ఠారెత్తించే ఎండ తీవ్రత మరో మూడు రోజుల పాటు సాగుతుందని చెబుతున్న వాతావరణ అధికారుల మాట ప్రజల గుండెల్లో పెద్ద రాయి పడేలా చేస్తోంది. ఎందుకంటే.. ఏప్రిల్ లోనే ఈ రేంజ్ లో ఎండలు మండితే.. మరి మంటపుట్టించే ‘‘మే’’ను తలుచుకుంటేనే వణుకు పుట్టే పరిస్థితి. తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా.. ఏప్రిల్ రెండో వారంలో 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతనమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. కనిష్ఠంగా 42 అయితే.. గరిష్ఠంగా 45 డిగ్రీలుగా చెబుతున్నారు.
నిజానికి రేంజ్ లో ఎండలు రాయలసీమ.. కోస్తాలలో మామూలే. కానీ.. తెలంగాణలో ఈ స్థాయిలో ఎండలు.. అది కూడా ఏప్రిల్ మొదట్లోనే కావటం దడ పుట్టిస్తోంది. పాడు ఎండల కారణంగా.. శనివారం ఒక్క రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య అక్షరాల 79 మంది. అది కూడా అధికారిక లెక్కల ప్రకారం. అనధికారిక లెక్కల ప్రకారం ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.బీకేర్ ఫుల్..

EmoticonEmoticon