వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు తెలంగాణాలో షాక్ తగిలింది. ఏపీలో ఓవైపు ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార టీడీపీలోకి జంప్ అవుతుంటే.. ఇటువైపు తెలంగాణాలో వైసీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ లోకి చేరిపోయి షాక్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ తెలంగాణా రాష్ట్ర శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేయాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో లేఖకు స్పందించిన స్పీకర్ వైసీపీ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను ఇకపై అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తారు. మరి తెలంగాణా రాష్ట్రంలో ఇకపై జగన్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో ఆయనకే తెలియాలి.

EmoticonEmoticon