సర్దార్ గబ్బర్ సింగ్’ రికార్డునే కాదు.. శ్రీమంతుడు కలెక్షన్లను కూడా దాటలేకపోయిన బ్రహ్మోత్సవం !!

05:20:00 Add Comment

సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ అయినా సరే.. తొలి రోజు రికార్డుల మోత మోగించింది. కలెక్షన్లలో నాన్-బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టేసింది. ‘శ్రీమంతడు’ నెలకొల్పిన కలెక్షన్ల రికార్డును దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.17 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.29 కోట్ల దాకా షేర్ ఖాతాలో వేసుకుంది. ఐతే ఆ రికార్డును ‘బ్రహ్మోత్సవం’ ఈజీగా దాటేస్తుందని అంచనా వేశారు మహేష్ అభిమానులు. విడుదలకు నాలుగు రోజుల ముందు వరకు కొంచెం సందేహాలున్నా.. తెలంగాణ వరకు సింగిల్ స్క్రీన్లలో సైతం తొలి రోజు అదనంగా ఒక షో (ఐదోది) వేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ‘సర్దార్’ రికార్డు బద్దలవడం పక్కా అని తీర్మానించారు ట్రేడ్ పండితులు.
కానీ ‘బ్రహ్మోత్సవం’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రికార్డునే కాదు  శ్రీమంతుడు కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా తొలి రోజు రూ.12.5 కోట్ల షేర్ రూ.18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు రెండు రాష్ట్రాల్లో భారీగా బెనిఫిట్ షోలు వేయడం కలిసొచ్చింది. మహేష్ సినిమాకు బెనిఫిట్ షోలు పెద్దగా లేకపోయినా.. ఇక్కడ తెలంగాణలో పడే ఐదో షో ఆ గ్యాప్ కవర్ చేస్తుందని అనుకున్నారు. ‘సర్దార్’తో పోలిస్తే ఫుల్ పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో నాన్-బాహుబలి డే-1 రికార్డు పక్కా అనుకున్నారు. కానీ ‘బ్రహ్మోత్సం’.. మహేష్ లాస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. డే-1 కలెక్షన్లలో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఎంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు అన్ని షోలకూ ముందే టికెట్లు బుక్ అయిపోయి ఉంటాయి కదా. అయినా ‘బ్రహ్మోత్సవం’ నాలుగో స్థానానికి పరిమితం కావడం ఆశ్చర్యమే. 

జనతా గ్యారేజ్

04:59:00 Add Comment


             
ఇక తెలుగు - తమిళం - మలయాళంలలో కూడా ''జనతా గ్యారేజ్'' అనే టైటిల్ ను పెడుతున్నట్లు ఆల్రెడీ మేకర్లు మనకు కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మలయాళం వర్షెన్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. ఇక్కడే ఒక ట్విస్టుంది. నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తెలుగులో విడుదల చేశారు. అయితే ఇవాళ మోహన్ లాల్ పుట్టినరోజు కాబట్టి.. మలయాళంలో ఆయన ఫస్టు లుక్ ను విడుదల చేశారు. కాకపోతే జనతా గ్యారేజ్ అంటూ మోహన్ లాల్.. ఆయన తమ్ముళ్లగా నటిస్తున్న తమిళ నటుడు రెహ్మాన్.. తెలుగు నటుడు బ్రహ్మాజీలతో కూడిన ఫోటోనే విడుదల చేశారు కాని.. మనోళ్ళు ఎన్టీఆర్ స్టిల్ మాత్రం విడుదల చేయలేదు. సినిమాలో మోహన్ లాల్ తమ్ముడు  రెహ్మాన్ కొడుకుగా ఎన్టీఆర్ కనిపిస్తాడని టాక్. 

వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల - దిల్ రాజు ల చిత్రం త్వరలో ప్రారంభం

04:53:00 Add Comment
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. 

ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది", అని తెలిపారు. 

ఈ చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

ఏపీ రాజధాని ప్రాంత ప్రజలకు ఊహించలేని ఒక కానుక

07:00:00 Add Comment


ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.2.5లక్షల వరకు అవసరమైన వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో దాదాపు 1100 వరకూ శస్త్రచికిత్సల్ని అందించనున్నారు. అయితే.. ఈ ఆఫర్ 2014 డిసెంబరు 8వ తేదీ నాటికి అమరావతి (సీఆర్ డీఏ పరిధిలోని ప్రాంతం)లో నివసించిన వారికి మాత్రమే అందనుంది.
ఈ వైద్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించనున్నారు. ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవల్ని అందించాలన్న నిర్ణయం.. అక్కడి ప్రజల్ని ఆనందానికి గురి చేయటం ఖాయంగా చెబుతున్నారు. ఇక.. పేదలకు వైద్యసాయం చేసే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కు సీఆర్ డీఏ చెల్లింపులు చేయనుంది. బాబు సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం రాజధాని ప్రాంత పరిధిలో నివసించే పేదలకు తీపి కబురు అవుతుందనటంలో సందేహం లేదు. తప్ప మిగిలిన వారంతా చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి. తమ జీవితంలో ఎప్పుడూ ఊహించలేనంత మార్పు రావటం.. ఏపీ భవిష్యత్తు మొత్తం తమ లోగిళ్లలోనే తయారయ్యే అద్భుత అవకాశం దక్కటం వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆనందపడేవాళ్లు ఆనందపడుతున్నా.. రాజధాని రావటంతో పచ్చటి పొలాలు మాయమై మొత్తం కలుషితంగా మారిపోతుందని భయంతో బాధపడే వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని ప్రాంత ప్రజలకు ఊహించలేని ఒక కానుకను ప్రకటించి విస్మయానికి గురి చేసిందని చెప్పాలి.ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.2.5లక్షల వరకు అవసరమైన వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో దాదాపు 1100 వరకూ శస్త్రచికిత్సల్ని అందించనున్నారు. అయితే.. ఈ ఆఫర్ 2014 డిసెంబరు 8వ తేదీ నాటికి అమరావతి (సీఆర్ డీఏ పరిధిలోని ప్రాంతం)లో నివసించిన వారికి మాత్రమే అందనుంది.ఈ వైద్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించనున్నారు. ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవల్ని అందించాలన్న నిర్ణయం.. అక్కడి ప్రజల్ని ఆనందానికి గురి చేయటం ఖాయంగా చెబుతున్నారు. ఇక.. పేదలకు వైద్యసాయం చేసే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కు సీఆర్ డీఏ చెల్లింపులు చేయనుంది.

పవన్ చేతులారా చేడగోట్టుకున్నాడా !!

