అల్లు అర్జున్ - హరీష్ శంకర్ - దిల్ రాజు ల భారీ చిత్రం త్వరలో ప్రారంభం

10:27:00 Add Comment

వరుస విజయాలతో దూసుకుపోతోన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా, మాస్ కథలను జనరంజకంగా తీసి బ్లాక్బస్టర్ హిట్స్ సాధించిన హరీష్ శంకర్ దర్శకత్వం లో, భారీ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. 
ఏడు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్ - దిల్ రాజు కంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుంది. హరీష్ శంకర్ - దేవీ శ్రీ ప్రసాద్ కంబినేషన్ కూడా 4 సంవత్సరాల తరువాత కుదరటం తో, ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడనున్నది. అటు అల్లు అర్జున్ కి, ఇటు హరీష్ శంకర్ కి శ్రీ వెంకటేశ్వర క్రెయేషన్స్ బ్యానర్ లో ఇది మూడవ చిత్రం కావటం విశేషం. 
భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ చిత్రాన్ని 2017 వేసవి సెలవుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు  నిర్మాత దిల్ రాజు తెలిపారు. 
"ఆర్య, పరుగు చిత్రాల అనంతరం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మా బ్యానర్ లో 7 సంవత్సరాల తరువాత చేస్తోన్న చిత్రం ఇది. అలాగే సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం విజయం తరువాత హరీష్ శంకర్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందం గా ఉంది.  బన్నీ ఇమేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి పెర్ఫెక్ట్ గా సరిపడే కథ ను హరీష్ శంకర్ రెడీ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం", అని నిర్మాత దిల్ రాజు అన్నారు. 
ఇతర ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 

ఏపీ భ‌వ‌న్ మా ఆస్తి. అది మాకే ద‌క్కాలి టీ-సీఎం కేసీఆర్‌

00:10:00 Add Comment

ఏపీ భ‌వ‌న్ మా ఆస్తి. అది మాకే ద‌క్కాలి అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కి లేఖ రాశారాయ‌న‌. మా క‌ల్చ‌ర్ కోసం భ‌వంతులు నిర్మించుకుంటాం. ముందు ఏపీ నుంచి స్వాధీన‌ప‌ర్చండి అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. “విదేశీ వ్యవహారాల శాఖ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936లో ఢిల్లీలో 18.18 ఎకరాల స్థలాన్ని భారత ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలో ప్రస్తుత హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఏపీ భవన్ ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో హైదరాబాద్ హౌజ్‌ను కేంద్రం స్వాధీనం చేసుకుంది. 7.56 ఎకరాల పటౌడీ హౌస్, 1.21 ఎకరాల నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను అప్పటి ఏపీ ప్రభుత్వానికి కేటాయించింది. ఆరో నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో దేశంలో విలీనమైన తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్‌కే బదిలీ అయింది. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు సదరు స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. రెండేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ స్టేట్‌కు బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. దాన్ని ఏపీ, తెలంగాణకు విభజించటం కుదరదు“ అంటూ సీఎం స్ప‌ష్టంగా లేఖ‌లో పేర్కొన్నారు.
నాడు మద్రాస్ నుంచి ఆంధ్రా వేరుపడింది కాబ‌ట్టి ఢిల్లీలో ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సింది. లేదూ జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాస్ (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రానికి ఉన్న స్థలంలో ఆంధ్రకు వాటా ఇవ్వాల్సింది. చ‌రిత్ర‌ను, ఆధారాల్ని ప‌రిశీలించి ఏపీ భవన్‌ని మాకు ఇచ్చేయాల్సిందే… అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. అందుకు ప్రతిగా ఏపీకి స్టేట్ భవన్, రెసిడెంట్ కమిషనర్ ఆఫీసుల కోసం ఢిల్లీలో వేరొక స్థ‌లం కేటాయించుకోండ‌ని కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. జనాభా ధామాషా నిష్పత్తి ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంద‌ని అన్నారు.

150 థియేటర్లలో ‘ఇండిపెండెన్స్‌ డే’

10:12:00 Add Comment



తమిళనాట ఆంగ్ల చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ‘జంగిల్‌ బుక్‌’, ‘కాంజ్యురింగ్‌ 2’ సినిమాలు కూడా విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో 24న ‘ఇండిపెండెన్స్‌ డే’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో కలసి తమిళనాడు వ్యాప్తంగా 150 పైచిలుకు థియేటర్లలో విడుదలవున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళ అనువాదంలో మాత్రం 80 థియేటర్లలో విడుదలవుతోంది. రొనాల్డ్‌ ఎమిరిచ్‌ దర్శకత్వంలోని ఈ సినిమా ట్రైలర్‌ ప్రస్తుతం హాలీవుడ్‌ సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. రెండు మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1996లో రొనాల్డ్‌ ఎమిరిచ్‌ దర్శకత్వంలో ‘ఇండిపెండెన్స్‌ డే’ సినిమా విడుదలైంది. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత దానికి అనుసంధానంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 500 దుకాణాలను మూసివేత

