ఆదిత్య 369కు పాతికేళ్లు

22:00:00

ఈ రోజు రిలీజై హిట్టయిన సినిమాను రెండేళ్ల తర్వాత చూస్తే ఔట్ డేటెడ్ అనిపిస్తుంటాయి. తెలుగులో అయినా.. ఇంకో భాషలో అయినా ఇలాంటి సినిమాలే ఎక్కువ వస్తుంటాయి. కానీ ఎన్నేళ్ల తర్వాత చూసినా రిఫ్రెషింగ్‌గా, ఆసక్తికరంగా, కొత్తగా అనిపించే సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. ‘ఆదిత్య 369’ అలాంటి సినిమానే. 1991 జులై 18న రిలీజైందీ సినిమా. సోమవారంతో ఈ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తవుతుండటం విశేషం. పాతికేళ్ల నాటి సినిమా అయినా సరే.. ఇప్పటికీ కొత్తగా అనిపించడం ఈ సినిమా విశేషం. ఈ తరం ప్రేక్షకులు చూసినా ఈజీగా కనెక్టయిపోతారు.
ఈ సినిమాలో హీరో గతంలోకే కాక భవిష్యత్తులోకి కూడా ప్రయాణించినట్లు చూపిస్తారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నిజంగానే టైం మెషీన్లో ఫ్యూచర్లోకి ప్రయాణించి ఇప్పటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఈ సినిమాను తీశాడేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఆ కాలానికి అంత అడ్వాన్సడ్‌గా అనిపించింది ‘ఆదిత్య 369’. తెలుగు సినిమా చరిత్రలోనే కాక.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా ఇది.

సింగీతం అద్భుత సృష్టికి.. బాలయ్య అసమాన నటన కూడా తోడై ‘ఆదిత్య 369’ అప్పట్లో చరిత్రాత్మక విజయం సాధించింది. చరిత్రలో నిలిచిపోయింది. ఆదిత్య 369 విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంలోనే దీని సీక్వెల్ గురించి చర్చ జరుగతుండటం విశేషం. నిజానికి బాలయ్య వందో సినిమాగా ఈ సీక్వెలే చేయాలనుకున్నాడు. తర్వాత మనసు మార్చుకున్నాడు. ఐతే స్టోరీ బోర్డుతో సహా అంతా రెడీగా ఉన్న ఈ సినిమాను ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టడం ఖాయమని అంటున్నాడు బాలయ్య. 

Share this

Related Posts

Previous
Next Post »