రేవంత్ రెడ్డికి ప్రాణహాని తలపెట్టాలని అనుకుంటున్న కేసీఆర్ ..?

23:35:00 Add Comment

తెలంగాణలో తిరుగులేని నేత, ముఖ్యమంత్రి కేసీఅర్ కు వ్యతిరేకంగా ఎంతటి మాటైనా మాట్లాడగల నేత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ మధ్య కొంతకాలంగా సైలెంట్ అయిన రేవంత్ కొంత కాలం క్రితం ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తో బాగానే సున్నం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే రేవంత్ కొందరు టీఆర్ఎస్ నేతలు, గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, తెలంగాణా యంత్రాంగం మీద, పోలీసుల మీద తనకు నమ్మకం లేదని అన్నారు.
అలాగే తనకు కేంద్ర బలగాల ద్వారా భద్రత కల్పించాలని హై కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అందరూ డేర్ అండ్ డాషింగ్ గా పేరున్న రేవంత్ ఏమిటి అలా చేయడమేమిటి అని విస్తుపోయారు. ఆయన పిటిషన్ ను విచారణకు తీసుకున్న కోర్టు రేవంత్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆయనకు అదనపు భద్రత కల్పించాలని మహబూబ్ నగర్ పోలీసులను ఆదేశించింది.

20 కోట్లు, ఎక‌రం భూమి ఆఫ‌ర్ ?

23:28:00 Add Comment

విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే బి.ముత్యాల‌నాయుడు తేదేపా నేత‌ల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా చిన‌బాబు లోకేష్ నాయుడు, ఎంపీ సీఎం ర‌మేష్ త‌న‌కి ఓ భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు చెప్పారాయ‌న‌. తేదేపాలో చేరితే అమ‌రావ‌తిలో ఎక‌రం భూమి, 20 కోట్లు క్యాష్ ముట్ట‌జెపుతామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్టు ఆరోపించారాయ‌న‌. కేవ‌లం ఇవే కావు.. భ‌విష్య‌త్‌లో కొన్ని కాంట్రాక్టులు అప్ప‌జెపుతామ‌ని ఆశ చూపార‌ని తెలిపారు. ఈ ఫిరాయింపు ప్ర‌య‌త్నం వెన‌క సీఎం చంద్ర‌బాబు ప్రోత్సాహం ఉంద‌ని అన్నారు.
ఢిల్లీ వెళ్లే ముందే నాకు ఫోన్ వ‌చ్చింది. పూర్తి విష‌యాలు మాట్లాడుకోవ‌డానికి లోకేష్‌తో భేటీ ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. సీఎం కుర్చీ ఇస్తారా? అని అడిగితే వెంట‌నే ఫోన్ పెట్టేశార‌ని ఆయ‌న అన్నారు. అయినా నేను అవినీతి ఎమ్మెల్యేగా ఉండ‌ద‌లుచుకోలేద‌ని ముత్యాల‌నాయుడు అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య రంగారావు 150 ఎక‌రాల కోసం తేదేపాలో చేరార‌ని విమ‌ర్శించారు. బాబు దిగ‌జారుడు త‌నాన్ని అస‌హ్యించుకుంటూ ఆ పార్టీకే చెందిన ఒక స‌ర్పంచ్ ప్ర‌లోభాల‌కు గుర‌వ్వ‌ద్ద‌ని త‌న‌ని హెచ్చ‌రించార‌ని ముత్యాలు తెలిపారు.

తప్పు చేయొద్దని సూటిగాన హెచ్చరించి పవన్ ?