10:05:00 Add Comment

తెలుగు సినిమా మార్కెట్‌ ఇప్పుడు బాగా పెరిగింది. బాహుబలి తర్వాత మన సినిమా రేంజ్‌ కనీసం పది నుంచి ఇరవై కోట్ల వరకు పెరిగింది. ఇది కేవలం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ వరకే. ఇక పోస్ట్‌ రిలీజ్‌ అయితే ఇప్పుడు తెలుగు సినిమా సత్తా ఎంతనేది అంచనాకి కూడా అందడం లేదు. ఏ సినిమా అయినా కాస్త బాగుంటే, అందులో ఒక సూపర్‌స్టార్‌ వుంటే వంద కోట్ల షేర్‌ వచ్చి పడిపోతుంది. 'సరైనోడు' లాంటి సినిమాని ఆ స్థాయిలో చూస్తున్నారంటే ఇక నిజంగా విషయమున్న సినిమాలని ఏ స్థాయిలో ఆదరిస్తారని అనుకోవాలి? ఇలాంటి టైమ్‌ని వాడుకోవడంలో పవన్‌కళ్యాణ్‌ విఫలమయ్యాడు. ప్రేక్షకుల అభిరుచిని మరీ చీప్‌గా చూసి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' లాంటి అతి చెత్త ప్రోడక్ట్‌ వదిలాడు. అక్కడికీ దానికి యాభై కోట్ల షేర్‌ వచ్చింది. నిజంగా ఈ సినిమా కనుక యావరేజ్‌గా అనిపించినా మరో యాభై కోట్లు ఈజీగా వచ్చి ఉండేవి. ఇప్పుడు బ్రహ్మూెత్సవం చిత్రానికి వంద కోట్ల షేర్‌ తక్కువ రాదని అంచనా వేస్తున్నారు. కనీసం తదుపరి చిత్రాన్ని అయినా క్రేజీగా ప్లాన్‌ చేయకుండా అవుట్‌డేటెడ్‌ అయిపోయిన ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఫామ్‌లో లేని ఎస్‌.జె. సూర్యతో పవన్‌ చేస్తున్నాడు. ఆ చిత్రం కనీసం యావరేజ్‌గా పాసైపోయినా చాలని పవన్‌ అభిమానులే భావిస్తున్నారంటే అతనెలాంటి చిత్రాల్ని రెడీ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు.

బ్రిటన్ పార్లమెంట్‌లో నటుడు మోహన్‌బాబుకు అరుదైన గౌరవం

09:44:00 Add Comment




బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్‌బాబుకు అరుదైన గౌరవం దక్కింది. మోహన్‌బాబు కెరీర్‌లో బెస్ట్ డైలాగ్స్‌తో కూడిన పుస్తకాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఏషియన్ లైట్ 10వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. 

ఏషియన్ లైట్ (న్యూస్ పేపర్) బ్రిటన్‌లో భారతీయ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. బ్రిటన్ లో తెలుగు భాషలో నాన్ బ్రిటీషీ రచయిత రాసిన పుస్తకాన్ని విడుదల చేయడం ఇదే మొదటి సారని ఏషియన్ లైట్ ఎడిటర్ అజీజ్ అనసుదీన్ తెలిపారు. భారత సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించడంతోపాటు విద్యా, క్రీడారంగాల్లో చేసిన సేవలకుగానూ హారో ఈస్ట్ ఎంపీ (బ్రిటన్)బాబ్ బ్లాక్‌మన్ మోహన్‌బాబుకు ప్రణమ్ అవార్డును ప్రదానం చేశారు.

జ్యోతి లక్ష్మి కి దక్కిన అరుదైన గౌరవం

01:47:00 Add Comment


ఛార్మి ప్రధాన పాత్రధారిణిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని రచయిత్రి మంగళగౌరీ విమర్శనాత్మకంగా పుస్తక రూపంలో రాశారు. ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తనికెళ్ళభరణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పీహెచ్‌.డీ చేయదగిన స్థాయిలో మంగళగౌరీ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సినిమాకు కావ్యగౌరవం కల్పించిన మంగళగౌరీ అభినందనీయురాలు. 'ఇట్లు..శ్రావణీ సుబ్రమణ్యం' చిత్రంలోని డైలాగులు చూసొచ్చి, నేను సినిమా చేస్తే డైలాగులు మీరే రాయాలని పూరి దగ్గర మాట తీసుకున్నాను. ఉత్తమ సంభాషణలకుగాను ఆ చిత్రం నంది అవార్డును కైవసం చేసుకుంది. 'అనుకోకుండా ఒక రోజు', 'జ్యోతిలక్ష్మి' చిత్రాలు ఛార్మీ కెరీర్‌లో నిలిచిపోతాయి. ఇదే కాంబినేషన్‌లో 'జ్యోతిలక్ష్మి పార్ట్ 2' కూడా రావచ్చేమో' అని అన్నారు. 'పుస్తకంతో మొదలైన 'జ్యోతిలక్ష్మి' సినిమా పుస్తకంతోనే ముగుస్తుంది. 
 ఈ సినిమాను పూరిగారు ఎంతో స్ఫూర్తితో రూపొందించారు. ఈ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా జ్యోతిలక్ష్మి అని పిలుస్తున్నారు' అని కథానాయిక ఛార్మి చెప్పారు. 'మల్లాదివారితో మాట్లాడిన తర్వాతే పూరి ఈ చిత్రాన్ని చేశారు. ఆధునిక కన్యాశుల్కం అని నేను జ్యోతిలక్ష్మి గురించి చెబుతాను. ఈ సినిమా చూసిన ప్రతి పురుషుడు చాలా నేర్చుకోవాలి. తమ భార్యలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. వారిని ప్రోత్సహించాలి. ఈచిత్రంలోని క్లైమాక్స్‌ నన్ను కదిలించింది. భవిష్యత్‌లోనూ పూరిజగన్నాథ్‌ చిత్రాల గురించి, ఛార్మి గురించి పుస్తకాలు రాయాలనుకుంటున్నాను' అని రచయిత్రి మంగళగౌరీ అన్నారు. ఈ కార్యక్రమంలో టార్జన్‌, గాయత్రి, అపూర్వ, సునీల్‌కశ్యప్‌, శాండీ, పి.జి.విందా, సత్యదేవ, ఆకాష్‌పూరి తదితరులు పాల్గొన్నారు. '40 సంవత్సరాల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'మిస్టర్‌ పరాంకుశం' కథను 20 ఏళ్ళ క్రితం నేను సినిమాగా తీయాలనుకున్నాను. ఏడేండ్ల కిందట ఛార్మితో కలిసి ఈ సినిమాను తీద్దామనుకున్నాను. ఫైనల్‌గా సినిమా తీశాం. ఈ క్రమంలో జరిగిన ప్రతి విషయంతోపాటు సినిమాపై మంగళగౌరీ పుస్తకం రాయడం చాలా ఆనందంగా ఉంది. దీంతో మా సినిమాపై మరింత గౌరవం పెరిగింది. ఛార్మి పాత్రను మధురవాణితో పోల్చడం మరింత సంతోషంగా ఉంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన భరణిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సినిమాపై పుస్తకం రాయడమనేది మా అందరికి ఓ స్ఫూర్తినిస్తుంది. అవార్డులు వచ్చిన దానికంటే చాలా ఆనందంగా ఉంది' అని వీడియో సందేశంలో పూరీజగన్నాథ్‌ తెలిపారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షాక్ కు గురియ్యాడు.!!

