ఆపరేషన్ ఆకర్ష్ తో రోజురోజుకీ బలోపేతం అవుతున్న చంద్రబాబు ధాటికి జగన్ విలవిలలాడిపోతున్నారు. తన చేతిలో ఉన్న ఎమ్మెల్యేల్ని కాపాడుకోవటంలో జగన్ నేర్పుగా వ్యవహరించటం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీటిన్నింటికి తోడు జగన్ వ్యవహారశైలి పట్ల పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మరికొన్నేళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి ఏపీలో తిరుగులేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇది జగన్ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ మాత్రం అవకాశం చిక్కినా సైకిల్ ఎక్కేందుకు వదిలిపెట్టటం లేదు.
ఇందులో భాగంగానే తాజాగా మైసూరారెడ్డి పార్టీ వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను జగన్ కు పంపంటంతో పాటు.. తాను పార్టీ ఎందుకు వీడిపోవాలన్న విషయాన్ని ఆ లేఖలో మైసూరా స్పష్టం చేస్తారని చెబుతున్నారు.

EmoticonEmoticon