23:20:00 Add Comment

స్నేహధర్మానికి ఒక హద్దు ఉంటుంది. అది హద్దు మీర కూడదు. తన ప్రయోజనాలన్ని పణంగా పెట్టి మిత్రధర్మాన్ని పాటించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇదే తీరులో ఉంది. మోడీతో మిత్రబంధాన్ని అంత త్వరగా వదులుకోవాలని లేని తత్వం ఒకపక్క.. మరోవైపు మోడీ అనుసరిస్తున్న వైఖరికి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక కిందామీదా పడుతున్నారు. దేశంలో అత్యంత బలమైన నేతగా ఉన్న మోడీతో ఢీ కొట్టే శక్తిసామర్థ్యాలు ప్రస్తుతానికి తనకు లేవన్న విషయం చంద్రబాబుకు తెలియని విషయం కాదు. అలా అని రాజీ పడిపోతే.. ఏపీలో విలన్ గా మారటం ఖాయమన్న సంగతి ఆయనకు తెలుసు. ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది.మోడీతో గొడవ పెట్టుకుంటే వచ్చే మూడేళ్లు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలీదు. అలా అని.. ఊరుకుండిపోదామా అంటే.. ఉండలేని విధంగా కేంద్ర మంత్రులు ఏపీ ప్రత్యేకహోదా మీద చేస్తున్న వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కన్ఫ్యూజన్ కు గురి అవుతున్న చంద్రబాబుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలే సమాధానంగా చెప్పొచ్చు. బాబుకు మోడీ ఎలాంటి స్నేహితుడో.. పవన్ కు ఇంచుమించు అలాంటి దోస్తానానే ఉంది. బాబు.. పవన్ లతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయటం.. పవన్ మాటకు జనాల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్న విషయం మోడీ ప్రత్యక్షంగా చూసిన విషయాన్ని మర్చిపోకూడదు. సాక్ష్యాత్తు ప్రధానమంత్రి తనకు మంచి మిత్రుడే అయినా.. ఏపీ ప్రజల ప్రయోజనాలు దెబ్బ తినే వేళ.. తాను ఏ మాత్రం ఉపేక్షించనన్న విషయాన్ని పవన్ తన ట్వీట్స్ తో తేల్చేశారు. శుక్రవారం సాయంత్రం వేళ కేంద్ర సహాయమంత్రి చౌదరి ఏపీ ప్రత్యేక హోదా మీద చేసిన వ్యాఖ్యలపై 24 గంటలు గడవక ముందే పవన్ స్పందించటం.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా నిర్ణయం తీసుకుంటే ఉద్యమం తప్పదన్న విషయాన్ని తేల్చి చెప్పటమే కాదు.. తప్పు చేయొద్దని సూటిగా హెచ్చరించారు కూడా. ఇందుకు విభజన సందర్భంలో కాంగ్రెస్ చేసిన తప్పులకు ఆ పార్టీ ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేయటం గమనార్హం. తన తాజా ట్వీట్స్ తో పవన్ తేల్చి చెప్పిన విషయం ఒక్కటే. తనకు మోడీ పరివారం మంచి మిత్రులే అయినా.. ఏపీ ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తినే పరిస్థితే ఉంటే.. ఊరుకోనని తేల్చి చెప్పేశారు. ఇంత సూటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ.. విపక్ష నేత వైఎస్ జగన్ కానీ వ్యాఖ్యానించకపోవటం గమనార్హం. స్నేహతుడి విషయంలో పవన్ స్పందన మాదిరే చంద్రబాబు రియాక్ట్ అయితే తప్ప ఏపీ ప్రయోజనాలు నెరవేరవన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. లేదంటే.. బాబు సైతం తగిన మూల్యం చెల్లించాల్సి రావొచ్చు

Kabali Tamil Movie | Official Teaser | Rajinikanth | Radhika Apte | Pa Ranjith

22:51:00 Add Comment

మే 8 న సందీప్‌ కిష‌న్ ‘ఒక్క అమ్మాయి తప్ప’ ఆడియో విడుదల

05:33:00 Add Comment

'ప్ర‌స్థానం' వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరో గా నటించిన  చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మంచి కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. 
 ఈ చిత్రం ఆడియో ను మే 8 న శిల్ప కళా వేదిక లో చాలా గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది.  మిక్కి జె.మేయర్‌ సంగీతాన్ని అందించగా, చిత్రం లో ని పాటలను శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ రచించారు. 
మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. అయన గతం లో  'సినిమా చూపిస్త‌మావ' చిత్రానికి నిర్మాత గా ఉన్నారు. " ఈ చిత్రం ఆడియో ను మే 8న విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మే నెలలో నే మా ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం ", అని ఆయన అన్నారు . 
రాజ‌సింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయన గతం లో ఎన్నో చిత్రాలకు రచయిత గా పని చేసారు. "ఇది ఒక డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. సందీప్‌ కిష‌న్‌ చాలా కొత్త గా , స్టైలిష్ గా కనిపిస్తారు " అని ఆయన అన్నారు. 
నటీ నటులు - సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి,రేవతి తదితరులు. 
సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు,
 ఆర్ట్‌: చిన్నా, 
మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, 
ఎడిటింగ్‌: గౌతంరాజు, 
పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ , 
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, 
సహ నిర్మాతలు  : మాధవి వాసిపల్లి, బోగాది అచ్యుత్ రెడ్డి ,  
నిర్మాత: బోగాది అంజిరెడ్డి, 
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ

‘అమల’ కు సరైన స్థానాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!