01:38:00 Add Comment


తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 24 చిత్రాన్ని చూసి అల్లు అర్జున్ షాక్ అయ్యాడట . విక్రం కుమార్ టేకింగ్ ,తిరు సినిమాటోగ్రఫీ ,సూర్య యాక్టింగ్ వెరసి టేర్రిఫిక్ విజువల్స్ అని ,ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అంటూ విక్రం కుమార్ ని పొగడ్తలతో ముంచెత్తాడట అల్లు అర్జున్ . మే 6న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన 24 చిత్రం అన్ని చోట్లా మంచి కలెక్షన్ల ని రాబడుతున్న సంగతి తెలిసిందే . కాగా విక్రం కుమార్ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో ఉండటం వల్ల 24 చిత్రాన్ని చూసాడు అల్లు అర్జున్ . విక్రం స్క్రీన్ ప్లే బాగా నచ్చిందని విజువల్ ట్రీట్ అదిరిందని విక్రం పని తీరుని మెచ్చుకున్నాడట అల్లు అర్జున్.

కబాలి రిలీజ్ డేట్ కన్ఫమ్ !!

08:16:00 Add Comment

రజినీ సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ అయితే తప్ప మిగతా సినిమా షెడ్యూళ్లు ఖరారవ్వవు. ‘కబాలి’ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆ సినిమా రిలీజ్ డేటేదో తేలితే.. తమ సినిమాల్ని దానికి తగ్గట్లుగా షెడ్యూల్ చేసుకుందామని చూస్తున్నారు చాలామంది నిర్మాతలు. ఐతే రెండు నెలలుగా రిలీజ్ డేట్ విషయంలో నాన్చుతూ వస్తున్న ‘కబాలి’ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్.థాను ఎట్టకేలకు ఓ కంక్లూజన్‌కు వచ్చాడు. జులై 1న ‘కబాలి’ రిలీజవుతుందని ఆయన ప్రకటించాడు. దీంతో జూన్ నెలలో ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ యధావిధిగా విడుదల చేసేయొచ్చు. ఆ మధ్య పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా రజినీ మాట్లాడుతూ మే 27 లేదా జూన్ తొలి వారంలో ‘కబాలి’ విడుదలవుతుందని ప్రకటించాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న ప్రకారం జరగకపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఏ హడావుడి లేకుండా జులై 1న సినిమాను విడుదల చేసుకోవాలని ఫిక్సయ్యాడు థాను. యువ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీ మాఫియా డాన్ పాత్ర పోషించాడు.

చిరు లాంటి డ్యాన్సర్ లేరన విజయశాంతి

08:10:00 Add Comment
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌ ను ఎక్కడికో తీసుకెళ్లి ఆయన్ని శిఖరంపై నిలబెట్టిన ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తన హీరో చిరంజీవి మీద ప్రశంసల జల్లు కురిపించారు.

‘గ్యాంగ్ లీడర్’లో తన పాత్ర చిరు పాత్రకు దీటుగా ఉంటుందని.. ఆ పాత్ర అంత బాగా రావడానికి చిరంజీవి కూడా కారణమని విజయశాంతి చెప్పింది. ‘గ్యాంగ్ లీడర్’లోని భద్రా చలం కొండ పాటను ఊటీలో తీస్తుండగా.. తనకు ‘కర్తవ్యం’ సినిమాకు గాను జాతీయ అవార్డు వచ్చిందని తెలిసిందని.. ఈ విషయం తెలిసి చాలా సంతోషించిన చిరు.. ఆ సాయంత్రం హోటల్లో అందరికీ పెద్ద పార్టీ ఇచ్చారని విజయశాంతి వెల్లడించారు. చిరంజీవితో తాను చాలా సినిమాలు చేసినప్పటికీ.. ‘గ్యాంగ్ లీడర్’ చాలా ప్రత్యేకమని ఆమె అంది. చిరంజీవితో కలిసి ‘గ్యాంగ్ లీడర్’లో అదిరిపోయే స్టెప్పులేశానని.. దేశంలోనే చిరంజీవిని మించిన డ్యాన్సర్ లేడన్నది తన అభిప్రాయమని విజయశాంతి చెప్పింది. ఇప్పటి హీరోలు డ్యాన్సులు బాగానే చేస్తున్నప్పటికీ.. ఎవ్వరూ కూడా చిరంజీవిని మ్యాచ్ చేయలేరని.. ఆయన స్టైల్ ఇంకెవ్వరికీ రాదని విజయశాంతి అభిప్రాయపడింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని తమిళనాడు.. కర్ణాటక.. బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకం ?

01:17:00 Add Comment

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య ఇచ్చిన హామీ.. 2014 ఎన్నికల సమయంలో మోడీ స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ విషయాన్ని మరిచిపోయి.. ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న విషయాన్ని బీజేపీ నేతలు కొంతకాలంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ మధ్యన కేంద్రమంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని ఏకపక్షంగా తేల్చేయటంపై తీవ్రఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేక హోదా మీద కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్ష నేతలుసైతం తీవ్రంగా మండిపడుతూ.. మోడీ సర్కారుపై విమర్శనాస్త్రాల్ని సంధించటం తలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చిత్రమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో చేర్చి ఉంటే సరిపోయేదని..ఆ పని కాంగ్రెస్ చేయలేదంటూ విమర్శలు చేస్తున్నగజపతి రాజు.. ఏపీకి ప్రత్యేకహోదాను ముగ్గురు ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారంటూ కొత్త విషయాన్ని తెర మీదకు తెచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని తమిళనాడు.. కర్ణాటక.. బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. విభజన బిల్లులో కానీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి ఉన్నట్లైయితే..ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని.. ఎవరూ అడ్డుకునే వారు కాదంటూ కొత్త రాగం తీయటం విశేషం. పెద్దమనిషిగా కనిపించే అశోక్ గజపతి రాజు చెప్పిన మాటలు వింటున్న కొందరికి షాక్ తగులుతున్న పరిస్థితి. ఎందుకంటే.. అశోక్ గజపతి మాటలే నిజం అనుకుంటే.. విశాఖకు రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో స్పష్టంగా ఉంది? మరి.. కేంద్రం గడిచిన రెండేళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు తేల్చటం లేదు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత విభజన చట్టంలో ఉంది. మరి.. దానికి చిల్లర పైసలు విసురుతున్నట్లుగా నిధుల కేటాయింపు ఉంది. ఎందుకలా జరుగుతుంది? ఇవే కాదు.. విభజన కారణంగా ఏర్పడే ఏపీ లోటును పూడ్చాలంటూ చాలా స్పష్టంగా విభజన చట్టంలో ఉంది. ఇలాంటి ప్రశ్నలకు అశోక్ గజపతి సమాధానాలు చెబితే బాగుంటుంది. 

