గ్రేటర్ విశాఖపట్నం ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతాడని న్యూస్ హల్ చల్ చేస్తోంది. జనసేన కార్యకర్తలమని చెప్పుకునే కొందరు యూత్ లీడర్స్ వైజాగ్ లో ఇప్పుడు నానా హంగామా సృష్టిస్తున్నారు. వైజాగ్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని కన్ఫామ్ చేసేస్తున్నారు. ఇక పవన్ స్టార్ మాత్రం ఇప్పటివరకూ వైజాగ్ లో పోటీ చేసే విషయంలో ఒక ప్రకటన కూడా చేయలేదు. గతంలో మున్సిపల్ ఎన్నికలను లైట్ తీసుకునే వారేమో కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. కీలక నగరాల్లో పాగా వేస్తే రాజకీయంగా తిరుగు ఉండదనే వాస్తవాన్ని పార్టీలు గుర్తించాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇలానే పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన విశాఖ కూడా పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అందుకే టీడీపీ, వైసీపీ సహా ఇతర ప్రధాన పార్టీలు వైజాగ్ పీఠంపై కన్నేశాయి. అందుకే ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. మాజీ ఎంపీ , గతంలో వైజాగ్ మేయర్ గా పనిచేసిన సబ్బం హరికి గాలం వేసేందుకు అటు బీజేపీ, ఇటు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే రకరకాల సమీకరణాలు, నాయకులు, వ్యూహాలు ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు వైజాగ్ లో మోహరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి సింగిల్ వ్యూహం కూడా లేని, అసలు ఇప్పటివరకూ పోటీ చేస్తారో చేయారో తెలియని జనసేన పార్టీ విశాఖలో జెండా ఎలా పాతగలదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ మేనియా వైజాగ్ లో పనిచేయదని, వలసలు ఎక్కువగా ఉండే ఈ నగరంలో భిన్న రాజకీయ వ్యూహాలే పనిచేస్తాయని చెప్తున్నారు.
Popular Tags
Showing posts with label andhra pradesh. Show all posts
Showing posts with label andhra pradesh. Show all posts
విశాఖకు సముద్ర జలాల్లోకి ఉగ్రవాదులు !!
andhra pradeshనవ్యాంధ్రలోని ప్రధాన నగరం విశాఖపట్నం ఇప్పుడు తీవ్రమైన ఉగ్రముప్పును ఎదుర్కొంటోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులు విశాఖపై జరగవచ్చని ఇంటిలిజెన్సు అధికారులు హెచ్చరిస్తున్నారు. లష్కరే తోయిబా (ఎల్ఇటి), జైషే మొహమ్మద్ (జెఇఎం), ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు విశాఖపై గురిపెట్టినట్టు ఇంటిలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. శ్రీలంకలో ఇటీవల ఐఎస్ఐఎస్ ఏజెంట్లను అరెస్ట్ చేసి, వారిని విచారిస్తున్నప్పుడు ఉగ్రవాదులు విశాఖను టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటిలిజెన్స్ అధికారులు భద్రతా దళాలను అప్రమత్తం చేశారు.