10:06:00 Add Comment


తెలంగాణా ప్రభుత్వం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సతీమణి అమలకు ఓ సముచిత గౌరవాన్ని ఇస్తూ ఓ ప్రముఖ స్థానాన్ని కట్టబెట్టింది. ఆ విశేషాలలోకి వెళితే, ముందుగా తెలుగు రాష్ట్రాల్లో అమల బ్లూ క్రాస్ తరపున జంతు సంరక్షణ కోసం చాలా కాలంగా ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమల సేవలను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డులో సముచిత స్థానాన్ని ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను చైర్మన్ గా నియమించిన ఈ బోర్డులో అమలను సభ్యురాలిగా తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే, సీఎం కేసీఆర్ సూచన మేరకు మొత్తం 21 మందితో కూడిన జంతు సంరక్షణ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందట. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణా ప్రభుత్వం నేడు జారీ చేసినట్లు సమాచారం.

సీఈసీకి వైకాపా అధ్యక్షుడు జగన్‌ విజ్ఞప్తి

09:58:00 Add Comment



పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజాస్వామ్యం అమ్ముడు కాకుండా చూడాలంటూ ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ) నసీం జైదీకి ప్రతిపక్ష నేత జగన్‌ విజ్ఞప్తి చేశారు. గురువారమిక్కడ పార్టీ ఎంపీలతో కలిసి ఆయన జైదీతో భేటీ అయ్యారు. అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు అనేది సభాపతి పరిధి నుంచి తొలగించి ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలు ఇచ్చిన 10 ప్రధాన హామీలు నెరవేర్చకపోతే తర్వాత ఎన్నికల నుంచి ఆ పార్టీని బహిష్కరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంవల్లే ఈ డిమాండు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోరామని తెలిపారు. రాష్ట్రంలో అధికార తెదేపా మిత్రపక్షం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదేమోనని వ్యాఖ్యానించారు. ప్రధానికి చెప్పాలనుకున్నది పోస్టు ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జగన్‌ భేటీ అయ్యారు.

తెదేపాలో చేరిన అరకు, శ్రీశైలం ఎమ్మెల్యేలు కిడారి, బుడ్డా

09:56:00 Add Comment



వైకాపా, కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రాష్ట్రం బాగుపడితే భవిష్యత్తు ఉండదని వారికి భయం. గ్రామాలకు గ్రామాలు, మండలాలకు మండలాలు, జిల్లా జిల్లాలు కలవాలని మేం ప్రయత్నిస్తుంటే... వాటిని విడగొట్టాలని వైకాపా ప్రయత్నిస్తోంది. ఏ మాత్రం వాస్తవం లేకపోయినా రాజధానిలో లక్ష కోట్ల అవినీతి జరిగిదంటూ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకుని జైలుకెళ్లొచ్చి... న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన నాయకులను ప్రజలు ఛీకొట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డం పడుతున్న ఇలాంటి వారిని దూరంగా ఉంచాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం విజయవాడ, గుంటూరు జిల్లా తాడేపల్లిలలో జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో అరకు, శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అమరావతికి భూసేకరణ చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇంతవరకూ ఒక్క ఎకరా అమ్మనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

జగన్ పార్టీ ‘పిల్ల కాంగ్రెస్ ?

06:36:00 Add Comment

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యవహారమే తీసుకుందాం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్  యువరాజు రాహుల్ తో ఏ మాత్రం సత్ సంబంధాలు లేకపోవటం.. తాను కోరుకున్నట్లుగా తనకు ఏపీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ తండ్రి పేరు.. మాతృపార్టీ పేరు మిస్ కాకుండా పెట్టుకోవటం కనిపిస్తుంది.

ఈ కారణంతోనే జగన్ పార్టీని ఉద్దేశించి.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ‘పిల్ల కాంగ్రెస్’ అంటూ పోలుస్తూ ఎటకారం చేసుకుంటుంటారు. దీనికి తగ్గట్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె. నారాయణ స్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇదే రీతిలో ఉండటం గమనార్హం. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నారాయణ స్వామి స్పందిస్తూ.. జగన్ ప్రస్తుత పరిస్థితిని దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చటం విశేషం.

