రజినీ సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ అయితే తప్ప మిగతా సినిమా షెడ్యూళ్లు ఖరారవ్వవు. ‘కబాలి’ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆ సినిమా రిలీజ్ డేటేదో తేలితే.. తమ సినిమాల్ని దానికి తగ్గట్లుగా షెడ్యూల్ చేసుకుందామని చూస్తున్నారు చాలామంది నిర్మాతలు. ఐతే రెండు నెలలుగా రిలీజ్ డేట్ విషయంలో నాన్చుతూ వస్తున్న ‘కబాలి’ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్.థాను ఎట్టకేలకు ఓ కంక్లూజన్‌కు వచ్చాడు. జులై 1న ‘కబాలి’ రిలీజవుతుందని ఆయన ప్రకటించాడు. దీంతో జూన్ నెలలో ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ యధావిధిగా విడుదల చేసేయొచ్చు. ఆ మధ్య పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా రజినీ మాట్లాడుతూ మే 27 లేదా జూన్ తొలి వారంలో ‘కబాలి’ విడుదలవుతుందని ప్రకటించాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న ప్రకారం జరగకపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఏ హడావుడి లేకుండా జులై 1న సినిమాను విడుదల చేసుకోవాలని ఫిక్సయ్యాడు థాను. యువ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీ మాఫియా డాన్ పాత్ర పోషించాడు.
కబాలి రిలీజ్ డేట్ కన్ఫమ్ !!

EmoticonEmoticon