గత కొన్ని రోజులుగా ఎండ దెబ్బకు హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఒకవైపు ఎండతో పాటు.. మరోవైపు వడగాలులు తోడవ్వడంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా గాల్లో కలిసిపోతున్నాయి. ఇటువంటి సమయంలో హైదరాబాదీలకు చల్లని వార్తను అందించాడు వరుణుడు. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం సమయంలో అక్కడక్కడ చినుకులు కురిశాయి. ఇక చీకటి పడ్డాక భారీ వర్షం కురవడం మొదలుపెట్టింది. అంతే.. ఎంతో కాలంగా వేడితో అల్లాడిపోయిన జనాలు.. చల్లని వర్షంలో హాయిగా సేదతీరారు. ఇక, నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి.
EmoticonEmoticon