గతంలో ఇందిరమ్మను వ్యతిరేకిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ వదిలేసి వెళ్లిపోయారని.. అప్పుడు ఇందిరమ్మ పోరాడి విజయం సాధించారని.. అదే తీరులో ఇప్పుడు కొందరు స్వార్థంతో జగన్ ను విడిచి పెట్టి వెళుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. నాడు ఇందిర మాదిరే నేడు జగన్ కూడా పోరాడుతున్నారని.. చివరకు ఆయనదే విజయమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాబును నమ్మి పార్టీ విడిచిపెట్టి వెళ్లిన వారు రెండింటికి చెడ్డ రేవడి కావటం ఖాయమని నారాయణ స్వామి శాపాలు పెట్టటం గమనార్హం. జగన్ ను పోల్చటానికి నారాయణస్వామికి ఇందిరమ్మ తప్పించి మరెవరూ దొరకలేదా? పాత గురుతులు అంత తేలిగ్గా పోవు కదా..?

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం ?

06:32:00 Add Comment


మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైకిలెక్కడం ఎందుకు ఆలస్యం అయింది? ఆయన కీలక అనుచరులైన పాడేరు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు పసుపు కండువా కప్పుకొన్నప్పటికీ కొణతాల ఆగిపోయారంటే పార్టీ మారడం వాయిదా పడినట్లేనా?  లేదా త్వరలో ప్రత్యేక ముహుర్తం ఉంటుందా? అంటే తెలుగుదేశం శ్రేణులు ఆసక్తికరమైన సమాధానం ఇస్తున్నాయి.

కొణాతాలతో పాటే పాడేరు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు- పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు ఒకేసారి చేరాలని భావించారు. అయితే ఈ చేరికలో జాప్యం జరిగింది. వ్యూహం ప్రకారమే ముందుగా తన అనుచరులను పంపించి.. ఆ తరువాత ప్రత్యేక ముహూర్తంలో కొణతాల పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కొంత సమయం పట్టవచ్చని చెబుతున్నారు. దాదాపు వచ్చే ఎన్నికల వరకు ఆయన తటస్థంగానే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

బాబ్జీ - కిడారితోపాటు కొణతాలను కూడా పార్టీలో చేర్చుకోవాలని తెదేపా అధిష్ఠానం యోచించినా ఆయన ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. దీంతో సర్వేశ్వరరావు - గండి బాబ్జీ చేరికకు మాత్రం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తగిన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కొణతాల తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల వద్ద అన్నట్లు తెలిసింది. దీంతో సర్వేశ్వరరావు - బాబ్జీల చేరికకు సిద్ధమైపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి అయ్యన్నపాత్రుడు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రిని కొణతాల కలిసే ఏర్పాట్లు చేసిన విషయం విదితమే. ఆయన రాకపై అప్పట్లోనే తెదేపాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యేలు సమావేశమై వ్యతిరేకించడం చోటుచేసుకున్నాయి. దీంతో రామకృష్ణ తన నిర్ణయాన్ని ప్రకటించకుండా వాయిదా వేసుకుంటూ వచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలైపోయింది

06:29:00 Add Comment
రామ్ చరణ్ మొదలుపెట్టిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మెగాస్టార్ చిరంజీవి మూవీ.. రెండూ ఒకేసారి ప్రారంభమయ్యాయి. చెర్రీ తల్లి సురేఖ - రామ్ చరణ్ ల సమక్షంలో.. వీరి గత నివాసంలో కొణిదెల బ్యానర్ ను స్టార్ట్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కత్తిని తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. 

ఈ చిత్రాన్ని కొణిదెల బ్యానర్ పై రామ్ చరణ్ సురేఖలు నిర్మిస్తుండగా.. ఇప్పుడీ మూవీకి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పవర్ ఆన్ చేయగా.. తొలి షాట్ కు మెగా బ్రదర్ నాగబాబు దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పరుచూరి  వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. ఈ ప్రాజెక్టుకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న కత్తిలాంటోడు చిత్రానికి.. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

మెగాస్టార్ కుటుంబం ఈ రెండు ప్రారంభాలను ప్రైవేట్ ఈవెంట్ మాదిరిగానే జరిపారు. కుటుంబసభ్యులు సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అల్లు అర్జున్ - వరుణ్ తేజ్ - సాయి ధరం తేజ్ - నాగ బాబు - అల్లు అరవింద్ - కొరటాల శివ - శరత్ మరార్ - జెమిని కిరణ్ - డీవీవీ దానయ్య. తిరుపతి ప్రసాద్ తో పాటు మరికొంత మంది సన్నిహితులు కూడా ఈ మెగా ఈవెంట్ లో సందడి చేశారు. 

