టీడీపీని లైట్ తీసుకోవద్దు

23:58:00

మేము సైలెంట్ గా ఉంటామనుకోవద్దు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దానికోసం రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి. ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పితే ఊరుకోము. రెండేళ్లుగా ఇదిగో..అదిగో..అంటూ మీ చుట్టూ తిప్పించుకొని చివరకి ఇవ్వలేము అని చల్లగా చెప్పడం సరికాదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చాలా వేధిస్తోంది. నా ఉద్దేశ్యంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఇద్దరూ దీనికి బాధ్యులు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే ముందు వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలి. ఇంకా మా సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను," అని టీడీపీ నేత, ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పడంతో బీజేపీకి మిత్రపక్షంగా సాగుతున్న టీడీపీ కూడా ప్రతిపక్షాలతో గొంతు కలిపి కేంద్రాన్ని విమర్శించడం మొదలుపెట్టింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వబోదనే విషయం టీడీపీకి ఈరోజు కొత్తగా తెలిసిన విషయమేమీ కాదు. "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయం ఎప్పుడో తెలుసు కానీ దానిని బయటకి చెప్పడం లేదు. అందుకే ఆయన హోదాకి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అడుగుతున్నారు" అని ఏడాది క్రితం అదే పార్టీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరూ కూడా ఈ సంగతి ఇప్పుడే తమకు తెలిసినట్లు నటిస్తూ ప్రజలని, ప్రతిపక్షలని మభ్యపెట్టేందుకు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మంత్రుల రాజీనామాలు కోరిన ముద్దు టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామాల గురించి మాట్లాడలేదు. ఒకవేళ ఈ వేడి ఇలాగే కొనసాగితే ప్రజలను సంతృప్తి పరిచేందుకయినా వారిద్దరి చేత రాజీనామాలు చేయించవచ్చు. 

Share this

Related Posts

Previous
Next Post »