అనంతపురంలో నిరవధిక దీక్షలు

22:58:00 Add Comment

వామపక్షాల ఆధ్యర్యంలో ప్రదర్శనలు - సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ - ఆందోళనలకు సిద్ధమౌతున్న వైసిపి, కాంగ్రెస్‌ ప్రజాశక్తి - యంత్రాంగం రాష్ట్రంలో ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు అంశం వేడెక్కుతోంది. అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరుగుతుం డటంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఈ విషయంపై మాట్లాడక తప్పనిస్థితి ఏర్పడుతోంది. అనంతపు రంలో ఆదివారం నాడు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ప్రారంభమైనాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయి తమ సంఘీభావం ప్రకటించారు. పలు ప్రజాసంఘాలు ఈ ఆందోళనలకు మద్దతు తెలిపాయి. వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదాల సాధన కోసం ప్రదర్శనలు సాగాయి. వైసిపి, కాంగ్రెస్‌ పార్టీలూ పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమౌతున్నాయి. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపికి చెందిన సీనియర్‌ నేతలతో సమావేశమైనారు. హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెబుతూనే, విమర్శలు చేయవద్దని సూచించారు. కేంద్రం ఇప్పటిదాకా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలకు సంబంధించి సమగ్ర నివేదిక తయారుచేయాలని ఆదేశిం చారు. అదే సమయంలో కేంద్ర మంత్రిమండలి నుండి బయటకు వస్తే ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ అక్కడక్కడ అధికార పార్టీలోనూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. అధికారికంగానూ, అనధికారికంగానూ ఆ పార్టీ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. తాము ఎంత సర్ధుకుపడి పోవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదని చెప్పారు. కేంద్ర మంత్రులు నీతిఅయోగ్‌ అంటూ హోదా అంశాన్ని వాయిదా వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, హోదా ఆలస్యమయ్యే కొద్దే సమస్యలు మరింత పెరుగుతాయని చెప్పారు. తమిళనాడు, కర్నాటక, బీహార్‌ ముఖ్యమంత్రులే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు.

అడుగుపెడితే అయిపోతారు!

23:35:00 Add Comment


ఏపీకి ప్ర‌త్యేక హో్దా హుళ‌క్కేన‌ని ప్ర‌క‌టించింది కేంద్రం.  నేరుగా ప్ర‌క‌టించే ధైర్యం లేక .. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చే ప్ర‌క‌ట‌న చేయించింది. ఆ పాపానికి ఇప్పుడు ఆయ‌న ప్రాయాశ్చిత్తం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి. `ఇక మీరు ఏపీకి వ‌చ్చే సాహ‌సం చేయ‌కండి. అడుగుపెడితే అయిపోతారు!` అంటూ నెటిజ‌నుల నుంచి వార్నింగ్‌లు జారీ అయ్యాయి. `ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో లేదు` అంటూ పార్ల‌మెంట్‌లో గంభీరంగా ప్ర‌క‌టించిన స‌ద‌రు మంత్రి ఇప్పుడు పిల్లి అయిపోయారు. సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్స్‌లో త‌న‌పై వినిపిస్తున్న కామెంట్లు చ‌దువుకుని బెంబేలెత్తిపోతున్నారాయ‌న‌. ఏం జ‌రిగిందో ఏంటో? ఏపీకి రావ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చారంటూ వాపోతున్నారు. అయినా ఏపీకి ప్ర‌త్యేకించి నేనేమీ చెప్ప‌లేదు. అస‌లైన వాళ్లు వెన‌క ఉండి చెప్పించారు! అన్న‌ట్టే స‌ద‌రు మంత్రి భ‌యాన్ని బైట‌పెట్టారు. రెవెన్యూలోటు భ‌ర్తీ చేస్తామ‌న్న‌ప్పుడు ప్ర‌త్యేక హోదా ఎందుకు? అని మాత్ర‌మే తాను అన్నాన‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఏదేమైనా త‌ప్పిదం జ‌రిగిపోయింది. ఒక‌వేళ జ‌యంత్ సిన్హా ఏపీలో అడుగుపెడితే అప్పుడు తెలుగు ప్ర‌జ‌ల చేతుల్లో మ‌సాజ్ గ్యారెంటీ. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు, ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్, దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ .. ఇంత‌మందిని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది ఈ మ్యాట‌ర్‌.

చిక్కుల్లో పడ్డ బార్ రెఫెయిలీ

00:13:00 Add Comment


హాలీవుడ్ లో తన అందాల ఆరబోతతో కుర్రోళ్ల గుండెల్లో సెగలు పుట్టించే హాట్ మోడల్ బార్ రెఫెయిలీ తెలియనివారు ఉండరు. ఈ అమ్మడు చాలా వరకు బికినీతోనే దర్శనమిస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజగా ఈ అమ్మడు తన సొంత దేశంలో చిక్కులు ఎదుర్కొంటూ మీడియాకి ఎక్కింది. సెలబ్రెటీలు ఏ చిన్న తప్పిదాలు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్షణాల్లో పబ్లిసిటీ అవుతుంది. తాజాగా బార్ ఓ బికినీ యాడ్ లో కనిపించింది.అయితే ఈ వాణిజ్య ప్రకటనలు మరీ సెక్సీగా ఉన్నాయంటూ ఇజ్రాయెల్ వీటిని తమ దేశ టీవీ చానెళ్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించింది.

ఈ అమ్మడు ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ హుడీస్ తరుపు ఓ యాడ్ లో దాదాపు టూ పీస్ బికినీల్లో కనిపించి ఈ భామ హాట్ హాట్ గా కనిపించింది. ఈ యాడ్ చూసి చిర్రెత్తుకొచ్చిన ఇజ్రాయెల్ జాతీయ టెలివిజన్ అథారిటీ కత్తెరలు వేసింది. అంతే కాదు చాలా క్లోజప్ లో వెనుక భాగం మొత్తం న్యూడ్ గా కనిపించే విధంగా ఈ యాడ్ ఉండటం పెను సంచలనం రేపింది. ఈ యాడ్ బార్ ఫర్ హుడీస్ పేరిట రూపొందించారు.ఇజ్రాయెల్ జాతీయ టెలివిజన్ క్లోజ్ అప్ లో వెనుకవైపు నుంచి నగ్నంగా కనిపించే దృశ్యాన్ని తొలగిస్తేనే టీవీ చానెళ్లలో ప్రసారానికి అనుమతిస్తామని, లేదంటే రాత్రి 10 గంటల తర్వాతనే దీనిని ప్రసారం చేసుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఈ యాడ్ 45 సెకన్లు ఉంది..ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో హాల్ చల్ చేస్తుంది.

