విజయ్ ఆంటోనీ హీరోగా శీను ఫేమ్ శశి తమిళంలో రూపొందించిన ‘పిచ్చైకారన్’ చిత్రం తెలుగు అనువాద హక్కుల్ని సీనియర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు కేవలం రూ.30 లక్షలకే సొంతం చేసుకోవడం విశేషం. డబ్బింగ్ పనుల కోసం ఇంకొన్ని లక్షలు ఖర్చయ్యాయి. బిచ్చగాడు పేరుతో గత నెల 13న ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలైందీ సినిమా.సరైన ప్రమోషన్ కూడా లేకపోవడంతో మొదట్లో ‘బిచ్చగాడు’ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐతే కొన్ని రోజులు గడిచాక సినిమా చాలా బావుందన్న మౌత్ టాక్ స్ప్రెడ్ అయి.. నెమ్మదిగా జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. బిచ్చగాడు వచ్చిన తర్వాతి వారం విడుదలైన ‘బ్రహ్మోత్సవం’కు డిజాస్టర్ టాక్ రావడం కలిసొచ్చి ఈ సినిమాకు ఆదరణ మరింత పెరిగింది. మహేష్ సినిమాను తీసేసి మరీ కొన్ని చోట్ల ‘బిచ్చగాడు’కు థియేటర్లు ఇవ్వడం విశేషం. రెండో వారాంతం నుంచి సాగుతుఉన్న ‘బిచ్చగాడు’ హవా ఇప్పటికీ కొనసాగుతోంది. నెల తర్వాత కూడా సినిమా బాగా ఆడుతోంది. ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.13 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం.
30 లక్షల పెట్టుబడి.. 13 కోట్ల వసూళ్లు..

EmoticonEmoticon