కంచెని మెచ్చుకున్న కేటీఆర్‌

22:05:00

‘కంచె’.. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ప్రత్యేకత సంపాదించుకున్న ఈ సినిమా, గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకొని సత్తా చాటింది. ఒక భావోద్వేగపూరిత కథకు, కొత్త నేపథ్యానికి జోడించి దర్శకుడు క్రిష్ చేసిన ప్రయోగానికి అప్పట్లోనే సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు దక్కగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో కేటీఆర్ ఇప్పటివరకూ ‘కంచె’ సినిమా చూడలేకపోయారు. ఇక ఈ ఇదయం వీలు కుదుర్చుకుని సినిమా చూసిన ఆయన, దర్శకుడు క్రిష్, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌లపై ప్రశంసలు కురిపించారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ డైరెక్షన్‌ను ఆయన బాగా మెచ్చుకున్నారు. ప్రస్తుతం క్రిష్, కంచె సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్నారు.

Share this

Related Posts

Previous
Next Post »