టీడీపీని లైట్ తీసుకోవద్దు

23:58:00 Add Comment

మేము సైలెంట్ గా ఉంటామనుకోవద్దు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దానికోసం రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి. ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పితే ఊరుకోము. రెండేళ్లుగా ఇదిగో..అదిగో..అంటూ మీ చుట్టూ తిప్పించుకొని చివరకి ఇవ్వలేము అని చల్లగా చెప్పడం సరికాదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చాలా వేధిస్తోంది. నా ఉద్దేశ్యంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఇద్దరూ దీనికి బాధ్యులు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే ముందు వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలి. ఇంకా మా సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను," అని టీడీపీ నేత, ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పడంతో బీజేపీకి మిత్రపక్షంగా సాగుతున్న టీడీపీ కూడా ప్రతిపక్షాలతో గొంతు కలిపి కేంద్రాన్ని విమర్శించడం మొదలుపెట్టింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వబోదనే విషయం టీడీపీకి ఈరోజు కొత్తగా తెలిసిన విషయమేమీ కాదు. "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయం ఎప్పుడో తెలుసు కానీ దానిని బయటకి చెప్పడం లేదు. అందుకే ఆయన హోదాకి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అడుగుతున్నారు" అని ఏడాది క్రితం అదే పార్టీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరూ కూడా ఈ సంగతి ఇప్పుడే తమకు తెలిసినట్లు నటిస్తూ ప్రజలని, ప్రతిపక్షలని మభ్యపెట్టేందుకు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మంత్రుల రాజీనామాలు కోరిన ముద్దు టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామాల గురించి మాట్లాడలేదు. ఒకవేళ ఈ వేడి ఇలాగే కొనసాగితే ప్రజలను సంతృప్తి పరిచేందుకయినా వారిద్దరి చేత రాజీనామాలు చేయించవచ్చు. 

టీఆర్ఎస్ఎల్పీలో వైసీపీని విలీనం

23:12:00 Add Comment

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు తెలంగాణాలో షాక్ తగిలింది. ఏపీలో ఓవైపు ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార టీడీపీలోకి జంప్ అవుతుంటే.. ఇటువైపు తెలంగాణాలో వైసీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ లోకి చేరిపోయి షాక్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ తెలంగాణా రాష్ట్ర శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేయాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో లేఖకు స్పందించిన స్పీకర్ వైసీపీ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను ఇకపై అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తారు. మరి తెలంగాణా రాష్ట్రంలో ఇకపై జగన్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో ఆయనకే తెలియాలి.

ఏపీలో పోల‌వ‌రం కోసం సీఎం కేసీఆర్ సాయం !

23:08:00 Add Comment

నీటి పంప‌కాల‌పై ఎవ‌రు ఎంత వాటా తీసుకోవాలో గ‌తంలోనే నిర్ణ‌య‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. ఏపీ నేత‌లు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌కు ద‌క్కాల్సిన న‌దీజ‌లాలు ద‌క్క‌లేదు. గోదావ‌రి, కృష్ణా నుంచి న్యాయంగా ద‌క్కాల్సిన వాటా రాలేదు. అందుకే `నీరు-నిధులు- నియామ‌కం` ప్రాతిపాదిక‌న దీనిపై గ‌తంలో ఎంతో పోరాడాం. తెలంగాణ‌లో ప్రారంభించిన ప్రాజెక్టులు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ముందుకు కొన‌సాగ‌లేదు. ప‌ర్యావ‌ర‌ణం వ‌ల్ల, అంత‌రాష్ర్ట వివాదాల వ‌ల్ల స‌మ‌స్య‌లొచ్చాయి. అయితే ఇప్ప‌టికైనా నీటిని స‌వ్యంగా వినియోగించుకోవాల‌ని పాల‌మూరు, దిండి ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి ప్రారంభ‌మైనా.. ఏపీలో పోల‌వ‌రం కోసం సీఎం కేసీఆర్ సాయం చేస్తామ‌న్నారు. గోదావ‌రిలో నీరు స‌మృద్ధిగా ఉంది. దానిని స‌రిగా వాడుకోలేక‌పోతున్నాం. మేం ప‌రిధి మేర మాత్ర‌మే వినియోగించుకుంటాం. మీరు కూడా వాడుకోండి. ఎగువ‌న ఉన్న మేం కూడా పోల‌వ‌రానికి సాయం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపార‌ని క‌డియం వివ‌ర‌ణ ఇచ్చారు. ప్రాజెక్టులు అడ్డుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌ర‌గ‌దు. ఎగువ‌న ఉన్న రాష్ర్టాల్లో ఎంత నీరు వాడుకోవాలి? దిగువ‌కు ఎంత వెళ్లాలి అన్న‌దానిపై ఇప్ప‌టికే క్లారిటీ ఉంది. 1400 టీఎంసీల నీరు గోదావ‌రిలో ఉంది. అందులో 950 టీఎంసీలు తెలంగాణ‌కు చెందుతుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అది తేట‌తెల్ల‌మైంది. కృష్ణాలో 300 టీఎంసీల నీరుంది. ఇందులోనూ తెలంగాణ‌కు చెందే వాటాను మాత్ర‌మే ఉప‌యోగించుకుంటాం. కాబ‌ట్టి ఏపీ అన‌వ‌స‌ర రాద్ధాంతం చేయ‌కూడదు… అని వాస్త‌వ ప‌రిస్థితిని తెలిపారు.

వర్మకు మూడు జన్మలకు ఫ్లాట్ చేసేసిందట రాధిక !

04:33:00 Add Comment



శ్రీదేవిని మినహా మిగతా హీరోయిన్స్ ను పెద్దగా ఆరాధించడు రామ్ గోపాల్ వర్మ. అయితే అటువంటి వర్మను మత్తుమత్తుగా మత్తెక్కించేభామ రాధికా ఆప్టే వర్మకు మూడు జన్మలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమధ్య ఒక ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఈ బ్యూటీ ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ను చూసి అందరూ అదిరిపోయారు.