కరుణకు పదవి.. జయకు డబ్బు..

02:47:00 Add Comment

డీఎంకే అధ్యక్షులు కరుణానిధికి పదవి ఆశ పట్టుకుందని డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్‌ ఆరోపించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూడా భారీగా డబ్బు కూడగట్టుకోవాలని తాపత్రయ పడుతున్నారని కూడా పేర్కొన్నారు. మదురై జిల్లా తిరుమంగళంలోని దేవర్‌ మైదానం సమీపంలో పార్టీ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. అందరిలా తాను కాగితాల్లో రాసుకొచ్చిన ప్రసంగాలు చేయనని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏది అవసరమో, పాలకపార్టీ చేస్తున్న ద్రోహమేంటోనన్న అంశాలపై మాట్లాడేందుకు రాసుకుని రావాల్సిన పనిలేదన్నారు. జయలలిత 110వ నిబంధన కింద ప్రకటించినవన్నీ నెరవేర్చినట్లు ఇటీవల ఓ ప్రకటన జారీ చేశారని గుర్తుచేశారు. దాన్ని చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. తొంభై ఏళ్లు దాటిన కరుణానిధికి ఆరోసారి ముఖ్యమంత్రి కావాలన్న దురాశ పుట్టిందని విమర్శించారు. జయలలితకు అంతకు మించి పెద్దస్థాయిలో డబ్బు వెనకేసుకోవాలన్న ఆశ కలిగిందని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య పోటీగా కెప్టెన్‌ అభివర్ణించారు. ప్రజలు తప్పకుండా తమ కూటమినే గెలిపిస్తారని చెప్పారు. ‘చెప్పింది చేశా.. చెప్పనవి కూడా చేశాన’ని జయలలిత మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ‘ప్రజలను నానా అవస్థల పాలు చేస్తాన’నే మాటను ఆమె చెప్పకుండానే ఐదేళ్లపాటు చేశారని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే నేతలు నిబంధనలు పాటించకున్నా ప్రధాన ఎన్నికల అధికారి రాజేశ్‌ లఖానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల ప్రచారసభలో ప్రజలకు కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణమంటే జయలలితకు అంత అలుసుగా మారిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ విషయాలపై తప్పకుండా విచారణ చేయిస్తామని తెలిపారు. తాను ఇలాంటి పార్టీలకు ఏమాత్రం భయపడబోనని, ప్రజల మద్దతు ఈసారి తమ కూటమికే ఉందని ధీమా వ్యక్తం చేశారు. కరూర్‌లో ఇప్పటివరకు రూ.వంద కోట్లు, రూ.200 కోట్లు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు వస్తున్న విషయాన్ని కెప్టెన్‌ ప్రస్తావించారు. ఎన్నికల సంఘం మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చిన మైసూరా…రాజీనామా లేఖ‌

02:32:00 Add Comment

షాకుల మీద షాకులు తగులుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత.. వ్యూహకర్తల్లో ముఖ్యులుగా చెప్పే మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత దక్కటం లేదన్న వేదనతో ఉన్న మైసూరా.. పార్టీ నుంచి వీడిపోవటానికి ఇదేసరైన సమయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్ తో రోజురోజుకీ బలోపేతం అవుతున్న చంద్రబాబు ధాటికి జగన్ విలవిలలాడిపోతున్నారు. తన చేతిలో ఉన్న ఎమ్మెల్యేల్ని కాపాడుకోవటంలో జగన్ నేర్పుగా వ్యవహరించటం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీటిన్నింటికి తోడు జగన్ వ్యవహారశైలి పట్ల పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మరికొన్నేళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి ఏపీలో తిరుగులేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇది జగన్ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ మాత్రం అవకాశం చిక్కినా సైకిల్ ఎక్కేందుకు వదిలిపెట్టటం లేదు.

