ఏపీలో పోల‌వ‌రం కోసం సీఎం కేసీఆర్ సాయం !

23:08:00

నీటి పంప‌కాల‌పై ఎవ‌రు ఎంత వాటా తీసుకోవాలో గ‌తంలోనే నిర్ణ‌య‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. ఏపీ నేత‌లు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌కు ద‌క్కాల్సిన న‌దీజ‌లాలు ద‌క్క‌లేదు. గోదావ‌రి, కృష్ణా నుంచి న్యాయంగా ద‌క్కాల్సిన వాటా రాలేదు. అందుకే `నీరు-నిధులు- నియామ‌కం` ప్రాతిపాదిక‌న దీనిపై గ‌తంలో ఎంతో పోరాడాం. తెలంగాణ‌లో ప్రారంభించిన ప్రాజెక్టులు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ముందుకు కొన‌సాగ‌లేదు. ప‌ర్యావ‌ర‌ణం వ‌ల్ల, అంత‌రాష్ర్ట వివాదాల వ‌ల్ల స‌మ‌స్య‌లొచ్చాయి. అయితే ఇప్ప‌టికైనా నీటిని స‌వ్యంగా వినియోగించుకోవాల‌ని పాల‌మూరు, దిండి ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి ప్రారంభ‌మైనా.. ఏపీలో పోల‌వ‌రం కోసం సీఎం కేసీఆర్ సాయం చేస్తామ‌న్నారు. గోదావ‌రిలో నీరు స‌మృద్ధిగా ఉంది. దానిని స‌రిగా వాడుకోలేక‌పోతున్నాం. మేం ప‌రిధి మేర మాత్ర‌మే వినియోగించుకుంటాం. మీరు కూడా వాడుకోండి. ఎగువ‌న ఉన్న మేం కూడా పోల‌వ‌రానికి సాయం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపార‌ని క‌డియం వివ‌ర‌ణ ఇచ్చారు. ప్రాజెక్టులు అడ్డుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌ర‌గ‌దు. ఎగువ‌న ఉన్న రాష్ర్టాల్లో ఎంత నీరు వాడుకోవాలి? దిగువ‌కు ఎంత వెళ్లాలి అన్న‌దానిపై ఇప్ప‌టికే క్లారిటీ ఉంది. 1400 టీఎంసీల నీరు గోదావ‌రిలో ఉంది. అందులో 950 టీఎంసీలు తెలంగాణ‌కు చెందుతుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అది తేట‌తెల్ల‌మైంది. కృష్ణాలో 300 టీఎంసీల నీరుంది. ఇందులోనూ తెలంగాణ‌కు చెందే వాటాను మాత్ర‌మే ఉప‌యోగించుకుంటాం. కాబ‌ట్టి ఏపీ అన‌వ‌స‌ర రాద్ధాంతం చేయ‌కూడదు… అని వాస్త‌వ ప‌రిస్థితిని తెలిపారు.

Share this

Related Posts

Previous
Next Post »