విశాల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు' ఫస్ట్‌లుక్

09:42:00

కథకళి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు తమిళ కథానాయకుడు విశాల్. ఇంతలోనే అతడి కొత్త సినిమా రెడీ అయిపోతోంది. తమిళంలో 'మరుదు" పేరుతో తెరకెక్కుతున్న సినిమాను 'రాయుడు"గా తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ రోజే రాయుడు ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. 'రాయుడు పేరుతో ఇప్పటికే తెలుగులో ఓ సినిమా వచ్చింది. దశాబ్దంన్నర కిందట మోహన్ బాబును 'రాయుడు"గా చూశారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు అదే టైటిల్తో విశాల్ వస్తున్నాడు.

ఇక విశాల్ మూవీ పోస్టర్లు చూస్తే ఇది మాస్ కాదు ఊర మాస్ సినిమా లాగుంది. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ మసాలా సినిమాలాగా కనిపిస్తోంది. విశాల్ ఇంతకుముందు కూడా మాస్ సినిమాలు చేశాడు కానీ.. మరీ ఇంత ఊర మాస్ అవతారంలో కనిపించింది లేదు. ముత్తయ్య అనే యువ దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి శ్రీదివ్య కథానాయికగా నటిస్తోంది. గత కొన్నేళ్లుగా తన సినిమాల్ని తనే నిర్మిస్తున్న విశాల్ ఈ చిత్రాన్ని కూడా మరో సంస్థతో కలిసి తనే నిర్మిస్తున్నాడు.డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రఘువరన్ బీటెక్ దర్శకుడు వేల్ రాజ్ ఛాయాగ్రహణం అందిస్తుండటం విశేషం. మే నెలలో ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

Share this

Related Posts

Previous
Next Post »