విశాఖలో తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉంది. తీర భద్రతతో నౌకాదళం నిరంతరం అప్రమత్తంగానే ఉంటోంది. తూర్పు నౌకాదళం కేంద్రంగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఎప్పుడూ అక్కడే లంగరు వేసి ఉంటాయి. దీన్ని ఆనుకునే పోర్టు, హార్బర్ ఉన్నాయి. అలాగే గంగవరం పోర్టు, స్టీల్‌ప్లాంట్, ఎన్టిపిసి ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులు నౌకాదళ స్థావరాలను టార్గెట్‌గా చేసుకున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
విశాఖకు సముద్ర జలాల్లోకి శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు అవకాశాలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే స్లీపర్ సెల్స్ విశాఖలో సంచరిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక పంపించారు. విశాఖలో భద్రతా పరంగా కొన్ని లోపాలున్నాయి. వాటిని సవరించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. అలాగే షాపింగ్ మాల్స్, జన సమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో భద్రత, నిఘాను ముమ్మరం చేయాలని ఇంటిలిజెన్స్ అధికారులు ఆ నివేదికలో సూచించినట్లు తెలిసింది. దీంతో విశాఖ, పరిసర గ్రామాల్లోని సాగర తీరంపై నిఘా పెంచుతున్నారు. అంతేకాకుండా సిటీలో కూడా తనిఖీలు పెంచారు
వైసీపీ గడపగడప సర్వేపై మండిపడ మంత్రి పత్తిపాటి పుల్లారావు
andhra pradeshగుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ గడపగడప సర్వేపై మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ చేసే నైతికహక్కు వైసీపీకి - జగన్ కు లేదని అన్నారు. తొలుత తన పనితీరు - తనపై ఉన్న అవినీతి ఆరోపణలు - ఆస్తుల ఆటాచ్ మెంట్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని పత్తిపాటి సూచించారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చామని రానున్న మూడేళ్లలో మరికొన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గడపగడపకూ వెళితే జగన్ కు - ఆయన పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పుల్లారావు అన్నారు. వైసీపీని విడిచి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోయారో? నీ ప్రవర్తన ఎలా ఉందో? ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని జగన్ కు హితవు పలికారు. అంతగా జగన్ కు ప్రజాబలం ఉందని భావిస్తే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ఆ ఎమ్మెల్యేలు నెగ్గితే జగన్ ప్రజాబలంపై స్పష్టత వస్తుందని అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని పుల్లారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అవినీతికి పాల్పడినవారిలో అనేక మంది జగన్ వద్దే ఉన్నారని వారి గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మంత్రి సూచించారు.
ఏపీ రాజధాని ప్రాంత ప్రజలకు ఊహించలేని ఒక కానుక
andhra pradesh
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని తమిళనాడు.. కర్ణాటక.. బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకం ?
andhra pradeshఅనంతపురంలో నిరవధిక దీక్షలు
andhra pradeshవామపక్షాల ఆధ్యర్యంలో ప్రదర్శనలు - సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ - ఆందోళనలకు సిద్ధమౌతున్న వైసిపి, కాంగ్రెస్ ప్రజాశక్తి - యంత్రాంగం రాష్ట్రంలో ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు అంశం వేడెక్కుతోంది. అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరుగుతుం డటంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఈ విషయంపై మాట్లాడక తప్పనిస్థితి ఏర్పడుతోంది. అనంతపు రంలో ఆదివారం నాడు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ప్రారంభమైనాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయి తమ సంఘీభావం ప్రకటించారు. పలు ప్రజాసంఘాలు ఈ ఆందోళనలకు మద్దతు తెలిపాయి. వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదాల సాధన కోసం ప్రదర్శనలు సాగాయి. వైసిపి, కాంగ్రెస్ పార్టీలూ పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమౌతున్నాయి. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపికి చెందిన సీనియర్ నేతలతో సమావేశమైనారు. హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెబుతూనే, విమర్శలు చేయవద్దని సూచించారు. కేంద్రం ఇప్పటిదాకా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలకు సంబంధించి సమగ్ర నివేదిక తయారుచేయాలని ఆదేశిం చారు. అదే సమయంలో కేంద్ర మంత్రిమండలి నుండి బయటకు వస్తే ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ అక్కడక్కడ అధికార పార్టీలోనూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. అధికారికంగానూ, అనధికారికంగానూ ఆ పార్టీ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. తాము ఎంత సర్ధుకుపడి పోవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదని చెప్పారు. కేంద్ర మంత్రులు నీతిఅయోగ్ అంటూ హోదా అంశాన్ని వాయిదా వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, హోదా ఆలస్యమయ్యే కొద్దే సమస్యలు మరింత పెరుగుతాయని చెప్పారు. తమిళనాడు, కర్నాటక, బీహార్ ముఖ్యమంత్రులే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు.
Subscribe to:
Posts (Atom)