22:45:00 Add Comment


దశలవారీగా మధ్య నిషేధం అమలు చేస్తామన్న హామీలో భాగంగా తొలుత 500 టాస్మాక్‌ దుకాణాలను మూసివేతకు ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో ‘టాస్మాక్‌ మద్యం దుకాణాల సమయాన్ని కుదిస్తాం, దుకాణాల సంఖ్యను విడతలవారీగా తగ్గిస్తామ’ని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొంది మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జయలలిత... తొలుత టాస్మాక్‌ దుకాణాల పని వేళలను తగ్గించారు. దీంతో ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తెరుచుకునే దుకాణాలు... మే 24వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభిస్తున్నాయి. ఈ స్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా 500 దుకాణాలను ఆదివారం నుంచి మూసివేయాలని శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జాబితాను జయలలిత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన ప్రకటనలో.. మూసి వేస్తున్న టాస్మాక్‌ దుకాణాలలో మిగిలి ఉన్న మద్యాన్ని గోదాముకు తరలించాలని తెలిపారు. ఆ దుకాణాలలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌, సహాయకులకు అదే జిల్లాలోని ఇతర ప్రభుత్వ దుకాణాలలో కాంట్రాక్టు పద్ధతిలోనే ఉపాధి కల్పిస్తామన్నారు. మే నుంచి సగటున రోజుకు రూ. మూడు లక్షలకు మించి మద్యం విక్రయాలు జరుగుతున్న దుకాణాలలో అదనంగా ఒక సూపర్‌వైజర్‌ను నియమిస్తామని తెలిపారు. రోజుకు రూ. ఒక లక్షకు మించి విక్రయించే చోట అదనంగా సేల్స్‌మెన్‌నుగానీ, సహాయకుణ్ని కానీ నియమిస్తామని చెప్పారు. 

30 ల‌క్షల పెట్టుబ‌డి.. 13 కోట్ల వ‌సూళ్లు..

22:54:00 Add Comment

విజ‌య్ ఆంటోనీ హీరోగా శీను ఫేమ్ శ‌శి త‌మిళంలో రూపొందించిన ‘పిచ్చైకార‌న్’ చిత్రం తెలుగు అనువాద హ‌క్కుల్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు కేవ‌లం రూ.30 ల‌క్ష‌ల‌కే సొంతం చేసుకోవ‌డం విశేషం. డ‌బ్బింగ్ ప‌నుల కోసం ఇంకొన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చ‌య్యాయి. బిచ్చ‌గాడు పేరుతో గ‌త నెల 13న ఏమాత్రం అంచ‌నాల్లేకుండా విడుద‌లైందీ సినిమా.స‌రైన ప్ర‌మోష‌న్ కూడా లేక‌పోవ‌డంతో మొదట్లో ‘బిచ్చగాడు’ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐతే కొన్ని రోజులు గడిచాక సినిమా చాలా బావుందన్న మౌత్ టాక్ స్ప్రెడ్ అయి.. నెమ్మదిగా జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. బిచ్చ‌గాడు వ‌చ్చిన త‌ర్వాతి వారం విడుద‌లైన‌ ‘బ్రహ్మోత్సవం’కు డిజాస్ట‌ర్ టాక్ రావ‌డం క‌లిసొచ్చి ఈ సినిమాకు ఆదరణ మరింత పెరిగింది. మహేష్ సినిమాను తీసేసి మరీ కొన్ని చోట్ల ‘బిచ్చగాడు’కు థియేటర్లు ఇవ్వడం విశేషం. రెండో వారాంతం నుంచి సాగుతుఉన్న ‘బిచ్చగాడు’ హ‌వా ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. నెల త‌ర్వాత కూడా సినిమా బాగా ఆడుతోంది. ఇప్ప‌టిదాకా ఈ చిత్రం రూ.13 కోట్ల గ్రాస్ సాధించ‌డం విశేషం.

'జవాన్'గా వస్తున సుప్రీమ్ హీరో !

21:25:00 Add Comment

సుప్రీమ్ మూవీతో వరుసగా మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించాడు సాయిధరం తేజ్. చైల్డ్ సెంటిమెంట్ - కామెడీ కంటెంట్ లకు.. కరెక్ట్ టైమింగ్ కూడా జోడవడంతో.. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తేజు.. కొత్త ప్రాజెక్టులను ఓకే చేయడంలో తెగ స్పీడ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే తిక్క టైటిల్ పై రూపొందుతున్న మూవీని ఫినిషింగ్ స్టేజ్ కి తెచ్చిన సాయిధరం తేజ్.. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నాడు. తిక్క కాకుండా ఇప్పటికే రెండు సినిమాలను తేజు ఓకే చేసేశాడు. ఒకటి బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందనుండగా.. మరొకటి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనుంది. తిక్క తర్వాత వెంటనే బీవీఎస్ రవి చిత్రాన్నే స్టార్ట్ చేస్తాడట తేజు. ఈ మూవీని కృష్ణ అనే నిర్మాత ప్రొడ్యూస్ చేయనుండగా.. ఇతను పూరీ జగన్నాథ్ - జూనియర్ ఎన్టీఆర్ లకు సన్నిహితుడు. ఇప్పటికే సాయిధరం తేజ్ కి సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ ఓ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో.. ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే 'ఇంటికొక్కడు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంటుందట. మొత్తానికి టైటిల్ లోనే మాంచి పవర్ చూపిస్తున్న సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్ మూవీలో.. అంతకంటే ఎక్కువగానే కంటెంట్ ఉంటుందని  డైరెక్టర్ బీవీఎస్ రవి అంటున్నాడు.