ఏపీకి ప్రత్యేక హో్దా హుళక్కేనని ప్రకటించింది కేంద్రం. నేరుగా ప్రకటించే ధైర్యం లేక .. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చే ప్రకటన చేయించింది. ఆ పాపానికి ఇప్పుడు ఆయన ప్రాయాశ్చిత్తం వెతుక్కోవాల్సిన పరిస్థితి. `ఇక మీరు ఏపీకి వచ్చే సాహసం చేయకండి. అడుగుపెడితే అయిపోతారు!` అంటూ నెటిజనుల నుంచి వార్నింగ్‌లు జారీ అయ్యాయి. `ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో లేదు` అంటూ పార్లమెంట్‌లో గంభీరంగా ప్రకటించిన సదరు మంత్రి ఇప్పుడు పిల్లి అయిపోయారు. సోషల్ నెట్‌వర్క్ సైట్స్‌లో తనపై వినిపిస్తున్న కామెంట్లు చదువుకుని బెంబేలెత్తిపోతున్నారాయన. ఏం జరిగిందో ఏంటో? ఏపీకి రావద్దని వార్నింగ్ ఇచ్చారంటూ వాపోతున్నారు. అయినా ఏపీకి ప్రత్యేకించి నేనేమీ చెప్పలేదు. అసలైన వాళ్లు వెనక ఉండి చెప్పించారు! అన్నట్టే సదరు మంత్రి భయాన్ని బైటపెట్టారు. రెవెన్యూలోటు భర్తీ చేస్తామన్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు? అని మాత్రమే తాను అన్నానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా తప్పిదం జరిగిపోయింది. ఒకవేళ జయంత్ సిన్హా ఏపీలో అడుగుపెడితే అప్పుడు తెలుగు ప్రజల చేతుల్లో మసాజ్ గ్యారెంటీ. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ .. ఇంతమందిని కలవరపాటుకు గురి చేస్తోంది ఈ మ్యాటర్.

EmoticonEmoticon