ఇందులో భాగంగానే తాజాగా మైసూరారెడ్డి పార్టీ వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను జగన్ కు పంపంటంతో పాటు.. తాను పార్టీ ఎందుకు వీడిపోవాలన్న విషయాన్ని ఆ లేఖలో మైసూరా స్పష్టం చేస్తారని చెబుతున్నారు. 

తెలంగాణ ఉద్యమం ప్రపంచానికే మాట

02:28:00 Add Comment



 అమరులకు నివాళితో ప్రారంభమైన 
ప్లీనరీ  సమావేశంలో భాగంగా 15 తీర్మానాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. సంక్షేమ పథకాల ఆధారంగా తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - పార్టీ నాయకులు - కార్యకర్తల రాకతో ఖమ్మం గులాబీమయంగా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా టీఆర్ ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షోపదేశం చేశారు. 15 ఏళ్లు నిరంతరంగా సాగిన ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించామన్నారు. ప్రపంచానికే భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం చేశామని కేసీఆర్ చెప్పారు. ధీరులు అవరోధాలను అధిగమించి లక్ష్యం వైపు ముందుకెళ్తారనే సందేశం ఇందులో అంతర్లీనంగా ఉందన్నారు. టీఆర్ ఎస్ శ్రేణులు అవమానాలను - అవహేళనను తట్టుకొని తెలంగాణ కోసం ఉద్యమించారని గుర్తు చేశారు.

మే నెల ముగిసే సమయానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని వెల్లడించారు. 3500 నుంచి 4వేల మంది నాయకులకు నామినేటెడ్ పోస్టులు వస్తాయని స్పష్టం చేశారు. పదవులు వచ్చినవారే గొప్పవాళ్లు కారని రానివాళ్లు చిన్నవాళ్లు కారని కేసీఆర్ అన్నారు. తెలివైన రాజకీయనాయకుడు తన టర్మ్ కోసం ఎదురుచూడాలని సూచించారు. పార్టీ - ప్రభుత్వం జోడు గుర్రాల్లాగా పరుగెత్తాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు.

సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు. మిషన్ కాకతీయ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలంగాణ నీటి కార్యక్రమాలను దేశవిదేశాలు ప్రశంసిస్తున్నాయని చెప్పారు. కరవు శాశ్వత నివారణకు మిషన్ భగీరథ పరిష్కారం చూపుతుందని చెప్పిన ఆయన... మే 30లోపు రైతుల పొలాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీనిచ్చారు. ఇంటింటికీ నీరందించకుంటే ఓట్లడగబోమని చెప్పానని కార్యకర్త ఉద్యమస్ఫూర్తిపై ఉన్న భరోసాతోనే ప్రకటన చేశానని తెలిపారు. అలాగే ఇక తెలంగాణలో కరెంట్ కోతలు ఉండబోవన్నారు. త్వరలోనే జైపూర్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం కానుందని ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ రానుందని స్పష్టం చేశారు

పవన్ సినిమా లాంచ్

02:23:00 Add Comment

పవన్ కళ్యాణ్- ఎస్ జే సూర్య సినిమా మొదలైంది. శరత్ మరార్ కొత్త ఆఫీస్ లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎవ్వరికీ ఆహ్వానాలు కూడా అందలేదు. కేవలం పవన్, సూర్య, శరత్ మరార్, ఎడిటర్ గౌతంరాజు మాత్రమే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ మరో విశేషమేంటంటే పవన్ సినిమా కొత్త సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్ కొట్టడం. ఇక్కడే అసలు ఆసక్తి రేకెత్తుతుంది. తన సినిమాకు సంబంధించిన వాళ్లను మినహా.. బయటి వాళ్లను అసలు ఆహ్వానించలేదు పవన్ కళ్యాణ్. మరి సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడంటే.. పవన్-సూర్య సినిమాకు నితిన్ తండ్రి నిర్మాత కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా చాలా సైలెంట్ గా తన కొత్త సినిమా మొదలుపెట్టేసాడు పవర్ స్టార్. కొత్త సినిమా ముహూర్తం విషయంలో మీడియాకు కూడా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు పవన్. ఎవ్వరికీ చెప్పకుండానే తంతు పూర్తి చేసాడు. ఇప్పటికే కథ పూర్తైపోయింది. ఖుషీ, పులి తర్వాత సూర్య-పవన్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఇది. మొత్తానికి సర్దార్ తర్వాత పవన్ ఎన్నాళ్లు గ్యాప్ తీసుకుంటాడో అని అభిమానులు కంగారు పడ్డారు. కానీ వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎవరూ ఊహించని విధంగా కొత్త సినిమాకు కొబ్బరికాయ్ కొట్టాడు పవర్ స్టార్. అన్నీ కుదిర్తే మే తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటాడని సమాచారం. ఇదే ఏడాది సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు పవర్ స్టార్