బాలీవుడ్ లో ఎందరో టాప్ హీరోయిన్స్ ఉన్నా ఎక్స్ పోజింగ్ లో రాధిక ఆప్టే చూపించే తెగువ మరేహీరోయిన్ చేయలేదు. అహల్య అనే బెంగాలీ షార్ట్ ఫిలింలో రాధిక ఎక్స్ పోజింగ్ ను చూసిన వాళ్లు ఆమె గ్లామర్ కు ఫిదా అయిన నేపధ్యం తెలిసిందే. ఆ తరువాత ఆమెకు చాల సినిమాలలో అవకశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈమె ఏకంగా రజినీకాంత్ తో 'కబాలి' సినిమాలో రజినీ భార్యగా చాల సాంప్రదాయంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమె ఎఫ్ హెచ్ ఎం మ్యాగ్ జైన్ కోసం ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ను చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. ఈ ఫోటో షూట్ కు ఎందరో హీరోయిన్స్ ను ఎంతో హాట్ గా చూపించిన రామ్ గోపాల్ వర్మ కూడ ఫిదా అయిపోవడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. అతిలోక సుందరి శ్రీదేవిని తప్పించి మరే హీరోయిన్ ను పొగడని వర్మ రాధిక ఎక్స్ పోజింగ్ ను చూసి తన గడిచిన మూడు జన్మల్లో ఇంత హాటెస్ట్ అమ్మాయిని చూడలేదంటూ ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

శ్రుతి హాసన్ కి పెళ్లైపొయిందా ?

04:22:00 Add Comment



ఈ మధ్య ఛానల్స్ వాళ్లు కూడా జనాలను టీజ్ చేయడం బాగానే మొదలుపెట్టారు. ఇప్పుడు సౌత్ సుందరి శృతి హాసన్ కూడా అభిమానులను ఆటపట్టించే పెట్టుకుంది. 'నేను భర్తతో కలిసి లంచ్ చేశా' అంటూ శృతి హాసన్ ఫేస్బుక్ ఎకౌంట్ చేసిన పోస్ట్.. వైరల్ అయిపోయింది.

అదేంటీ.. భర్తతో కలిసి శృతి హాసన్ భోజనం చేయడం ఏంటి? అంటే. శృతికి పెళ్లయిపోయిందా? ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుందా? పెళ్లెప్పుడు జరిగింది? ఎవరితో జరిగింది?.. అబ్బో ఇలా తెగ మెసేజ్ లు వచ్చేశాయి. ఇలా బోలెడంత మంది అభిమానులు కంగారు పడిపోయి.. ఆన్సర్ కోసం ఆత్రంగా ఎదురు చూశారు. ఇలా కాసేపు గడిచాక.. అప్పుడు తాపీగా అసలు విషయం చెప్పింది అమ్మడు. ఇంతకీ సంగతేంటంటే.. తన ఫ్రెండ్ - బాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్ కం లిరిక్ రైటర్ అయిన నిరంజన్ అయ్యంగార్ తో కలిసి.. సరదాగా లంచ్ కి వెళ్లింది శృతి హాసన్.

అక్కడ లంచ్ మెనూలో.. పేర్లన్నీ వెరైటీగా కనిపించాయి. హాలీవుడ్ అమెరికన్ డ్రామా సిరీస్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్ లో కేరక్టర్లు - ఎపిసోడ్స్ పేరుతో ఐటెమ్స్ కనిపించాయి. ఇదంతా థ్రిల్లింగ్ గా అనిపించి.. తను కూడా ఫ్యాన్స్ ని థ్రిల్ చేద్దామని భావించిందట శృతి. అందుకే సరదాగా అలా అన్నానంటూ ఆఖర్లో చెప్పింది అమ్మడు. 

మోదీని ఏమీ అనకండి: చంద్రబాబు నాయుడు

04:16:00 Add Comment



ఏపీకి నష్టం వాటిల్లేలా ఏదైనా జరిగితే తెలంగాణ నేతలతో పోలుస్తూ ఏపీ నేతల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తుంటారు. ఏపీ నేతలు పారిశ్రామికవేత్తలు కావటంతోనే వారు గళం విప్పలేకపోతున్నారని మండిపడుతుంటారు. ఏపీ నేతల్లో రాజకీయం పాళ్లు తక్కువని.. వ్యాపార ధోరణే ఎక్కువన్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అయితే.. తమకు అవకాశం ఇవ్వాలే కానీ.. ఎదుటోడు ఎలాంటోడైనా సరే తాట తీస్తామన్నట్లుగా ఏపీ తమ్ముళ్లు గడిచిన రెండు.. మూడు రోజులుగా చెలరేగిపోతున్న తీరు చూసినోళ్లు ఆశ్చర్యపోవటం తెలిసిందే.  

ఏపీకి ప్రత్యేకహోదా లేదని కేంద్రమంత్రి లోక్ సభలో తేల్చేయటం.. ఏపీకి ఇంత అన్యాయం చేస్తారా? అన్న మాటను మిత్రులన్న మొహమాటాన్ని పక్కన పెట్టేసి ఘాటు విమర్శనాస్త్రాల్ని తమ్ముళ్లు షురూ చేయటం తెలిసిందే. వీరి మాటల్లోని పదును చూసిన వారంతా.. ఏపీ తమ్ముళ్లలో విషయం ఉందే అనుకునే పరిస్థితి. అంటే.. ఏపీ నేతలు మాట్లాడగలరన్న మాట. కాకుంటే.. వారి నోటికి పని చెప్పాలంటూ అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు అందితే చాలు చెలరేగిపోతారా? అన్న సందేహం వ్యక్తమవుతున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయినట్లుగా చెబుతున్నారు.
 
ఏపీ ప్రత్యేక హోదా విషయంలో హ్యాండ్ ఇచ్చిన మోడీ సర్కారు తీరుపై మండిపడుతున్న తమ్ముళ్ల స్పీడ్ కు బ్రేకులు వేసినట్లుగా చెబుతున్నారు. తమ్ముళ్ల మాటల మంట ఢిల్లీకి తాకిందని.. డోస్ ఎక్కువైతే లెక్కలో తేడా వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని పార్టీ ముఖ్య నేతలకు చెప్పి.. ఆ విషయాన్ని తమ్ముళ్లకు చేరవేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా తెలుగుదేశం ముఖ్యనేతలతో భేటీ అయిన బాబు.. బీజేపీ మీద విమర్శల డోసు తగ్గించాలన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు. బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ మీద ఫోకస్ పెంచాలని.. వారు విభజన చట్టంలో హోదా విషయం పెడితే బాగుండేదన్న విషయాన్ని ప్రస్తావించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇలాంటిదేమీ లేదని తెలుగు తమ్ముళ్లు కొట్టిపారేస్తున్న నేపథ్యంలో.. తమ్ముళ్లు ఎంతగా చెలరేగిపోతారన్నది చూడటం ద్వారా బాబులు బ్రేకులు వేశారో లేదా తెలుస్తుందని చెబుతున్నారు.

