బన్నీ కోరిక ఇంతేనా

10:04:00

మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఇంతమంది హీరోలు వర్ధిల్లుతున్నారంటే అందుకు చిరంజీవే ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ అయినా.. అల్లు అర్జున్ అయినా.. ఇప్పుడు తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నా.. తమకు ఫ్లాట్ ఫామ్ వేసింది చిరంజీవే అని ఒప్పుకుంటారు. ఐతే ఈ మధ్య చిరంజీవి నీడ నుంచి బన్నీ బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని.. తన చుట్టూ ఓ గీత గీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని.. గట్టి ప్రచారం జరిగింది. ఈ విషయంలో అల్లు అరవింద్ బ్యాకప్ ఉన్నట్లు కూడా పుకార్లు వినిపించాయి. ఐతే ఆ మాటలన్నీ అల్లు అరవింద్ వరకు చేరినట్లున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా చిరంజీవిని నెత్తికెత్తుకునే పనిలో పడుతుతున్నాడు అరవింద్. బన్నీ సైతం అవసరం లేకున్నా సరే.. పదే పదే మెగాస్టార్ ప్రస్తావన తెస్తున్నాడు. ఆయన లేకపోతే మేం లేం అనే సంకేతాల్ని తండ్రీ కొడుకులిద్దరూ ఇస్తున్నారు.

‘సరైనోడు’ ప్రి రిలీజ్ ఫంక్షన్లో.. ఆ తర్వాత థ్యాంక్స్ మీట్లో.. అల్లు అరవింద్, బన్నీ చిరంజీవిని ఏ రేంజిలో పొగిడారో తెలిసిందే. తాజాగా విజయవాడలో జరిగిన విజయోత్సవ వేడుకలోనూ తండ్రీ కొడుకులు చిరు నామస్మరణ చేశారు. తన సినిమా 100 కోట్ల గ్రాస్ సాధించడం చాలా సంతోషంగా ఉందని.. అలాగే చిరంజీవి 150వ సినిమా 150 కోట్లు గ్రాస్ వసూలు చేయాలని.. దర్శకుడు వి.వి.వినాయక్‌కు ఇదే విషయం చెప్పానని.. చిన్నప్పట్నుంచి చిరంజీవి మాస్ సినిమాలు చూస్తూ పెరిగానని.. ఇప్పుడు తాను కూడా మాస్ హీరో అనిపించుకోవడం సంతోషంగా ఉందని బన్నీ అన్నాడు. ఇక అరవింద్ మాట్లాడుతూ.. ‘సరైనోడు’ సక్సెస్ మెగా అభిమానులకే చెందుతుందని.. చిరంజీవి 150వ సినిమా ఘన విజయానికి నాంది అన్నారు. ఇద్దరూ అవసరం లేకున్నప్పటికీ చిరు నామస్మరణ చేసి.. ఇదేదో చిరును పొగడ్డమే మిషన్‌గా పెట్టుకున్న ఫీలింగ్ కలిగించారు.

Share this

Related Posts

Previous
Next Post »