎం నుండి డబ్బులు తీసుకుంటున్న వైనాన్ని పోలీ సులు గుర్తించారు. అయితే, సదరు దొంగ తన ముఖానికి ముసుగు వేసుకుని వుండటంతో చాలా కాలం పాటు దొంగను గుర్తించలేకపోయారు. వేరే దొంగ తనం కేసులో అదే దొంగను మోటారు వాహనం పార్కింగ్‌లోని సిసి కెమెరాల ఆధారంగా పట్టుకున్నపుడు ఏటిఎంలో కూడా చోరికి పాల్పడింది అతనే అని పోలీసులు గుర్తించారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగలు కూడా తమ ముఖాలకు ముసుగులు వేసుకుంటున్నారు. ఆ మధ్య బురాఖాలు వేసు కుని దొంగతనాలు, దొమ్మీలకు పాల్పడుతున్నారంటూ ఫ్రాన్స్‌లో బురఖాలపై అక్కడి ప్రభుత్వం నిఫేధం విధించింది

అర్దరాత్రి కార్ రేసింగ్ లో పట్టుబడ్డ కేంద్రమంత్రి కుమారుడు

05:20:00 Add Comment


తెలుగు రాష్ర్టాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో టీడీపీ నేతలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీ మంత్రులు గంటా, రావెల వంటివారు తమ సుపుత్రుల నిర్వాకాలతో చిక్కుల్లో పడ్డారు. తాజాగా టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కూడా అదే అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆర్థిక వ్యవహారాల్లో ఎదురైన చిక్కుల్లో ఉన్న ఆయనకు ఇది మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ కారు రేసింగులకు పాల్పడుతుండగా హైదరాబాద్ బంజారా హిల్సు పోలీసులు కేసు నమోదు చేయడంతో మంత్రిగారికి చిక్కులొచ్చాయి.

శుక్రవారం రాత్రి హైదరాబాదులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న సుజనా కొడుకు కార్తీక్ పై బంజారాహిల్సు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న రాత్రి మిత్రులతో కలిసి జూబ్లీహిల్సు చెక్ పోస్టు నుంచి కార్తీక్ పంజాగుట్ట వరకు కారు రేసింగులకు దిగినట్లు సమాచారం. ఈ రేసింగుల్లో కార్తీక్ వాడిన కారు 'ఏపీ 09 సీవీ 9699' సుజనా యూనివర్సల్ పేరిట రిజిస్టర్ అయి ఉంది. మరో మూడు కార్లు, పది బైకులపై అతడి మిత్రులు వచ్చారు. అర్ధారాత్రి వేళ 100 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో కార్లు వెళ్తుంటే జనం జడుసుకున్నారు. కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ ఆర్ నగర్, మహంకాళీ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కార్తీక్ సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్సు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్తీక్ పై ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణ కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల కింద బుక్కయ్యే నిందితులకు కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత పోలీసులు వదిలేస్తున్నారు. దీంతో సుజనా కొడుకు కార్తీక్ కు పెద్దగా ఇబ్బంది లేకుండా విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

