‘అమల’ కు సరైన స్థానాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!

10:06:00


తెలంగాణా ప్రభుత్వం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సతీమణి అమలకు ఓ సముచిత గౌరవాన్ని ఇస్తూ ఓ ప్రముఖ స్థానాన్ని కట్టబెట్టింది. ఆ విశేషాలలోకి వెళితే, ముందుగా తెలుగు రాష్ట్రాల్లో అమల బ్లూ క్రాస్ తరపున జంతు సంరక్షణ కోసం చాలా కాలంగా ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమల సేవలను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డులో సముచిత స్థానాన్ని ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను చైర్మన్ గా నియమించిన ఈ బోర్డులో అమలను సభ్యురాలిగా తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే, సీఎం కేసీఆర్ సూచన మేరకు మొత్తం 21 మందితో కూడిన జంతు సంరక్షణ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందట. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణా ప్రభుత్వం నేడు జారీ చేసినట్లు సమాచారం.

Share this

Related Posts

Previous
Next Post »