ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.2.5లక్షల వరకు అవసరమైన వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో దాదాపు 1100 వరకూ శస్త్రచికిత్సల్ని అందించనున్నారు. అయితే.. ఈ ఆఫర్ 2014 డిసెంబరు 8వ తేదీ నాటికి అమరావతి (సీఆర్ డీఏ పరిధిలోని ప్రాంతం)లో నివసించిన వారికి మాత్రమే అందనుంది.ఈ వైద్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించనున్నారు. ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవల్ని అందించాలన్న నిర్ణయం.. అక్కడి ప్రజల్ని ఆనందానికి గురి చేయటం ఖాయంగా చెబుతున్నారు. ఇక.. పేదలకు వైద్యసాయం చేసే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కు సీఆర్ డీఏ చెల్లింపులు చేయనుంది. బాబు సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం రాజధాని ప్రాంత పరిధిలో నివసించే పేదలకు తీపి కబురు అవుతుందనటంలో సందేహం లేదు. తప్ప మిగిలిన వారంతా చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి. తమ జీవితంలో ఎప్పుడూ ఊహించలేనంత మార్పు రావటం.. ఏపీ భవిష్యత్తు మొత్తం తమ లోగిళ్లలోనే తయారయ్యే అద్భుత అవకాశం దక్కటం వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆనందపడేవాళ్లు ఆనందపడుతున్నా.. రాజధాని రావటంతో పచ్చటి పొలాలు మాయమై మొత్తం కలుషితంగా మారిపోతుందని భయంతో బాధపడే వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని ప్రాంత ప్రజలకు ఊహించలేని ఒక కానుకను ప్రకటించి విస్మయానికి గురి చేసిందని చెప్పాలి.ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.2.5లక్షల వరకు అవసరమైన వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో దాదాపు 1100 వరకూ శస్త్రచికిత్సల్ని అందించనున్నారు. అయితే.. ఈ ఆఫర్ 2014 డిసెంబరు 8వ తేదీ నాటికి అమరావతి (సీఆర్ డీఏ పరిధిలోని ప్రాంతం)లో నివసించిన వారికి మాత్రమే అందనుంది.ఈ వైద్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించనున్నారు. ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవల్ని అందించాలన్న నిర్ణయం.. అక్కడి ప్రజల్ని ఆనందానికి గురి చేయటం ఖాయంగా చెబుతున్నారు. ఇక.. పేదలకు వైద్యసాయం చేసే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కు సీఆర్ డీఏ చెల్లింపులు చేయనుంది.
EmoticonEmoticon