బన్నీ కోరిక ఇంతేనా

10:04:00 Add Comment

మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఇంతమంది హీరోలు వర్ధిల్లుతున్నారంటే అందుకు చిరంజీవే ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ అయినా.. అల్లు అర్జున్ అయినా.. ఇప్పుడు తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నా.. తమకు ఫ్లాట్ ఫామ్ వేసింది చిరంజీవే అని ఒప్పుకుంటారు. ఐతే ఈ మధ్య చిరంజీవి నీడ నుంచి బన్నీ బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని.. తన చుట్టూ ఓ గీత గీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని.. గట్టి ప్రచారం జరిగింది. ఈ విషయంలో అల్లు అరవింద్ బ్యాకప్ ఉన్నట్లు కూడా పుకార్లు వినిపించాయి. ఐతే ఆ మాటలన్నీ అల్లు అరవింద్ వరకు చేరినట్లున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా చిరంజీవిని నెత్తికెత్తుకునే పనిలో పడుతుతున్నాడు అరవింద్. బన్నీ సైతం అవసరం లేకున్నా సరే.. పదే పదే మెగాస్టార్ ప్రస్తావన తెస్తున్నాడు. ఆయన లేకపోతే మేం లేం అనే సంకేతాల్ని తండ్రీ కొడుకులిద్దరూ ఇస్తున్నారు.

‘సరైనోడు’ ప్రి రిలీజ్ ఫంక్షన్లో.. ఆ తర్వాత థ్యాంక్స్ మీట్లో.. అల్లు అరవింద్, బన్నీ చిరంజీవిని ఏ రేంజిలో పొగిడారో తెలిసిందే. తాజాగా విజయవాడలో జరిగిన విజయోత్సవ వేడుకలోనూ తండ్రీ కొడుకులు చిరు నామస్మరణ చేశారు. తన సినిమా 100 కోట్ల గ్రాస్ సాధించడం చాలా సంతోషంగా ఉందని.. అలాగే చిరంజీవి 150వ సినిమా 150 కోట్లు గ్రాస్ వసూలు చేయాలని.. దర్శకుడు వి.వి.వినాయక్‌కు ఇదే విషయం చెప్పానని.. చిన్నప్పట్నుంచి చిరంజీవి మాస్ సినిమాలు చూస్తూ పెరిగానని.. ఇప్పుడు తాను కూడా మాస్ హీరో అనిపించుకోవడం సంతోషంగా ఉందని బన్నీ అన్నాడు. ఇక అరవింద్ మాట్లాడుతూ.. ‘సరైనోడు’ సక్సెస్ మెగా అభిమానులకే చెందుతుందని.. చిరంజీవి 150వ సినిమా ఘన విజయానికి నాంది అన్నారు. ఇద్దరూ అవసరం లేకున్నప్పటికీ చిరు నామస్మరణ చేసి.. ఇదేదో చిరును పొగడ్డమే మిషన్‌గా పెట్టుకున్న ఫీలింగ్ కలిగించారు.

బసవతారకం హాస్పిటల్ కు ప్రైజ్ మనీని అందజేసిన క్రిష్

07:21:00 Add Comment

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురమ్ వంటి డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం కంచె. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా గెలుపొందింది. ఈ అవార్డును మే 3న దర్శకుడు క్రిష్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డుతో వచ్చిన డబ్బును క్రిష్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు ఆర్ధిక సాయంగా అందించారు. గతంలో కూడా ఇదే విధంగా తన పెద్ద మనసుని చాటుకున్నారు. గుంటూరు జిల్లా వినుగొండ దగ్గర కుంచెర్ల గ్రామం.
ఈ గ్రామంలో ప్రాథమిక వైద్యశాల సదుపాయం లేదు, ఎవరైనా ఓ ఎకరం భూమిని ఇస్తే హాస్పిటల్ కడతామని ప్రభుత్వం తెలియజేసినప్పుడు క్రిష్ తన పేర ఉన్న ఎకరం భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రభుత్వం క్రిష్ తాతయ్య జాగర్లమూడి రమణయ్య చౌదరి, సీతారామమ్మ పేరిట నెలకొల్పిన ప్రభుత్వాసుపత్రిని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అదే తరహాలో ఇప్పుడు తనకు వచ్చిన ప్రైజ్ మనీని కూడా క్రిష్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు అందజేయడం గమనార్హం. తన తల్లితో పాటు పలువురు వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్న బసవతారం ఇండో అమెరికన్ హాస్పిటల్ కు ఈ డబ్బును ఇవ్వడం సంతోషంగా ఉందని క్రిష్ తెలియజేశారు

పవన్ కళ్యాణ్ ఫెక్సీలతో రాజధాని ప్రాంత రైతులు

07:07:00 Add Comment

ఏపీ రాజధానికి చెందిన కొన్ని గ్రామాలు (ఉండవల్లి.. పెనుమాక మరికొన్ని) ఏపీ సర్కారు చేస్తున్న భూసేకరణను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

గతంలో ఇదే అంశం మీద కొన్ని గ్రామాల వారు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించటం.. దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయా గ్రామాల్లో సందర్శించి.. అక్కడి వారి వాదన వినటం తెలిసిందే.ఈ సందర్భంగా భూములు ఇచ్చేందుకు ఇష్టపడే వారి వద్దనే సేకరించాలని.. ప్రభుత్వం బలవంతంగా భూముల్ని సేకరించకూడదని అల్టిమేటం ఇవ్వటం.. ఆ తర్వాత ఏపీ సర్కారు భూసేకరణను తాత్కాలికంగా వాయిదా వేయటం జరిగింది. 

అయితే.. తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించాలంటూ  ప్రభుత్వం తమకు నోటీసులు ఇస్తుందంటూ ఉండవల్లి.. పెనుమాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన అంశంపై పవన్ స్పందించాలంటూ వారు పవన్ ఫ్లెక్సీల్ని తమ పొల్లాల్లో వేలాడదీయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

నవ్యాంధ్రకు కేంద్రం నుంచి అరకొర సహాయమే

06:35:00 Add Comment

నవ్యాంధ్రకు కేంద్రం నుంచి అరకొర సహాయమే అందిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన ‘నీరు - ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిల్లిపాలెంలో రూ. 10కోట్లతో నిర్మించిన రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం పట్టణంలో రూ. 15కోట్ల వ్యయంతో నిర్మించనున్న కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, వెనుకబడిన ప్రాంతాలకు, రాజధానికి నిధులను ఇవ్వాల్సి ఉంది. సాయం కొంతే జరిగింది. ఇంకా ఎంతో జరగాల్సి ఉంది’’ అని తెలిపారు. నవ్యాంధ్ర తలసరి ఆదాయం రూ.95వేలుంటే తెలంగాణకు రూ.1.29 లక్షలు ఉందన్నారు.
 