తమిళ తెరను ఏలుతున్న భధ్రకాళీ పిలిమ్స్

07:53:00 Add Comment


తమిళ చిత్రసీమలో భధ్రకాళి పిలిమ్స్ కొత్త సంచలనం సృష్టిస్తోంది. తెలుగులో విజయవంతమైన చిత్రాలను తమిళంలో అనువదిస్తూ విజయాల బాటలో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఏడు చిత్రాలను తమిళంలో అనువదించి విజయాలను అందుకున్న భధ్రకాళి ప్రసాద్ మరో చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. శ్రీమంతుడు చిత్రంలో వెలుగులోకి రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భధ్రకాళి ప్రసాద్ అనంతరం బ్రూస్ లీ, ఆగడు, రచ్చ, బలుపు, ఎవడు తదితర చిత్రాలతో తమిళంలో బాక్సాపీసు విజయం సాధిస్తున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన డార్లింగ్ ఇప్పుడు తమిళంలో ప్రబాస్ టాగ్ లైన్ బాహుబలి పేరుతో అనువదించబడింది. ఈ చిత్రం ఆడియో చెన్నైలోని ఏవిఎంలో జరిగింది. ఈసందర్భంగా భధ్రాకాళి ప్రసాద్ మాట్లాడుతూ.. తమిళ ప్రేక్షకుల ఆదరణే తాను నెలకో తెలుగు చిత్రాన్ని తమిళంలోకి అనువదించేందుకు సంజీవనిగా పనిచేస్తుందని అన్నారు. తెలుగులో పరాజయం పాలైన తమిళ ప్రేక్షకులకు కావాల్సిన మసాలా ఎలిమెంట్స్ తమ చిత్రాలకు లాభాలను అర్జిస్తున్నాయని అన్నారు.

తమిళనాడు ఎన్నికల్లో ఊపందుకున రాజకీయ విమర్శలు

08:04:00 Add Comment
ఎస్ఎంకే మహిళా విభాగ అధ్యక్షురాలు, సినీ నటి రాధికా శరత్ కుమార్ తన భర్త శరత్ కుమార్ పోటీ చేస్తున్న తిరుచెందూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ.. విజయకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలలోకి వెళితే, రాధిక అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. కెప్టెన్ విజయకాంత్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని, తాను ఆయనతో పలు సినిమాల్లో నటించానని, అందువల్లే ఆయన సత్తా ఏంటో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా.. విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకే తెలియడం లేదని, అలాంటప్పుడు ప్రజలు ఆయనను ఎలా అర్థం చేసుకోగలరని రాధిక విమర్శనాస్త్రాలు సంధించారు.

చర్చకు తెర తీసిన సరి-బేసి విధానం

07:53:00 Add Comment
కేంద్ర మాజీ మంత్రి,బిజెపి సీనియర్ నేత విజయ్ గోయల్ కు జరిమానా విదించారు. డిల్లీలో సరి,బేసి సంఖ్యల ఆదారంగా ట్రాపిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టిన సందర్బంగా ఆయన కొన్ని విమర్శలు చేస్తున్నారు.ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతోందని ఆయన ఆరోపించారు.దీనికి నిరసనగా ఈ సరి,బేసి సంఖ్యల పద్దతికి నిరసన తెలుపుతానని ప్రకటించారు.ఆ ప్రకారం సోమవారం నాడు నిబంధనను ఉల్లంఘించి కారు నడిపారు. అప్పుడు డిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ బిజెపి నేత విజయ్ గోయాల్ కు పువ్వు ఇచ్చి నిబందన ఉల్లంఘించవద్దని కోరారు.అయినా ఆయన వినలేదు.దాంతో పోలీసులు విజయ్ గోయల్ కు రెండువేల జరిమానా విదించారు.సామాన్యులకు ఇంత మొత్తం చాలా ఎక్కువని ఆయన అన్నారు. ట్రాపిక్ సిస్టమ్ కారణంగా ప్రజలు రెండేసి కార్లు కొనుక్కోవలసిన అవసరం ఏర్పడుతోందని ఆయన అన్నారు.