శ్రీసీతారాముల కళ్యాణం వైభోగమే

05:09:00 Add Comment
భద్రాచలంలో పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్‌ -పాల్గొన్న పలువురు మంు్తల్రు రామయ్య -పెళ్లిని చూసి పులకించిన భక్తజనం -ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం -సకల దేవతలకూ ఆహ్వానం -పట్టువస్త్రాలు సమర్పించిన ఇన్‌చార్జి మంత్రి గంటా, విప్‌ మేడా -పౌర్ణమినాడు స్వామివారికి కల్యాణం -పాల్గొననున్న చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌ భద్రాచలం, మేజర్‌న్యూస్: శ్రీరామ నామస్మరణతో భద్రాచలం ఉప్పొంగిపోయింది. అద్యంతం కన్నులపండవగా సాగిన కళ్యాణోత్సవంలో జగదభిరాముడు... శ్రీరామచంద్రుడు... కళ్యాణరాముడుగా మారి.... జనకుని తనయ సీతమ్మను అభిజిత్‌లగ్నంలో కళ్యాణమాడిన అపురూప ఘట్టాన్ని చూసి భక్తకోటి పులకించిపోయారు. సీతమ్మ నొసటన కళ్యాణబొట్టు, బుగ్గన దిష్టిచుక్కను పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పట్టు వస్త్రాలను వేదపండితులు, అర్చకులు ధరింపచేశారు. దశరథ రాజు తనయుడు రామచంద్రుడు చూపరులను ఆకట్టుకునేలా సర్వాభరణ భూషితుడై కళ్యాణ వేదికైన మిధిలాపురికి తన పరివారంతో చేరుకున్నాడు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ మొదలగు ఆభరణాలను ఆ వధూవరులకు అలంకరించడంతో మరింత అందానిచ్చాయి. భద్రాద్రి నలుదిక్కులా రామనామం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణలు మార్మోగుతుండగా, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్మిఖీ నామ సంవత్సర చైత్రశుద్ద నవమి శుక్రవారం శుభముహుర్తం అభిజిత్‌లగ్నం ప్రవేశించగానే మిథిలాపురి కళ్యాణ మండపంలో రజితసింహావాహనంపై కొలువైన సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. మూడు సూత్రాలతో భక్తరామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి వైభవోపేతంగా మాంగల్యధారణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు, సీతారాముల శిరస్సుల నుంచి జల్లులా పడుతుంటే భక్తులంతా ముగ్ధులై తిలకించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు మత్రోచ్ఛారణల మధ్య నయనానందకరంగా జగదభిరాముని కల్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దంపతులు కళ్యాణ మండపానికి చేరుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పించి, శ్రీసీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఆలయానికి చేరుకోగా దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సంప్రదాయ ప్రకారం వరివట్టంకట్టి, పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు శ్రీసీతారామచం ద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మిథిలాస్టేడియానికి చేరుకున్నారు. పావన గోదావరి తీరాన శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా సాగింది. శ్రీరామనామస్మరణతో భద్రాద్రి మారుమ్రోగిపోయింది. నేత్రపర్వంగా సాగిన కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీరామస్మరణతో భద్రాద్రి పురఃవీధులు మారుమ్రోగాయి. మిథిలా కళ్యాణ మండపంలో ఆశీనులైన భక్తకోటి జనసందోహం నడుమ శ్రీసీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరిగింది. అనంతరం ఉత్సవమూర్తుల విగ్రహాలను ఘనంగా ఊరేగించారు.

నక్సలైట్లు ఉంటే బాగుండేది రేవంత్ రెడ్డి

04:51:00 Add Comment


ఆర్మూర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట గత నెల 9న జరిగిన తలారి సత్యం యాక్సిడెంట్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను కోరుకున్నారని అన్నారు. కానీ, రాజ్యాన్ని ప్రశ్నించిన శృతి, సాగర్‌, వివేక్‌లను ప్రభుత్వం ఎన్‌కౌంటర్లతో పొట్టన పెట్టుకుందని అన్నారు. ఎమ్మెల్యేపై కేసు వేశాడని సత్యాన్ని చంపేశారని, ప్రభుత్వంలో ఎవరికీ భయం లేదని, అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, ఇలాంటి సమయంలోనే నక్సలైట్లు ఉంటే బాగుండేదని, ప్రజా ప్రతినిధులకు భయం ఉండేదని, ఇలాంటి హత్యలు ఆగేవని, నక్సలైట్లు లేకపోవడంతో విచ్ఛలవిడితనం పెరిగిందని ఆయన అన్నారు.
ఇవే పరిస్థితులు కొనసాగితే యువత మరో దారి వెతుక్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సత్యం హత్యకు నిరసనగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఏడో రోజైన ఆదివారం దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. దళిత నేత సత్యం యాక్సిడెంట్‌ కేసులో నిజాలు బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు. సత్యం గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఆర్మూర్‌ నుంచి పోటీ చేశాడని, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో అన్ని వివరాలనూ సమర్పించలేదని కేసు వేశాడని, ఈసీ స్పందించకపోతే హైకోర్టులో కేసు వేశాడని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచే సత్యానికి వేధింపులు పెరిగాయని, ఒక దశలో ఎన్‌కౌంటర్‌కూ యత్నించారని, మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలుస్తామని తెలిపారు.