ఆదాయంలో తెలంగాణతో పోల్చితే ఏపీ 11శాతం వెనుక ఉందని తెలిపారు. ‘‘చాలా విషయాల్లో మనం వెనుకబడ్డాం. అందుకే ఇతర రాషా్ట్రలతో సమానంగా ఎదిగే వరకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం’’ అని తెలిపారు. రెండో విడత రుణమాఫీకి ఈ నెలలో రూ.3,200కోట్లు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకున్నా ప్రజల కోసం ఈ పని చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.3వేల చొప్పున ఇస్తామని, నాలుగేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ప్రతి డ్వాక్రా మహిళ నెలకు రూ. 10వేలు ఆదాయం సమకూరేలా ప్రణాళికలు తయారుచేస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ విషయంలో మిగులు సాధించామని, ఈ-పాస్‌ ఏర్పాటుతో రేషన్‌ దుకాణాల్లో అవకతవకలు నిర్మూలించామని చెప్పారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. మెట్ట భూముల్లో సాగుకు వీలుగా 15వేల రెయిన్‌గన్స్‌ ఆర్డర్‌ ఇచ్చామన్నారు.
 బీజేపీ మతతత్వ పార్టీ

బీజేపీ మతతత్వ పార్టీ

06:32:00 Add Comment
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీనే కారణమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. గురవారం విజయవాడలో జలీల్ ఖాన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పుడు ఏపీకి సహాయం చేయడంలో కూడా బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆయన అభివర్ణించారు.
తలకిందులుగా తపస్సు చేసినా ఏపీలో మాత్రం బీజేపీ బలపడదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేయొచ్చుకానీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబును మాత్రం తిట్టోద్దు అని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. కేంద్రంలో మంత్రి పదవులకు టీడీపీ నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై కొన్నాళ్లు వేచి చూస్తామని జలీల్ ఖాన్ వెల్లడించారు.

ఉచిత విద్యుత్

06:28:00 Add Comment

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మే 16 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలను ఆకర్షించే పలు పధకాలను ఈ మేనిఫెస్టోలో ఏఐఏడీఎంకే పొందుపరచింది.

► ఇంటికో ఉద్యోగం
► రూ. 10 లక్షల వరకు గృహరుణాలు
► ఉద్యోగం చేస్తున్న మహిళలకు స్కూటీల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ
► 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
► అమ్మ బ్యాంకింగ్స్ కార్డు
► రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహానికి ఉచిత మొబైల్
► విద్యార్థులకు ఫ్రీ వై-ఫై
►గర్భిణీ స్త్రీలకు ఇచ్చే మొత్తం 12 వేల నుంచి 18 వేలకు పెంపు
► రైతులకు రుణమాఫీ
► సంక్రాంతికి రూ. 500 గిఫ్ట్
► ప్రతి ఇంటికి ఉచిత సెటప్ బాక్స్
► అన్ని బస్ స్టేషన్లు, వాణిజ్య సముదాయాల్లో ఉచిత వైఫై

సోనియాకు నల్లజెండాలతో నిరసన

11:21:00 Add Comment


ఎన్నికల ప్రచారానికి చెన్నై రానున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని విద్యార్థుల సమాఖ్య ప్రకటించింది. శాసనసభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సోనియాగాంధీ గురువారం నగరానికి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీలంకలో ఈళం తమిళుల వూచకోతకు, శ్రీలంకకు ఆయుధ సహాయాన్ని అందించడానికి సోనియాగాంధీ ప్రధాన కారకురాలని, అందువల్ల ఆమె రాకను పురస్కరించుకుని నల్లజెండాలతో నిరసన తెలుపుతామన్నారు. దీనికోసం అనుమతి కోరుతూ నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో విద్యార్థుల సమాఖ్య కన్వీనర్లు పార్వైదాసన్‌, లయోలా మణి తదితరులు వినతిపత్రం అందజేశారు.

త్వరలో ప్రచారానికి చిరంజీవి

11:19:00 Add Comment



తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్‌ అధిష్టానం ప్రచార సారథుల పేర్లను వెల్లడించింది . రాష్ట్రంలో పోటీ చేసే కాంగ్రెస్‌, డీఎంకే అభ్యర్థుల తరపున టాలీవుడ్‌ మెగాస్టార్‌, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రచారం చేయనున్నారు. అలాగే, సినీ నటి ఖుష్బూతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అలాగే, కర్ణాటక మంత్రి శివకుమార్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌, కేంద్ర మాజీమంత్రులు గులాం నబీ ఆజాద్‌, ముకుల్‌ వాస్నిక్‌, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, మల్లికార్జున ఖర్గే, తిరునావుక్కరసర్‌, శోభా ఓఝాతో పాటు మొత్తం 40 మంది ప్రముఖులు ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే చిరంజీవి వెంట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ధనుష్కోడి ఆదిత్యన్‌, కేపీ కృష్ణమూర్తి, మణిశంకర్‌ అయ్యర్‌, జేఎం హారూన్‌, పి.విశ్వనాథన్‌, పీటర్‌ ఆల్ఫోన్స్‌ తదితరులు ఉంటారు.

ప్రేమమ్ సినిమాకి నాగార్జున వాయిస్ ఓవర్..?

00:04:00 Add Comment

ఇంతవరకు తన కొడుకులు సినిమాలు చేస్తున్నాసరే చేస్తున్నారులే అంటూ పెద్దగా కేర్ తీసుకొని తండ్రి ఇప్పుడు స్వయంగా ఆయా సినిమాల విషయంలో డైరెక్ట్ గా రంగంలోకి దిగాడు? ఇంతకి ఆ తండ్రి కొడుకులు ఎవరో తెలుసా ! ఇంకెవరు నాగార్జున .. నాగ చైతన్య ? ఆ వివరాల్లోకి వెళితే ఊపిరి తరువాత నాగార్జున తన కొడుకులపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ఇప్పటికే నాగ చైత్రన్య హీరోగా నటిస్తున్న ప్రెమమ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడట !! మరొఅ వైపు అఖిల్ సినిమాకోసం గట్టిగానే సన్నాహాలు జరుగుతున్నాయి. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం లో రూపొందుతున్న సూపర్ హిట్ ప్రెమమ్ సినిమా కు నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా ఆ సినిమాకు హైప్ వచ్చే చాన్స్ ఉంది కాబట్టి నాగార్జున రంగంలోకి దిగాడట !! శృతి హసన్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.