తుని ఘటనతో అతడి పాపులారిటీ కాపుల్లో ఓ రేంజులో పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. ఈయన మొండోడు. ఏదైనా సాధిస్తాడు.. పంతం నెగ్గించుకుంటాడు.. అని చంద్రబాబుకే అర్థమైంది. భవిష్యత్‌లో అతడి వల్ల టీడీపీకి థ్రెట్ ఉందని బాబుకు ముందే అర్థమై కాపు కార్పొరేషన్‌కి తక్షణం 500 కోట్లు కేటాయించాడు. అయితే ఆ డబ్బు ముట్టిన తర్వాత ఉద్యమం విరమించుకున్న ముద్రగడ మళ్లీ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు.
జూన్ తర్వాత ఉద్యమం మలిదశ ప్రారంభమవుతుందని ముద్రగడ అధికారికంగా ప్రకటించారు. దీంతో బాబుకు ముందుంది ముసళ్ల పండుగ అన్న హెచ్చరిక జారీ అయినట్టే. అయితే సేమ్ టైమ్ అతడు జగన్‌ని, పవన్‌ని వ్యూహాత్మకంగా టార్గెట్ చేశాడు. జగన్ నాకు సలహాలిచ్చేటంతటివాడా? అంటూ ప్రశ్నించి.. తన ఉద్యమాల వెనక జగన్ లేనేలేడని చాటాడు. ఇక పవన్ వచ్చేదేంటి? మాకు మద్దతిచ్చేదేంటి? మేం చేతకాని వాళ్లమా? అయినా పవన్‌ని ఉద్యమానికి సపోర్టు చేయమని పిలవలేదే.. అంటూ ఘాటుగానే మాట్లాడారాయన. ఇదంతా ఈ సీనియర్ నేత వ్యూహాత్మక ఎత్తుగడ అని చెప్పుకుంటున్నారు.

EmoticonEmoticon