మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లి ఆయన్ని శిఖరంపై నిలబెట్టిన ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తన హీరో చిరంజీవి మీద ప్రశంసల జల్లు కురిపించారు.‘గ్యాంగ్ లీడర్’లో తన పాత్ర చిరు పాత్రకు దీటుగా ఉంటుందని.. ఆ పాత్ర అంత బాగా రావడానికి చిరంజీవి కూడా కారణమని విజయశాంతి చెప్పింది. ‘గ్యాంగ్ లీడర్’లోని భద్రా చలం కొండ పాటను ఊటీలో తీస్తుండగా.. తనకు ‘కర్తవ్యం’ సినిమాకు గాను జాతీయ అవార్డు వచ్చిందని తెలిసిందని.. ఈ విషయం తెలిసి చాలా సంతోషించిన చిరు.. ఆ సాయంత్రం హోటల్లో అందరికీ పెద్ద పార్టీ ఇచ్చారని విజయశాంతి వెల్లడించారు. చిరంజీవితో తాను చాలా సినిమాలు చేసినప్పటికీ.. ‘గ్యాంగ్ లీడర్’ చాలా ప్రత్యేకమని ఆమె అంది. చిరంజీవితో కలిసి ‘గ్యాంగ్ లీడర్’లో అదిరిపోయే స్టెప్పులేశానని.. దేశంలోనే చిరంజీవిని మించిన డ్యాన్సర్ లేడన్నది తన అభిప్రాయమని విజయశాంతి చెప్పింది. ఇప్పటి హీరోలు డ్యాన్సులు బాగానే చేస్తున్నప్పటికీ.. ఎవ్వరూ కూడా చిరంజీవిని మ్యాచ్ చేయలేరని.. ఆయన స్టైల్ ఇంకెవ్వరికీ రాదని విజయశాంతి అభిప్రాయపడింది.
EmoticonEmoticon