రజినీ అభిమానులతో పెట్టుకున్నా రామ్ గోపాల్ వర్మ

01:41:00 Add Comment

This man by being the biggest star ever completely destroys the notion of looks being important for stardom



Dumb fans of Rajni who dint realise my tweets r compliment shud realise Rajni himself makes fun of himselfhttps://www.youtube.com/watch?v=KBvIOCPeT7c 

కబాలి’ డబ్బింగ్ ప్రారంభం

01:30:00 Add Comment

‘కబాలి’ ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా. రంజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఈ రోజు మొదలయ్యాయని తెలిసింది. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో విపరీతమైన అంచనాలు రేకెత్తించిన ‘కబాలి’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా మరో రెండు వారాల్లో టీజర్ రిలీజ్‌ చేయనున్నట్లు తెలిసింది. ఆ తరువాత జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే నటిస్తున్న ఈ సినిమా తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు తరువాత విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించినట్టు సమాచారం.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వ్యూహం ఏంటి?

01:15:00 Add Comment


తుని ఘ‌ట‌న‌తో అత‌డి పాపులారిటీ కాపుల్లో ఓ రేంజులో పెరిగింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈయ‌న మొండోడు. ఏదైనా సాధిస్తాడు.. పంతం నెగ్గించుకుంటాడు.. అని చంద్ర‌బాబుకే అర్థ‌మైంది. భ‌విష్య‌త్‌లో అత‌డి వ‌ల్ల టీడీపీకి థ్రెట్ ఉంద‌ని బాబుకు ముందే అర్థ‌మై కాపు కార్పొరేష‌న్‌కి త‌క్ష‌ణం 500 కోట్లు కేటాయించాడు. అయితే ఆ డ‌బ్బు ముట్టిన తర్వాత ఉద్య‌మం విర‌మించుకున్న ముద్ర‌గ‌డ మ‌ళ్లీ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు.
జూన్ త‌ర్వాత ఉద్య‌మం మ‌లిద‌శ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ముద్ర‌గ‌డ అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో బాబుకు ముందుంది ముస‌ళ్ల పండుగ అన్న హెచ్చ‌రిక జారీ అయిన‌ట్టే. అయితే సేమ్ టైమ్ అత‌డు జ‌గ‌న్‌ని, ప‌వ‌న్‌ని వ్యూహాత్మ‌కంగా టార్గెట్ చేశాడు. జ‌గ‌న్ నాకు స‌ల‌హాలిచ్చేటంత‌టివాడా? అంటూ ప్ర‌శ్నించి.. త‌న ఉద్య‌మాల వెన‌క జ‌గ‌న్ లేనేలేడ‌ని చాటాడు. ఇక ప‌వ‌న్ వ‌చ్చేదేంటి? మాకు మ‌ద్ద‌తిచ్చేదేంటి? మేం చేత‌కాని వాళ్ల‌మా? అయినా ప‌వ‌న్‌ని ఉద్య‌మానికి స‌పోర్టు చేయ‌మ‌ని పిల‌వ‌లేదే.. అంటూ ఘాటుగానే మాట్లాడారాయ‌న‌. ఇదంతా ఈ సీనియ‌ర్ నేత వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ అని చెప్పుకుంటున్నారు.

నగరంలో కురిసిన భారీ వర్షం

01:07:00 Add Comment

గత కొన్ని రోజులుగా ఎండ దెబ్బకు హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఒకవైపు ఎండతో పాటు.. మరోవైపు వడగాలులు తోడవ్వడంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా గాల్లో కలిసిపోతున్నాయి. ఇటువంటి సమయంలో హైదరాబాదీలకు చల్లని వార్తను అందించాడు వరుణుడు. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం సమయంలో అక్కడక్కడ చినుకులు కురిశాయి. ఇక చీకటి పడ్డాక భారీ వర్షం కురవడం మొదలుపెట్టింది. అంతే.. ఎంతో కాలంగా వేడితో అల్లాడిపోయిన జనాలు.. చల్లని వర్షంలో హాయిగా సేదతీరారు. ఇక, నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి.