వైకాపా, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రాష్ట్రం బాగుపడితే భవిష్యత్తు ఉండదని వారికి భయం. గ్రామాలకు గ్రామాలు, మండలాలకు మండలాలు, జిల్లా జిల్లాలు కలవాలని మేం ప్రయత్నిస్తుంటే... వాటిని విడగొట్టాలని వైకాపా ప్రయత్నిస్తోంది. ఏ మాత్రం వాస్తవం లేకపోయినా రాజధానిలో లక్ష కోట్ల అవినీతి జరిగిదంటూ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకుని జైలుకెళ్లొచ్చి... న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన నాయకులను ప్రజలు ఛీకొట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డం పడుతున్న ఇలాంటి వారిని దూరంగా ఉంచాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం విజయవాడ, గుంటూరు జిల్లా తాడేపల్లిలలో జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో అరకు, శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అమరావతికి భూసేకరణ చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ వైఎస్‌ఆర్ సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇంతవరకూ ఒక్క ఎకరా అమ్మనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
తెదేపాలో చేరిన అరకు, శ్రీశైలం ఎమ్మెల్యేలు కిడారి, బుడ్డా

EmoticonEmoticon