
తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రచార సారథుల పేర్లను వెల్లడించింది . రాష్ట్రంలో పోటీ చేసే కాంగ్రెస్, డీఎంకే అభ్యర్థుల తరపున టాలీవుడ్ మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రచారం చేయనున్నారు. అలాగే, సినీ నటి ఖుష్బూతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అలాగే, కర్ణాటక మంత్రి శివకుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మాజీమంత్రులు గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్, ఆస్కార్ ఫెర్నాండెజ్, మల్లికార్జున ఖర్గే, తిరునావుక్కరసర్, శోభా ఓఝాతో పాటు మొత్తం 40 మంది ప్రముఖులు ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే చిరంజీవి వెంట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధనుష్కోడి ఆదిత్యన్, కేపీ కృష్ణమూర్తి, మణిశంకర్ అయ్యర్, జేఎం హారూన్, పి.విశ్వనాథన్, పీటర్ ఆల్ఫోన్స్ తదితరులు ఉంటారు.
EmoticonEmoticon