సర్దార్ గబ్బర్ సింగ్’ రికార్డునే కాదు.. శ్రీమంతుడు కలెక్షన్లను కూడా దాటలేకపోయిన బ్రహ్మోత్సవం !!

05:20:00

సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ అయినా సరే.. తొలి రోజు రికార్డుల మోత మోగించింది. కలెక్షన్లలో నాన్-బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టేసింది. ‘శ్రీమంతడు’ నెలకొల్పిన కలెక్షన్ల రికార్డును దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.17 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.29 కోట్ల దాకా షేర్ ఖాతాలో వేసుకుంది. ఐతే ఆ రికార్డును ‘బ్రహ్మోత్సవం’ ఈజీగా దాటేస్తుందని అంచనా వేశారు మహేష్ అభిమానులు. విడుదలకు నాలుగు రోజుల ముందు వరకు కొంచెం సందేహాలున్నా.. తెలంగాణ వరకు సింగిల్ స్క్రీన్లలో సైతం తొలి రోజు అదనంగా ఒక షో (ఐదోది) వేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ‘సర్దార్’ రికార్డు బద్దలవడం పక్కా అని తీర్మానించారు ట్రేడ్ పండితులు.
కానీ ‘బ్రహ్మోత్సవం’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రికార్డునే కాదు  శ్రీమంతుడు కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా తొలి రోజు రూ.12.5 కోట్ల షేర్ రూ.18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు రెండు రాష్ట్రాల్లో భారీగా బెనిఫిట్ షోలు వేయడం కలిసొచ్చింది. మహేష్ సినిమాకు బెనిఫిట్ షోలు పెద్దగా లేకపోయినా.. ఇక్కడ తెలంగాణలో పడే ఐదో షో ఆ గ్యాప్ కవర్ చేస్తుందని అనుకున్నారు. ‘సర్దార్’తో పోలిస్తే ఫుల్ పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో నాన్-బాహుబలి డే-1 రికార్డు పక్కా అనుకున్నారు. కానీ ‘బ్రహ్మోత్సం’.. మహేష్ లాస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. డే-1 కలెక్షన్లలో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఎంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు అన్ని షోలకూ ముందే టికెట్లు బుక్ అయిపోయి ఉంటాయి కదా. అయినా ‘బ్రహ్మోత్సవం’ నాలుగో స్థానానికి పరిమితం కావడం ఆశ్చర్యమే. 

Share this

Related Posts

Previous
Next Post »