కృష్ణా పుష్కరాలకు పశ్చిమ గోదావరి జిల్లా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా ఈస్ కోస్ట్ రైల్వే ఐదు ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. పుష్కరం స్పెషల్ ట్రైన్ పేరుతో ఈ రైళ్ళను నడపనున్నారు. రాయగడ్ నుంచి కృష్ణా కెనాల్ జంక్షన్‌కు ట్రైన్ నెంబరు 08505 ఆగస్టు 11, 16, 19, 22న రాయగడ్‌లో మధ్యాహ్నం 2.30 (14.30) గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటలకు కృష్ణాకెనాల్ జంక్షన్‌కు చేరుకుంటుంది. ట్రైన్ నెంబరు 08506 కృష్ణాకెనాల్ జంక్షన్ నుంచి రాయగడ్‌కు రాత్రి 8.45 (20.45) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు రాయగడ్ చేరుకుంటుంది. ఈ రైలు కృష్ణాకెనాల్ జంక్షన్ నుంచి ఆగస్టు 12, 17, 20, 23 తేదీల్లో ప్రయాణిస్తుంది. ఈ రెండు రైళ్ళు మార్గమధ్యంలో ఇరువైపులా పార్వతీపురం టౌన్, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, డొంకినవలస, గజపతినగరం, గరుగుబిల్లి, కొత్తవలస, సింహాచలం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, గుణదల, విజయవాడలలో ఆగనుంది. అంతేకాక ప్రధాన రైల్వేస్టేషన్లయిన రాయగడ్, విజయనగరం, విశాఖపట్నంలలో ఎక్కువ సమయం ఆగుతుంది. ఈ రైళ్లలో సెకండ్ క్లాస్ సిట్టింగ్ 10 బోగీలు, స్లీపర్‌క్లాస్ మూడు బోగీలు, ఏసి 3-టైరు ఒక బోగి, గార్డు కం లగేజీ వ్యాన్స్ రెండు ఉంటాయని తెలిపారు.
విశాఖపట్నం - గుంటూరు జంక్షన్ - విశాఖపట్నం
విశాఖపట్నం నుంచి ట్రైన్ నెంబరు 08507 ఆగస్టు 11, 12, 13, 14, 16, 17, 19, 20, 21, 22 తేదీలలో రాత్రి 11 (23.00) గంటలకు బయలుదేరి గుంటూరుకు, మరుసటిరోజు ఉదయం 6.45 గంటలకు చేరుకుంటుంది. ట్రైన్ నెంబరు 08508 గుంటూరులో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.20 (17.20) గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 12, 13, 14, 15, 17, 18, 20, 21, 22, 23 ఈ రెండు రైళ్ళు విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, గుణదల, మంగళగిరిలలో కూడా ఆగుతాయి. ఈ రైళ్ళలో గార్డుకం లగేజీ వ్యాన్స్ రెండు బోగీలు, సెకండ్ సిట్టింగ్ ఎనిమిది బోగీలు, స్లీపర్ క్లాసెస్ ఐదు బోగీలు ఉంటాయి.
విజయవాడ - విశాఖపట్నం - విజయవాడ
విజయవాడలో ట్రైన్ నెంబరు 07753 రాత్రి 11.30 (23.30) గంటలకు బయలుదేరి విశాఖపట్నం మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగస్టు 11, 12, 13, 14, 18, 19, 20, 21 తేదీల్లో ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి ట్రైన్ నెంబరు 07754 ఉదయం 8.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.50 (15.50) గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్ళు విజయవాడ, గుణదల, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నంలలో ఆగుతాయి. ఈ రైలులో గార్డు కం లగేజీ వ్యాన్స్ రెండు, సెకండ్ సిట్టింగ్ ఐదు బోగీలు, స్లీపర్‌క్లాస్ ఏడు బోగీలు, 3-టైర్ ఏసి రెండు బోగీలు, 2-టైర్ ఏసీ ఒక బోగి మొత్తం 17 బోగీలతో రైలు ఇరువైపులా ప్రయాణిస్తుంది.
పూరీ - గుంటూరు - పూరీ
పూరీ నుంచి ట్రైన్ నెంబరు 08405 ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగస్టు 11, 16, 19, 22 తేదీలలో ప్రయాణిస్తుంది. గుంటూరు నుంచి ట్రైన్ నెంబరు 08406 రాత్రి 7 (19.00) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.25 గంటలకు పూరీ చేరుకుంటుంది. మార్గ మధ్యంలో ఉన్న అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ రెండురైళ్ళు ఆగుతాయి. గార్డ్ కం లగేజీవ్యాన్‌లు రెండు బోగీలు, సెకండ్‌సిట్టింగ్ 9 బోగీలు, స్వీపర్ క్లాసులు మూడు బోగీలు, 3-టైర్ ఏసీ ఒక బోగి ఉంటుంది.
తిరుపతి - విశాఖపట్నం - తిరుపతి
తిరుపతి నుంచి ట్రైన్ నెంబరు 07747 మధ్యాహ్నం 2 (14.00) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.45 గంటలకు విశాఖపట్నం చేరుకుటుంది. ఈ రైలు ఆగస్టు 12, 19 తేదీల్లో మాత్రమే ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి ట్రైన్ నెంబరు 07748 ఉదయం 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.45 (19.45) గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైను ఆగస్టు 13, 20 తేదీల్లో మాత్రమే ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో గూడూరు, కృష్ణాకెనాల్, రాజమండ్రిలతో పాటు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుణదల, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, రేణుగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్ళలో గార్డు కం లగేజీ వ్యాన్‌లు రెండు, సెకండ్ క్లాస్ సిట్టింగ్ బోగీలు ఆరు, స్లీపర్ క్లా్‌స బోగీలు ఏడు, 3-టైర్ ఏసీ బోగీ ఒకటి, 2-టైర్ ఏసీ బోగీ ఒకటి ఉన్నాయి.









