తమిళనాట ఆంగ్ల చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ‘జంగిల్ బుక్’, ‘కాంజ్యురింగ్ 2’ సినిమాలు కూడా విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో 24న ‘ఇండిపెండెన్స్ డే’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో కలసి తమిళనాడు వ్యాప్తంగా 150 పైచిలుకు థియేటర్లలో విడుదలవున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళ అనువాదంలో మాత్రం 80 థియేటర్లలో విడుదలవుతోంది. రొనాల్డ్ ఎమిరిచ్ దర్శకత్వంలోని ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం హాలీవుడ్ సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. రెండు మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1996లో రొనాల్డ్ ఎమిరిచ్ దర్శకత్వంలో ‘ఇండిపెండెన్స్ డే’ సినిమా విడుదలైంది. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత దానికి అనుసంధానంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
EmoticonEmoticon