రాష్ట్ర వ్యాప్తంగా 500 దుకాణాలను మూసివేత

22:45:00


దశలవారీగా మధ్య నిషేధం అమలు చేస్తామన్న హామీలో భాగంగా తొలుత 500 టాస్మాక్‌ దుకాణాలను మూసివేతకు ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో ‘టాస్మాక్‌ మద్యం దుకాణాల సమయాన్ని కుదిస్తాం, దుకాణాల సంఖ్యను విడతలవారీగా తగ్గిస్తామ’ని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొంది మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జయలలిత... తొలుత టాస్మాక్‌ దుకాణాల పని వేళలను తగ్గించారు. దీంతో ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తెరుచుకునే దుకాణాలు... మే 24వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభిస్తున్నాయి. ఈ స్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా 500 దుకాణాలను ఆదివారం నుంచి మూసివేయాలని శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జాబితాను జయలలిత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన ప్రకటనలో.. మూసి వేస్తున్న టాస్మాక్‌ దుకాణాలలో మిగిలి ఉన్న మద్యాన్ని గోదాముకు తరలించాలని తెలిపారు. ఆ దుకాణాలలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌, సహాయకులకు అదే జిల్లాలోని ఇతర ప్రభుత్వ దుకాణాలలో కాంట్రాక్టు పద్ధతిలోనే ఉపాధి కల్పిస్తామన్నారు. మే నుంచి సగటున రోజుకు రూ. మూడు లక్షలకు మించి మద్యం విక్రయాలు జరుగుతున్న దుకాణాలలో అదనంగా ఒక సూపర్‌వైజర్‌ను నియమిస్తామని తెలిపారు. రోజుకు రూ. ఒక లక్షకు మించి విక్రయించే చోట అదనంగా సేల్స్‌మెన్‌నుగానీ, సహాయకుణ్ని కానీ నియమిస్తామని చెప్పారు. 

Share this

Related Posts

Previous
Next Post »